యోగాలో ఏఎంజీ విద్యార్థుల ప్రతిభ
దక్షిణ భారత స్థాయిలో పతకాల సాధన
చిలకలూరిపేట టౌన్: యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కర్ణాటకలోని ఉడిపిలో ఈనెల 14 నుంచి 16 తేదీ వరకు నిర్వహించిన దక్షణ భారత యోగా పోటీల్లో స్థానిక ఏఎంజీ స్కూల్‌కు చెందిన ఐదో తరగతి విద్యార్థిని ఎన్.దేవి 8 నుంచి 11 సంవత్సరాల లోపు విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించింది. బాలుర విభాగంలో ఆరోతరగతి విద్యార్థి బి.నాగుల్‌మీరా ద్వితీయ స్థానంలో నిలిచి రజిత పతకం సాధించాడు. ఈ సందర్భంగా బుధవారం ఏఎంజీ ప్రాంగణంలో వారిని ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ అరుణ్‌కుమార్ మహంతి, వైస్ ప్రెసిడెంట్ కె.జాకబ్, సీఏవో విజయ్‌కుమార్, సీపీవో కృపారావు, ఏవో రవికుమార్, హెచ్‌ఎంలు పి.మేరి, కె.కృపాదానం, వ్యాయామ ఉపాధ్యాయులు అభినందించారు.