
సాక్షి, తుర్కయంజాల్(రంగారెడ్డి): భాతరదేశం యోగాకు పుట్టినిల్లని ప్రముఖ ఇంటర్నేషనల్ యోగా శిక్షకురాలు మర్నా అన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం రాగన్నగూడలోని సంకల్ప్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో శుక్రవారం మర్నా విద్యార్థులకు యోగా శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మర్నా మాట్లాడుతూ.. భారతదేశంలోని విద్యార్థులకు యోగా నేర్పించడం గర్వంగా ఉందన్నారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ రామ్‌రెడ్డి, డైరెక్టర్ కందాడి సురేందర్ రెడ్డిలు మాట్లాడుతూ.. సుమారు 50 దేశాలలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించిన ఇంటర్నేషనల్ యోగా శిక్షకురాలు విద్యార్థులకు శిక్షణ ఇచ్చింనందుకు ధన్యవాదాలు తెలిపారు.