బ్యాంకాక్: భారత స్టార్ లాంగ్‌జంపర్ మురళీ శ్రీశంకర్ వచ్చే ఏడాది పారిస్‌లో జరిగే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ (2024)కు అర్హత సాధించాడు. తద్వారా ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ఈ ఘనత సాధింన తొలి భారత ఆటగాడిగా అతను ఘనత వహించాడు. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో శనివారం జరిగిన పురుషుల లాంగ్‌జంప్ ఈవెంట్‌లో అతను రజత పతకం సాధించాడు. 24 ఏళ్ల భారత అథ్లెట్ 8.37 మీటర్ల దూరం దుమికి రెండో స్థానంలో నిలిచాడు. ఈ ప్రదర్శన అతని కెరీర్‌లోనే రెండో ఉత్తమ ప్రదర్శన కాగా... పారిస్ ఈవెంట్ క్వాలిఫికేషన్ మార్క్ (8.27 మీటర్లు)ను అధిగమించాడు.
శ్రీశంకర్‌కు ఇది రెండో ఒలింపిక్స్ కాగా... గత టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధింన అతను క్వాలిఫికేషన్ రౌండ్లోనే వెనుదిరిగాడు. ఈ లాంగ్‌జంప్‌లో యు తంగ్ లిన్ (8.40 మీ.; చైనీస్ తైపీ) స్వరం గెలుపొందాడు. 4్ఠ400 మీటర్ల మిక్స్‌డ్ రిలే ఈవెంట్‌లో రాజేశ్ రమేశ్, అమోజ్ జాకబ్, ఐశ్వర్య మిశ్రా, శుభ వెంకటేశన్‌లతో కూడిన భారత బృందం పసిడి పతకంతో మెరిసింది. ఈ రిలే జట్టు పోటీని 3 నిమిషాల 14.70 సెకన్లలో పూర్తిచేసి కొత్త జాతీయ రికార్డును నిలకొల్పింది. గతంలో 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నమోదు చేసిన 3ని.15.77 సె. రికార్డును తిరగరాసింది.
పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో మూడో స్థానంలో నిలిచిన సంతోష్ కుమార్ (49.09 సె.) కాంస్యంతో తృప్తిపడ్డాడు. పురుషుల హైజంప్‌లో సర్వేశ్ కుశారే 2.26 మీ. ఎత్తు వరకు జంప్ చేసి రజతం గెలిచాడు. మహిళల హెప్టాథ్లాన్‌లో స్వప్న బర్మన్ 5840 పాయింట్లతో రజతం గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యెర్రాజీ 200 మీటర్ల స్ప్రింట్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్లో ఆమె 23.29 సె. టైమింగ్‌తో ఫైనల్స్‌కు అర్హత పొందింది. శనివారం నాటి పోటీల్లో భారత్ ఒక పసిడి, మూడు రజతాలు, ఒక కాంస్యం గెలుచుకుంది. ఓవరాల్‌గా ఈ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో 14 (6 స్వరాలు, 4 రజతాలు, 4 కాంస్యాలు) పతకాలున్నాయి.
చదవండి Wimbledon: మహిళల సింగిల్స్‌లో సంచలనం.. వొండ్రుసోవా సరికొత్త చరిత్ర
Comments
Please login to add a commentAdd a comment