చండీగఢ్: కరోనా వైరస్ బారిన పడ్డ భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్‌ను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆసుపత్రిలో చేర్పించామని ఆయన కుమారుడు, స్టార్ గోల్ఫర్ జీవ్ మిల్కాసింగ్ తెలిపారు. గత బుధవారం ‘పాజిటివ్’గా రావడంతో 91 ఏళ్ల మిల్కా సింగ్ చండీగఢ్‌లోని తన ఇంట్లో చికిత్స తీసుకుంటున్నారు. మిల్కా సింగ్ 1958 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం, 1958 టోక్యో, 1962 జకార్తా ఆసియా క్రీడల్లో నాలుగు స్వర్ణాలు నెగ్గారు. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల విభాగంలో నాలుగో స్థానంలో నిలిచారు.
అయినప్పటికీ ట్రాక్‌పై ఆయన చూపిన తెగువతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కాగా కోవిడ్ బారిన పడిన అనంతరం మిల్కా సింగ్ మాట్లాడుతూ.. తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని, అయితే జాగింగ్ నుంచి తిరిగి వచ్చాక కాస్త అలసటగా ఉండటంతో కోవిడ్ పరీక్ష చేయించుకున్నానని తెలిపారు, తనకు పాజిటివ్‌గా నిర్ధారణగా కావడం ఆశ్చర్యానికి గురిచేసిందని, త్వరలోనే కోలుకుంటానని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment