ఓవరాల్ చాంపియన్ ఏఎంజీ హైస్కూల్
గుంటూరు స్పోర్ట్స్: అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో జరిగిన అండర్–14, 16 బాలబాలికల అథ్లెటిక్స్ పోటీలలో చిలకలూరిపేటకు చెందిన ఏఎంజీ హైస్కూల్ విద్యార్థులు ఓవరాల్ చాంపియన్ షిప్‌ను సాధించారు. స్థానిక బ్రహ్మానందరెడ్డి స్దేడియంలో మంగళవారం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అసోసియేషన్ కార్యదర్శి జి.శేషయ్య ఏఎంజీ హైస్కూల్ జట్టుకు ట్రోఫీ అందించారు. గ్రామీణ క్రీడాకారులు అథ్లెటిక్స్ పోటీలలో అత్యంత ప్రతిభ కనబర్చి రాణిస్తున్నారని చెప్పారు. మెరుగైన సదుపాయాలు వుంటే మేటి క్రీడాకారులుగా ఎదిగే అవకాశం వుందన్నారు. జిల్లా స్థాయి పోటీలలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను విశాఖపట్నంలో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు పంపుతామన్నారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్ శిక్షకులు రమాసుందరి, పీఈటీలు రాజు, గమిడి సాంబశివరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.