జిల్లా అథ్లెటిక్స్‌ ఎంపికలు రేపు | district athletics selections | Sakshi
Sakshi News home page

జిల్లా అథ్లెటిక్స్‌ ఎంపికలు రేపు

Published Sat, Aug 20 2016 12:12 AM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM

district athletics selections

అండర్‌–14, 16, 18, 20 విభాగాల్లో ఎంపికలు
రన్స్,త్రోస్, జంప్స్‌ ఈవెంట్స్‌లో పోరు
 
 
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా అథ్లెటిక్స్‌ ఎంపికలకు రంగం సిద్ధమైంది. త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి సౌత్‌జోన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీల సెలక్షన్స్‌లో పాల్గొనే శ్రీకాకుళం జిల్లా క్రీడాకారుల ఎంపికలను ఈనెల 21వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షకార్యదర్శులు కె.వెంకటేశ్వరరావు, ఎన్‌.విజయ్‌కుమార్‌ తెలిపారు. శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా జరగనున్న ఈ ఎంపికలు ఆ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమౌతాయన్నారు.
 
అండర్‌–14, 16, 18, 20 ఏళ్ల విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా ఎంపికలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 100, 200, 400, 800, 1500, 3వేలు మీటర్ల పరుగు పందాలు, రిలే పరుగు, హార్టిల్స్, హైజంప్, లాంగ్‌జంప్, షాట్‌పుట్, డిస్కస్‌త్రో, జావెలిన్‌త్రో, హేమర్‌త్రో, పోల్‌వాల్ట్‌ తదితర కేటగిరీల్లో ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ ఎంపికల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు పంపిస్తామని చెప్పారు. ఎంపికల్లో పాల్గొనేందుకు ఆసక్తి కలిగిన క్రీడాకారులు తమ వయస్సు ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు జిరాక్స్‌తో ఆ రోజ ఉదయం 9 గంటలకు స్టేడియం వద్దకు చేరుకోవాలని వారు సూచించారు. మరిన్ని వివరాలకు సంఘ కార్యనిర్వహన కార్యదర్శి ఎం.సాంబమూర్తి (సెల్‌: 8500271575)ని సంప్రదించాలి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement