![100 మీ. విజేత పద్మశ్రీ](/styles/webp/s3/article_images/2017/09/5/81500872998_625x300.jpg.webp?itok=ddPP4K96)
100 మీ. విజేత పద్మశ్రీ
సాక్షి, హైదరాబాద్: జిల్లా స్థాయి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో సీహెచ్ పద్మశ్రీ ఆకట్టుకుంది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో ఆమె 100మీ. పరుగు ఈవెంట్‌లో విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన అండర్–16 బాలికల 100మీ. పరుగులో పద్మశ్రీ (ఎస్‌పీహెచ్‌ఎస్) లక్ష్యాన్ని 13.4 సెకన్లలో చేరుకొని అగ్రస్థానాన్ని సాధించింది. ఏపీఎస్‌కు చెందిన స్వప్న (13.7సె.), ఆర్‌సీహెచ్‌ఎస్ అథ్లెట్ రియా గ్రేస్ (13.8సె.) తర్వాతి స్థానాలను దక్కించుకున్నారు.
అండర్–14 బాలికల 100మీ. రేసులో కె. శిల్ప (14.1 సె.), దియా గంగ్వార్ (14.4 సె.), ఎం. మానస (14.7 సె.) వరుసగా తొలి మూడు స్థానాలను సాధించారు. బాలుర విభాగంలో రాహుల్ (12.3 సె.) విజేతగా నిలవగా, నితిన్ (12.5 సె.) రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రణీత్ (12.6 సె.) మూడో స్థానంలో ఉన్నాడు.