
సాక్షి, హైదరాబాద్: అథ్లెటిక్స్ కోచింగ్ అకాడమీ, రాజేశ్ అథ్లెటిక్స్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన సమ్మర్ రోడ్ రన్‌కు విశేష ఆదరణ లభించింది. వ్యాయామవిద్య యూనివర్సిటీ కాలేజి వేదికగా ఆదివారం జరిగిన ఈ ఈవెంట్‌లో 5 కి.మీ నడకవిభాగంలో యోగేందర్ యాదవ్, ఎ. కీర్తి విజేతలుగా నిలిచారు. పురుషుల విభాగంలో యోగేందర్ (ఎంఎల్‌ఆర్ కాలేజి), నాగరాజ్ (హైదరాబాద్), ప్రేమ్ కుమార్ (నిజాం కాలేజి) వరుసగా తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. మహిళల విభాగంలో కీర్తి (భవన్స్), ఎస్. లావణ్య (సెయింట్ పాయ్స్) తొలి రెండు స్థానాల్లో నిలవగా, జువేరియా ఫాతిమా (సెయింట్ ఆన్స్) మూడో స్థానాన్ని దక్కించుకుంది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో యు అండ్ మి సంస్థ డైరెక్టర సి. వీరేందర్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలు అందజేశారు.
ఇతర ఈవెంట్‌ల విజేతల వివరాలు
అండర్–16 బాలుర 5 కి.మీ నడక: 1. అజయ్ కుమార్ (డిఫెన్స్ ల్యాబ్), 2. కె. జితేందర్ (సాయి చైతన్య), 3. రవికిరణ్ (జాన్సన్ గ్రామర్ స్కూల్); బాలికలు: 1. జె. రమ (పీజేఆర్ స్టేడియం), 2. ఎన్. విజయలక్ష్మి (సీఎస్‌ఎస్), 3. కె. అఖిల (సాయి చైతన్య).
అండర్–13 బాలుర 2 కి.మీ నడక: 1. బి. మహేశ్ (పుడమి), 2. ఎం. సాయి (నవ్య జ్యోతి), 3. ఎం. మణి హర్షిత్ (భవన్స్); బాలికలు: 1. కె. విశాలాక్షి (జీహెచ్‌ఎస్), 2. వేముల శ్రీయ (సెయింట్ ఆన్స్), 3. గౌతమి (కేవీ, బేగంపేట్).
అండర్–10 బాలుర 2 కి.మీ నడక: 1. సిద్ధార్థ్ (సీఎంఆర్ స్కూల్), 2. కె. జ్ఞానేశ్వర్ (కేవీఎస్), 3. ఎన్. గోపీ సింగ్ (సాయి చైతన్య); బాలికలు: 1. ఎం. రేవతి (ప్రగతి హైస్కూల్), 2. ఎం. శ్రీవిద్య (గీతాంజలి), 3. కె. మహేశ్వరి (సాయి చైతన్య).
మాస్టర్ పురుషుల 2 కి.మీ నడక: 1. బి. విద్యా సాగర్ (పోస్టల్), 2. వై.శ్రీనివాస్ రావు (హైదరాబాద్), 3. కె. తాయప్ప (రంగారెడ్డి); బాలికలు: 1. కె. శిల్పవల్లి (జీడీసీ), 2. జి. రాధిక (ఓయూ గ్రౌండ్స్), 3. సీహెచ్ ప్రసన్న భారతి (హైదరాబాద్).
Comments
Please login to add a commentAdd a comment