
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల చరిత్రలో స్వర్ణం సాధించిన భారత ఏకైక డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ రిటైర్మెంట్ ప్రకటించాడు. గత 15 ఏళ్లుగా అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ... దేశానికి ఎన్నో పతకాలు తెచ్చిపెట్టిన వికాస్ బుధవారం ఆటకు ‘టాటా’ చెబుతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు భారత అథ్లెటిక్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ)కు లేఖ రాశాడు. దీన్ని ఏఎఫ్‌ఐ ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించింది.
6 అడుగుల 9 అంగుళాల ఎత్తు, 140 కేజీల బరువున్న వికాస్ వరుసగా నాలుగు ఒలింపిక్స్‌ల్లో (2004, 2008, 2012, 2016) భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అం దులో 2012 లండన్ ఒలింపిక్స్‌లో ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించడం అత్యుత్తమం. జూలై 5వ తేదీన 35 ఏళ్లు పూర్తి చేసుకోనున్న వికాస్ మైసూర్‌లో జన్మించి అమెరికాలో స్థిరపడ్డాడు.