
ఒలింపిక్స్‌లో శుక్రవారం అథ్లెటిక్స్ ఈవెంట్స్ ప్రారంభం కానుండగా... అమెరికా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. పురుషుల పోల్‌వాల్ట్‌లో 2017, 2109 వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన స్యామ్ హెండ్రిక్స్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. దాంతో అతను ఒలింపిక్స్ నుంచి వైదొలిగాడు. హెండ్రిక్స్‌కు సన్నిహితంగా మెలిగిన ఆస్ట్రేలియా అథ్లెట్లు కూడా ఐసోలేషన్‌లోకి వెళ్లారు. అథ్లెటిక్స్ ఈవెంట్ తొలి రోజు పురుషుల 10,000 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం కోసం పోటీ జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment