ఖాజీపాలెం విద్యార్థినుల ప్రతిభ
Published Thu, Oct 13 2016 8:37 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM
ఖాజీపాలెం (పిట్టలవానిపాలెం): రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీలలో ఖాజీపాలెం డాక్టర్ డీఎస్ రాజు జూనియర్ కళాశాల విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనబరచి రెండు బంగారు పతకాలు, ఒక వెండి పతకం సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ భేతాళం సుబ్బరాజు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం క్రీడాకారులను పలువురు అభినందించారు. ఈ నెల 7వ తేదీ నుంచి 9 వరకు ఆంధ్రప్రదేశ్ స్కూలు గేమ్స్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ (అండర్–19) పోటీలు గుంటూరు నగరంలోని అవుట్ డోర్ స్టేడియంలో జరిగాయన్నారు. 1500, 800 మీటర్ల పరుగు పందెంలో కళాశాలకు చెందిన కె.వరలక్ష్మి ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం, వై.సంధ్యారాణి 3 కి.మీ పరుగు పందెంలో ద్వితీయ స్థానంలో నిలిచి వెండి పతకం సాధించారన్నారు. రిలే పరుగు పందెంలో ౖÐð..సంధ్యారాణి, కె.వరలక్ష్మి, ఎం.ప్రసన్న, ఐ.దేవి వైష్ణవి కాంస్య పతకం సాధించారన్నారు.
Advertisement
Advertisement