
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులో హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ సంఘానికి చెందిన బికాస్ కరార్, బి. బాల్‌రాజ్ ఎంపికయ్యారు. స్పెయిన్‌లోని మలగలో ఈనెల 4 నుంచి 16 వరకు జరిగే ఈ టోర్నీలో వీరిద్దరూ భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తారు. బికాస్ కరార్ 45ప్లస్ వయో విభాగంలో 200మీ., 400మీ. హర్డిల్స్ ఈవెంట్‌లలో తలపడతాడు.
గతంలో అమెరికా, ఫ్రాన్స్, ఫిన్లాం డ్, బ్రెజిల్, ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్‌లోనూ బికాస్ పాల్గొనడం విశేషం. మరోవైపు బాల్‌రాజ్ 40ప్లస్ వయో విభాగంలో 800మీ. పరుగులో పాల్గొంటాడు. బాల్‌రాజ్‌కు చైనాలో జరిగిన ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ టోర్నీలో పాల్గొన్న అనుభవం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment