పతకాలు సాధించిన విద్యార్థులతో మమత మెడికల్ కళాశాల కార్యదర్శి పువ్వాడ జయశ్రీ
-
హెల్త్ యూనివర్సిటీ పోటీల్లో మెడికోల ప్రతిభ
ఖమ్మం స్పోర్ట్స్: డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వైద్య కళాశాలల పోటీల్లో ఖమ్మం మమత మెడికల్ కళాశాల విద్యార్థులు అథ్లెటిక్స్ విభాగంలో సత్తా చాటారు. ఈ నెల 9, 10వ తేదీల్లో కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాలలో జరిగిన అథ్లెటిక్స్ టోర్నీలో మమత మెడికల్ కాలేజీ మెడికోలు ఏడు పతకాలు సాధించారు. పురుషుల షాట్‌పుట్, డిస్కస్‌త్రోలో సాయిఅక్షిత్ ప్రథమస్థానంలో నిలవగా, మహిళల డిస్కస్‌త్రోలో వి.మనీషారెడ్డి ద్వితీయ, షాట్‌పుట్‌లో తృతీయస్థానాలు సాధించగా, పురుషుల లాంగ్‌జంప్, హైజంప్‌లో జాన్‌చంద్ర తృతీయస్థానం దక్కించుకున్నారు. పురుషుల ఐదు కిలో మీటర్లపరుగులో అనిల్ ద్వితీయస్థానంలో నిలిచారు. కళాశాల విద్యార్థులు పతకాలు సాధించడం పట్ల ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, మమత కళాశాలల ఫౌండర్ పువ్వాడ నాగేశ్వరరావు, సెక్రటరీ పువ్వాడ జయశ్రీ, కాలేజీ డీన్ కె.కోటేశ్వరరావు, మమత కళాశాల పీడీ శివరామకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. ఆ విద్యార్థులను గురువారం అభినందించారు.