గ్లాస్గో (స్కాట్లాండ్): ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత ట్రిపుల్ జంపర్ ప్రవీణ్ చిత్రావెల్ తన అత్యుత్తమ ప్రదర్శన కూడా నమోదు చేయలేకపోయాడు. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో 22 ఏళ్ల ప్రవీణ్ 16.45 మీటర్ల దూరం దూకి 11వ స్థానంలో నిలిచాడు.
ఫాబ్రిస్ జాంగో (బుర్కినఫాసో; 17.53 మీటర్లు) స్వర్ణం, యాసిర్ మొహమ్మద్ ట్రికీ (అల్జీరియా; 17.35 మీటర్లు), టియాగో పెరీరా (పోర్చుగల్; 17.08 మీటర్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించాడు. 17.37 మీటర్లతో తన పేరిట ఉన్న జాతీయ రికార్డు ప్రదర్శనను ప్రవీణ్ గ్లాస్గోలో పునరావృతం చేసి ఉంటే అతని ఖాతాలో రజత పతకం చేరేది. గత ఏడాది ఆసియా క్రీడల్లో ప్రవీణ్ (17.68 మీటర్లు) కాంస్య పతకాన్ని సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment