3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లోనూ హీట్స్‌లోనే అవుట్
పారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో మనవాళ్లు ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికే మహిళల 5000 మీటర్ల పరుగులో నిరాశ పరిచిన పారుల్ చౌధరీ 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లోనూ హీట్స్‌లోనే వెనుదిరిగింది. ఆదివారం జరిగిన పోటీల్లో పారుల్ 9 నిమిషాల 23.39 సెకన్లలో లక్ష్యాన్ని చేరి హీట్స్‌లో 9వ స్థానంలో నిలిచింది.
ఒక్కో హీట్‌లో తొలి ఐదు స్థానాల్లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధించారు. గమ్యాన్ని చేరేందుకు తన అత్యుత్తమ టైమింగ్ (9 నిమిషాల 15.31 సెకన్లు) కంటే ఎక్కువ సమయం తీసుకున్న పారుల్ ఓవరాల్‌గా 21వ స్థానంతో సరిపెట్టుకుంది. గత ఏడాది ఆసియా క్రీడల్లో పారుల్ 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో రజతం, 5000 మీటర్లలో స్వర్ణం సాధించింది.
అయితే తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొన్న పారుల్ నిరాశపరిచింది. ఇక పురుషుల లాంగ్‌జంప్‌లో జెస్విన్ అల్‌డ్రిన్ గ్రూప్ ‘బి’లో 13వ స్థానంలో నిలిచాడు. 7.61 మీటర్ల దూరం లంఘించిన జెస్విన్ మొత్తంగా 26వ స్థానంతో ‘పారిస్’ క్రీడల నుంచి ని్రష్కమించాడు. ఈ విభాగంలో 8.15 మీటర్లు దాటిన అథ్లెట్లు ఫైనల్‌కు అర్హత సంపాదించారు.
Comments
Please login to add a commentAdd a comment