Dutee chand
-
డోపింగ్‌లో పట్టుబడిన ద్యుతీచంద్.. తాత్కాలిక నిషేధం
భారత టాప్ అథ్లెట్ క్రీడాకారిణి ద్యుతీచంద్ డోపింగ్ టెస్టులో పట్టుబడింది. ద్యుతీకి నిర్వహించిన శాంపిల్- ఏ టెస్టు రిజల్ట్ పాజిటివ్‌గా వచ్చింది. నిషేధిత సార్స్(SARS) ఉత్ప్రేరకం వాడినట్లు తేలడంతో వరల్డ్ యాంటీ డోపింగ్ ఎజెన్సీ(WADA) ఆమెను తాత్కాలికంగా బ్యాన్ చేస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ''ద్యుతీ శరీరంలో సార్స్ ఎస్-4 Andarine, ఓ డెఫినిలాండ్రైన్, సార్మ్స్ (ఎన్బోర్సమ్), మెటాబోలైట్ లాంటి నిషేధిత పదార్థాలు కనిపించాయి. ఇవి ఆమె శరీరానికి తగినంత శక్తి సామర్థ్యాలు ఇస్తూ పురుష హార్మోన్ లక్షణాలను ఉత్పత్తి చేయడంలో తోడ్పడుతాయి. ఇది నిషేధిత ఉత్ప్రేరకం. ప్రస్తుతం ద్యుతీ అబ్జర్వేజన్‌లో ఉందని.. శాంపిల్-బి టెస్టు పరిశీలించాకా ఒక నిర్ణయం తీసుకుంటాం'' అని వాడా తెలిపింది. ఇక గతేడాది సెప్టెంబర్-అక్టోబర్‌లో జరిగిన జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ద్యుతీచంద్ 200 మీటర్ల ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. ఇక 100 మీటర్ల ఫైనల్స్‌లో ఆరో స్థానంలో సరిపెట్టుకుంది. అంతకముందు 2018లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో 100, 200 మీటర్ల విభాగాల్లో రజత పతకాలు సొంతం చేసుకుంది. ఇక 2013, 2017, 2019 ఏషియన్ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాలు సాధించింది. ఇక 2019లో యునివర్సైడ్ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల విభాగంలో స్వర్ణం సాధించిన తొలి మహిళా స్ప్రింటర్‌గా రికార్డులకెక్కింది. Dutee Chand has been temporarily suspended following a positive analytical finding by WADA. The sample B test and hearing have not yet been released. pic.twitter.com/de0Blbsdnm — Doordarshan Sports (@ddsportschannel) January 18, 2023 చదవండి: Australian Open: బిగ్‌షాక్.. రఫేల్ నాదల్ ఓటమి -
గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న ద్యుతీచంద్!
భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ ద్యుతీచంద్ తన గర్ల్‌ఫ్రెండ్ మోనాలీసాను పెళ్లి చేసుకున్నట్లు వార్తలు రావడం ఆసక్తి కలిగించింది. గతంలోనే ద్యుతీచంద్ తనను తాను గే(GAY)గా ప్రకటించుకుంది. భారత్ నుంచి స్వలింగ సంపర్కాలిగా ప్రకటించుకున్న తొలి భారత అథ్లెట్‌గా ద్యుతీచంద్ నిలిచింది. గర్ల్‌ఫ్రెండ్ మోనాలీసాతో లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నట్లు 2019లో తెలిపింది. తాజాగా డిసెంబర్ 4న(శుక్రవారం) తన గర్ల్‌ఫ్రెండ్ మోనాలిసాతో కలిసి దిగిన ఫోటోలను ద్యుతిచంద్ తన ట్విటర్లో షేర్ చేసుకుంది. ‘నిన్ను ప్రేమించా. ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నా. ఈ ప్రేమ ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది’ అని ట్యాగ్ లైన్ ఇచ్చింది. అయితే వీరిద్దరు పెళ్లి చేసుకున్నారన్న వార్తల్లో నిజం లేదు. ద్యుతీచంద్ తన సోదరి పెళ్లి వేడుకలో గర్ల్‌ఫ్రెండ్ మోనాలీసాతో ఈ ఫోటో దిగినట్లు తెలుస్తోంది. తాను ‘గే’ అని 2019లో వెల్లడించిన ద్యుతీచంద్ స్వలింగ సంపర్కులకు మద్దతుగా ఇటీవలే కామన్వెల్త్ క్రీడల్లో ఎల్జీబీటీక్యూ జెండాతో నడుస్తూ కనిపించింది. తాను స్వలింగ సంపర్కురాలిని అని వెల్లడించినప్పుడు తన కుటుంబం ఒప్పుకోలేదని ద్యుతీ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ ప్రకటన తర్వాత కుటుంబం నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నానని వెల్లడించింది. ‘ఎల్జీబీటీక్యూ అథ్లెట్లు సురక్షితంగా, సుఖంగా ఉండాలి. హింస లేదా మరణం భయం లేకుండా వాళ్లు సాధారణ వ్యక్తులుగా ఉండాలి’ పేర్కొంది. “Loved you yesterday, love you still, always have, always will.” pic.twitter.com/1q3HRlEAmG — Dutee Chand (@DuteeChand) December 2, 2022 చదవండి: ఎలిమినేటర్ మ్యాచ్.. గల్లీ క్రికెట్‌లా ఈ ఆటలేంటి! -
ఏషియన్ గేమ్స్: ద్యుతి చంద్ డబుల్ ధమాకా!
జకార్త: ఏషియన్ గేమ్స్‌లో భారత అథ్లెట్ ద్యుతి చంద్ మరో పతకం సాధించారు. ఇప్పటికే మహిళల 100 మీటర్ల విభాగంలో రజతం సాధించిన ఆమె.. బుధవారం జరిగిన 200 మీటర్ల ఫైనల్లో 23.20 సెకన్లలో పరుగును పూర్తిచేసి రెండో స్థానంలో నిలిచారు. దీంతో ద్యుతి మరో రజత పతకం సొంతం చేసుకున్నారు. 22.96 సెకనల్లో బెహ్రెయిన్ అథ్లెట్ ఓడియంగో ఎడిడాంగ్ స్వర్ణం గెలవగా.. 23.27 సెకన్లతో వుయ్యాంగీ(చైనా) కాంస్యం సొంతం చేసుకున్నారు. ఆసియా క్రీడల్లో ఒకటి కన్నా ఎక్కువ పతకాలు సాధించిన పీటీ ఉష, జ్యోతిర్మయి వంటి దిగ్గజ అథ్లెట్ల సరసన నిలిచారు. ఇక 100 మీటర్లు, 200 మీటర్ల విభాగంలో పతకాలు సాధించిన నాలుగో క్రీడాకారిణిగా కూడా ద్యుతి గుర్తింపు పొందారు.1986లో సియోల్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో పీటీ ఉష 200 మీటర్లు, 400 మీటర్లు, 400 మీటర్ల హర్డిల్స్, 4×400 మీటర్ల రిలేలో స్వర్ణాలు గెలిచి రికార్డు సృష్టించారు. 1998 బ్యాంకాక్ క్రీడల్లో జ్యోతిర్మయి సిక్దార్ 800 మీటర్లు, 1500 మీటర్లలో రెండు పతకాలు సాధించారు. 2002 బుసాన్ క్రీడల్లో సునితా రాణి 1500 మీటర్లు, 500 మీటర్లలో రెండు పతకాలతో మెరిసారు. ద్యుతీచంద్‌లో అధిక మోతాదులో పురుష హార్మోన్లు (టెస్టోస్టిరాన్) ఉన్నాయి కాబట్టి ఆమెకు మహిళల విభాగంలో పాల్గొనే అర్హత లేదంటూ కామన్వెల్త్ క్రీడల నుంచి తప్పించారు. స్పోర్ట్స్ ఆర్బిట్రేజ్ కోర్టులో పోరాడిన ద్యుతీ తిరిగి కఠోర సాధన చేసింది. అకుంఠిత దీక్షతో అందరినీ మెప్పించింది. భారత్‌కు రెండు స్వర్ణాలు హెప్టాథ్లాన్ మహిళల విభాగం, పురుషుల ట్రిపుల్ జంప్ విభాగల్లో భారత్‌కు స్వర్ణం లభించింది. బర్మాన్ స్వప్న 5218 స్కోర్‌తో అగ్రస్థానంలో నిలిచి పసిడి సొంతం చేసుకుంది. పురుషుల ట్రిపుల్ జంప్ విభాగంలో భారత అథ్లెట్ అర్పిందర్ 16.77 మీటర్లు దూకి స్వర్ణం సాధించాడు. దీంతో 48 ఏళ్ల తర్వాత భారత్‌కు ఈ ఈవెంట్ స్వర్ణం వరించింది. 1970లో మోహిందర్ సింగ్ 16.11 మీటర్లతో స్వర్ణం సాధించాడు. ఆ తర్వాత భారత అథ్లెట్ మళ్లీ పసిడి అందుకోవడం ఇదే తొలిసారి. ఫైనల్‌కు అర్హత సాధించిన మరో భారత అథ్లెట్ రాకేశ్ ఆరోస్థానంతో సరిపెట్టుకున్నాడు. టేబుల్ టెన్నిస్‌లో కాంస్యం.. టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్‌లో భారత్ కాంస్యంతో సరిపెట్టుకుంది. శరత్ కమల్, మనికా బాత్రా జోడీ సెమీస్‌లో కఠిన ప్రత్యర్థి చైనాతో 9-11, 5-11, 13-11, 4-11, 8-11 తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో భారత పతకాల సంఖ్య(11 స్వర్ణాలు, 20 రజతాలు, 23 కాంస్యాలు) 54కు చేరింది. -
దుతీ జాతీయ పోటీల్లో పాల్గొనొచ్చు!
‘కాస్’ మధ్యంతర ఉత్తర్వులు న్యూఢిల్లీ: పురుష హార్మోన్లు ఎక్కువ స్థాయిలో ఉన్నాయన్న కారణంతో అనర్హత వేటుకు గురైన భారత మహిళా స్ప్రింటర్ దుతీ చంద్‌కు ఊరట లభించింది. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు ఆమెకు కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ (కాస్) మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పురుష హార్మోన్ల కారణంగా కామన్వెల్త్, ఆసియా క్రీడలకు దూరమైన దుతీ... అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్యల సంఘానికి (ఐఏఏఎఫ్) సంబంధించిన హైపరాండ్రోగ్నిజమ్ (మహిళల అథ్లెట్లలో ఎక్కువ స్థాయిలో పురుషుల హార్మోన్లు ఉండటం) విధానంపై ‘కాస్’లో పోరాడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తుది తీర్పు వెల్లడించే వరకు అంతర్జాతీయ టోర్నీలకు దూరంగా ఉండాలని కోర్టు సూచించింది. వచ్చే జనవరి చివరి వరకు తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ‘కాస్’ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల వల్ల దుతీకి పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదు. ప్రస్తుతం అథ్లెటిక్స్‌కు ఆఫ్ సీజన్ కావడంతో ఆమె పోటీల్లో పాల్గొనే అవకాశాల్లేవు. దుతీ చంద్‌కు జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వడం పట్ల భారత కోచ్, హైదరాబాద్‌కు చెందిన నాగపురి రమేశ్ హర్షం వ్యక్తం చేశారు.