తొలి రౌండ్ హీట్స్‌లోనే అంకిత, పారుల్ నిష్క్రమణ
పారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు వరుసగా రెండో రోజు నిరాశ తప్పలేదు. మహిళల 5000 మీటర్ల పరుగులో పారుల్ చౌధరీ, అంకిత దయాని హీట్స్‌లోనే వెనుదిరిగారు. భారత్ నుంచి రెండు ఈవెంట్‌లలో విశ్వక్రీడలకు అర్హత సాధించిన పారుల్ చౌధరీ.. శుక్రవారం జరిగిన రెండో హీట్‌లో 15 నిమిషాల 10.68 సెకన్లలో లక్ష్యాన్ని చేరి 14వ స్థానంతో సరిపెట్టుకుంది.
తొలి హీట్‌లో పోటీపడిన భారత మరో రన్నర్ అంకిత దయాని 20వ స్థానంలో నిలిచింది. అంకిత 16 నిమిషాల 19.38 సెకన్లలో గమ్యాన్ని చేరుకుంది. ఒక్కో హీట్ నుంచి తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన వాళ్లు ఫైనల్‌కు అర్హత సాధించారు.
నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్
ఆర్చరీ
మహిళల వ్యక్తిగత ఎలిమినేషన్ రౌండ్: దీపికా కుమారి ్ఠ మిచెల్లి క్రాపెన్ (జర్మనీ) (మధ్యాహ్నం గం. 1:52 నుంచి), భజన్ కౌర్ ్ఠ దినంద చోరునిసా (ఇండోనేసియా) (మధ్యాహ్నం గం. 2:05 నుంచి)
షూటింగ్
మహిళల స్కీట్ క్వాలిఫికేషన్ రౌండ్: రైజా ధిల్లాన్, మహేశ్వరి చౌహాన్ (మధ్యాహ్నం గం. 12:30 నుంచి).
మహిళల 25 మీటర్ల పిస్టల్ (పతక పోరు):
మనూ భాకర్ (మధ్యాహ్నం గం. 1:00 నుంచి)
బాక్సింగ్
పురుషుల 71 కేజీల క్వార్టర్ ఫైనల్: నిశాంత్ మార్కో వెర్డె (మెక్సికో) (అర్ధరాత్రి గం. 12:18 నుంచి)
సెయిలింగ్
పురుషుల డింగీ రేసులు: విష్ణు (మధ్యాహ్నం గం. 3:45
నుంచి).
మహిళల డింగీ రేసులు: నేత్ర కుమానన్ (సాయంత్రం గం. 5:55 నుంచి)
Comments
Please login to add a commentAdd a comment