
భువనేశ్వర్ : బంధువైన ఓ టీనేజర్‌తో సహజీవనం చేస్తున్నానని సంచలన ప్రకటన చేసిన భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్‌పై ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆమె బంధాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని, బిడ్డలాంటి అమ్మాయితో సహజీవనం ఏంటని ద్యుతీ తల్లి అఖోజీ చంద్ ప్రశ్నించగా.. ద్యుతీని భయపెట్టి, బ్లాక్‌మెయిల్ చేయడం వల్లే అలా మాట్లాడుతుందని ఆమె సోదరి సరస్వతి చంద్ ఆరోపించారు. అయితే తన కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోయిన ఈ విషయంలో వెనక్కు తగ్గే ముచ్చటే లేదని ద్యుతిచంద్ మరోసారి స్పష్టం చేసింది. తన కుటుంబ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ మంగళవారం మీడియాతో మాట్లాడింది.
తనను ఎవరు బ్లాక్‌మెయిల్ చేయలేదని, తన అక్కనే రూ.25లక్షలు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేసిందని బాంబుపేల్చింది. ‘నా సొంత అక్కనే నన్ను బ్లాక్ మెయిల్ చేసింది. రూ. 25 లక్షలు ఇవ్వాలని నన్ను అడిగింది. ఇవ్వకపోవడంతో కొట్టింది కూడా. ఈ విషయంపై నేను పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాను. ఇప్పటికీ మా అక్క బెదిరిస్తూనే ఉంది. దీంతోనే నేను నా బంధాన్ని నలుగురికి చెప్పుకోవాల్సి వచ్చింది’ అని పేర్కొంది. ‘ఔను... నేను 19 ఏళ్ల టీనేజ్ అమ్మాయితో సహజీవనం చేస్తున్నా. ఆమె నా బంధువు. మా ఊర్లోనే ఉంటుంది. భువనేశ్వర్ కాలేజిలో బీఏ రెండో సంవత్సరం చదువుతోంది. నేనెప్పుడు ఊరెళ్లినా ఆమెతోనే గడుపుతాను. ఆమెకూ సహజీవనం ఇష్టం కాబట్టే మా బంధం కొనసాగుతోంది. భవిష్యత్తులోనూ ఆమెతోనే నా జీవితం ముడిపడుతుంది’ అని 23 ఏళ్ల ద్యుతీ బాహటంగా స్వలింగ సహజీవనంపై పెదవి విప్పింది.
బిడ్డలాంటి ఆమెతో సహజీవనమా? ద్యుతీ తల్లి ఫైర్
Comments
Please login to add a commentAdd a comment