భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ ద్యుతీచంద్ తన గర్ల్‌ఫ్రెండ్ మోనాలీసాను పెళ్లి చేసుకున్నట్లు వార్తలు రావడం ఆసక్తి కలిగించింది. గతంలోనే ద్యుతీచంద్ తనను తాను గే(GAY)గా ప్రకటించుకుంది. భారత్ నుంచి స్వలింగ సంపర్కాలిగా ప్రకటించుకున్న తొలి భారత అథ్లెట్‌గా ద్యుతీచంద్ నిలిచింది. గర్ల్‌ఫ్రెండ్ మోనాలీసాతో లివింగ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు 2019లో తెలిపింది.
తాజాగా డిసెంబర్ 4న(శుక్రవారం) తన గర్ల్‌ఫ్రెండ్ మోనాలిసాతో కలిసి దిగిన ఫోటోలను ద్యుతిచంద్ తన ట్విటర్‌లో షేర్ చేసుకుంది. ‘నిన్ను ప్రేమించా. ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నా. ఈ ప్రేమ ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది’ అని ట్యాగ్ లైన్ ఇచ్చింది. అయితే వీరిద్దరు పెళ్లి చేసుకున్నారన్న వార్తల్లో నిజం లేదు. ద్యుతీచంద్ తన సోదరి పెళ్లి వేడుకలో గర్ల్‌ఫ్రెండ్ మోనాలీసాతో ఈ ఫోటో దిగినట్లు తెలుస్తోంది.
తాను ‘గే’ అని 2019లో వెల్లడించిన ద్యుతీచంద్ స్వలింగ సంపర్కులకు మద్దతుగా ఇటీవలే కామన్వెల్త్ క్రీడల్లో ఎల్జీబీటీక్యూ జెండాతో నడుస్తూ కనిపించింది. తాను స్వలింగ సంపర్కురాలిని అని వెల్లడించినప్పుడు తన కుటుంబం ఒప్పుకోలేదని ద్యుతీ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ ప్రకటన తర్వాత కుటుంబం నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నానని వెల్లడించింది. ‘ఎల్జీబీటీక్యూ అథ్లెట్లు సురక్షితంగా, సుఖంగా ఉండాలి. హింస లేదా మరణం భయం లేకుండా వాళ్లు సాధారణ వ్యక్తులుగా ఉండాలి’ పేర్కొంది.
“Loved you yesterday, love you still, always have, always will.” pic.twitter.com/1q3HRlEAmG
— Dutee Chand (@DuteeChand) December 2, 2022
Comments
Please login to add a commentAdd a comment