vikas gowda
-
అథ్లెటిక్స్‌కు వికాస్ గౌడ గుడ్‌బై
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల చరిత్రలో స్వర్ణం సాధించిన భారత ఏకైక డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ రిటైర్మెంట్ ప్రకటించాడు. గత 15 ఏళ్లుగా అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ... దేశానికి ఎన్నో పతకాలు తెచ్చిపెట్టిన వికాస్ బుధవారం ఆటకు ‘టాటా’ చెబుతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు భారత అథ్లెటిక్ సమాఖ్య (ఏఎఫ్ఐ)కు లేఖ రాశాడు. దీన్ని ఏఎఫ్ఐ ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించింది. 6 అడుగుల 9 అంగుళాల ఎత్తు, 140 కేజీల బరువున్న వికాస్ వరుసగా నాలుగు ఒలింపిక్స్ల్లో (2004, 2008, 2012, 2016) భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అం దులో 2012 లండన్ ఒలింపిక్స్‌లో ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించడం అత్యుత్తమం. జూలై 5వ తేదీన 35 ఏళ్లు పూర్తి చేసుకోనున్న వికాస్ మైసూర్లో జన్మించి అమెరికాలో స్థిరపడ్డాడు. -
వికాస్ గౌడ చెత్త ప్రదర్శన
అథ్లెటిక్స్‌లో భారీ బృందంతో బరిలోకి దిగిన భారత్‌కు తొలి రోజు కలిసిరాలేదు. పురుషుల డిస్కస్ త్రోలో వికాస్ గౌడ ఓవరాల్‌గా 28వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయాడు. వరుసగా నాలుగో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న వికాస్ డిస్క్‌ను మూడు ప్రయత్నాల్లో అత్యుత్తమంగా 58.99 మీటర్ల దూరం విసిరాడు. ప్రస్తుత ఆసియా చాంపియన్ అయిన వికాస్ భుజం గాయం కారణంగా ఈ ఏడాది ఎలాంటి పోటీల్లో పాల్గొనకుండానే నేరుగా ఒలింపిక్స్‌లో బరిలోకి దిగాడు. గతంలో డిస్క్‌ను 66.28 మీటర్ల దూరం విసిరి తన పేరిట జాతీయ రికార్డును లిఖించుకున్న వికాస్ ఈ ప్రదర్శన రియోలో పునరావృతం చేసిఉంటే ఫైనల్‌కు అర్హత పొందేవాడు. క్వాలిఫయింగ్ నుంచి 12 మంది ఫైనల్‌కు అర్హత సాధించారు. క్వాలిఫయింగ్‌లో పియోటర్ మాలాచౌస్కీ (పోలాండ్) గరిష్టంగా 65.89 మీటర్ల దూరం... కనిష్టంగా ఫిలిప్ మిలానోవ్ (బెల్జియం) 62.68 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌కు చేరుకున్నారు. మహిళల షాట్‌పుట్ క్వాలిఫయింగ్‌లో మన్‌ప్రీత్ కౌర్ (భారత్) ఇనుప గుండను 17.06 మీటర్ల దూరం విసిరి ఓవరాల్‌గా 23వ స్థానంలో నిలిచింది. పురుషుల 800 మీటర్ల విభాగంలో జిన్సన్ జాన్సన్ (భారత్) హీట్స్‌లోనే వెనుదిరిగాడు. మూడో హీట్‌లో పాల్గొన్న జిన్సన్ జాన్సన్ ఒక నిమిషం 47.27 సెకన్లలో గమ్యానికి చేరి ఐదో స్థానంలో నిలిచాడు. -
ఒలింపిక్స్ కు వికాస్ గౌడ అర్హత
న్యూఢిల్లీ:భారత డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ్ వచ్చే ఏడాది జరుగనున్న రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించాడు. వరల్డ్ అథ్లెటిక్స్ గవర్నింగ్ బాడీ, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్ ఫెడరేషన్ తాజాగా నిబంధనలు సడలించడంతో వికాస్ గౌడకు రియో బెర్తు ఖరారైంది. గత ఏప్రిల్ నిబంధనల ప్రకారం పురుషుల డిస్కస్ త్రోలో కటాఫ్ మార్కును 66.00 మీటర్ల దూరంగా నిర్ణయించారు. కాగా, కొన్ని రోజుల క్రితం ఆ దూరాన్ని 65.00 మీటర్లకు ఐఏఏఎఫ్ కుదిస్తూ నిర్ణయం తీసుకోవడంతో వికాస్ గౌడ అనూహ్యంగా రియోకు అర్హత సాధించాడు. గత మే నెలలో జరిగిన జమైకా అథ్లెటిక్స్ మీట్ లో వికాస్ గౌడ్ 65.00 మీటర్లకు పైగా డిస్క్ ను విసరడంతో అతనికి ఒలింపిక్స్ కు అర్హత సాధించినట్లు అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ సీకే వాల్సన్ వెల్లడించారు. ఆసియన్ చాంపియన్ అయిన వికాస్ గౌడ 2014 కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. -
తొమ్మిదితో సరి
భారత 'ఆశాకిరణం' వికాస్ గౌడ వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో డిస్కస్ త్రో లో నిరాశ పరిచాడు. ఫైనల్ కు చేరి పతకం పై ఆశలు రేపిన వికాస్ తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. శనివారం సాయంత్రం జరిగిన ఫైనల్లో ఇనప గుండును కేవలం 62.24 మీటర్లు విసిరి పాయింట్ల పట్టికలో కింది స్థానానికి పరిమితం అయ్యాడు. వికాస్ సీజనల్ బెస్ట్ 65.75మీటర్లు కూడా చేరుకోలేక పోయాడు. వికాస్ గౌడ్ ఇప్పటికి 5 సార్లు ప్రంపచ ఛాంపియన్ షిప్ కు క్వాలిఫై కాగా.. మూడు మార్లు ఫైనల్ రౌండ్ వరకూ వెళ్లాడు. మరో వైపు శనివారం ఉదయం మహిళల 4X400 రిలేలో మన రన్నర్లు హీట్స్ స్థాయిలోనే వెనుదిరిగారు. చివరి రోజు బాబర్, ఒపి జైషా, సుధాసింగ్ చివరి రోజు ఆదివారం మారథాన్ లో పోటీ పడనున్నారు. -
బోల్ట్‌నే పడేశాడు..!
నాలుగోసారి 200 మీటర్ల ప్రపంచ టైటిల్ బోల్ట్ కైవసం ♦ 19.55 సెకన్లలో గమ్యానికి చేరిన జమైకా స్టార్ ♦ రెండో స్థానంలోనే గాట్లిన్ పరుగుకు ప్రాణం ఉంటే అలసిపోయేదేమో...! వేగానికి రెక్కలు ఉంటే విలవిలలాడిపోయేవేమో...! భువికే అనుభూతి ఉంటే నిలువెల్లా వణికిపోయేదేమో...! లేడి పిల్ల కోసం పులి పరుగుపెట్టినట్లుగా... మానవ చిరుత ఉసేన్ బోల్ట్... 200 మీటర్ల రేసులో ప్రకంపనలు సృష్టించాడు. బుల్లెట్‌కు సైతం భయం పుట్టేలా... ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తూ... గాట్లిన్తో సహా యోధులు, ధీరులు అనుకున్న అందర్ని తన వేగంతో వేటాడేశాడు. రికార్డులు తిరగరాయకపోయినా... పరుగులో తనను కొట్టే మొనగాడే లేడని మరోసారి నిరూపించాడు. బీజింగ్ : స్ప్రింట్‌లో అలుపెరుగని యోధుడిలా దూసుకుపోతున్న జమైకా స్టార్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్... 200 మీటర్ల రేసులోనూ తడఖా చూపెట్టాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా గురువారం జరిగిన పురుషుల 200 మీటర్ల పరుగును బోల్ట్ 19.55 సెకన్లలో ముగించి స్వర్ణాన్ని సాధించాడు. దీంతో వరుసగా నాలుగోసారి తన ఖాతాలో పసిడిని జమ చేసుకున్నాడు. అమెరికా స్టార్ స్ప్రింటర్ జస్టిన్ గాట్లిన్ 19.74 సెకన్లతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. 19.87 సెకన్లలో రేసును ముగించిన జొబోడావాన్ (దక్షిణాఫ్రికా)కు కాంస్యం దక్కింది. 2008 ఒలింపిక్స్‌లో ఇదే వేదికపై రెండు విభాగాల్లో స్వర్ణాలు సాధించిన బోల్ట్... ఈసారి కూడా తన ఆధిపత్యాన్ని చూపెట్టాడు. చివరి 12 వ్యక్తిగత ఒలింపిక్స్, వరల్డ్ స్ప్రింట్ టైటిల్స్‌లో బోల్ట్ 11 గెలవడం విశేషం. 2011 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల రేసును తప్పుగా మొదలుపెట్టి అనర్హతకు గురయ్యాడు. ఈ సీజన్లో నడుం సమస్యలతో ఇబ్బందిపడుతున్న బోల్ట్... 2009లో తాను నెలకొల్పిన ప్రపంచ రికార్డు (19.19 సెకన్లు)పై గురిపెట్టలేకపోయాడు. ఆరంభం అదుర్స్... ఈసారి గాట్లిన్ నుంచి గట్టిపోటీ ఉంటుందని భావించినా.. రేసు మొత్తంలో ఎక్కడా ఇది కనబడలేదు. అద్భుతమైన ఆరంభంతో బోల్ట్.. సహచరుల కంటే చాలా ముందుగా దూసుకుపోయాడు. మరోవైపు గాట్లిన్ తొలి 100 మీటర్లలో కాస్త వెనుకబడినా... తర్వాతి 50 మీటర్లలో బాగా పుంజుకున్నాడు. కానీ జార్నెల్ హ్యూజ్ (బ్రిటన్), జొబోడావాన్ల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొన్నాడు. బోల్ట్ మాత్రం తన సహజశైలిలో భారీ కటౌట్‌ను గాలి దిశకు అనుకూలంగా మల్చుకుంటూ చిరుతలా దూసుకుపోయాడు. తన పొడవైన కాళ్లతో ఒక్కో అడుగు వేస్తూ తొలి 100 మీటర్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని చూపెట్టాడు. నడుం నొప్పితో ఆరు వారాలు శిక్షణకు దూరంగా ఉన్నా... రేసు ముగింపులో తనదైన ముద్రను చూపెట్టాడు. ఫైనల్లో వికాస్ భారత మేటి అథ్లెట్ వికాస్ గౌడ.. పురుషుల డిస్కస్ త్రో ఈవెంట్లో ఫైనల్ రౌండ్‌కు చేరాడు. గ్రూప్-ఎ అర్హత పోటీల్లో వికాస్ తొలి ప్రయత్నంలో ఇనుప గుండును 63.86 మీటర్ల దూరం విసిరాడు. దీంతో ఏడో స్థానంతో ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించాడు. శనివారం ఫైనల్ రౌండ్ పోటీలు జరుగుతాయి. బోల్ట్‌నే పడేశాడు..! ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 200 మీటర్ల పరుగులో తాను స్వర్ణం గెలుస్తానని ముందే ఊహించినట్లు బోల్ట్ చెప్పాడు. కానీ అతను ఊహించని అనూహ్య ఘటన ట్రాక్‌పైనే జరిగింది. రేస్‌లో మొదటి స్థానంలో నిలిచాక సంబరంగా మైదానం అంతా తిరుగుతున్న బోల్ట్‌కు కెమెరామెన్ రూపంలో ప్రమాదం ఎదురైంది. చక్రాలతో ఉండే ‘సెగ్వే’పై బోల్ట్‌కు సమాంతరంగా అతడిని షూట్ చేస్తూ వస్తున్న కెమెరామెన్ అదుపు తప్పి పక్కనున్న రెయిలింగ్‌ను ఢీ కొన్నాడు. తనను తాను నియంత్రించుకోలేక అతను ఒక్కసారిగా బోల్ట్‌ను ఢీకొన్నాడు. దాంతో పట్టు కోల్పోయిన బోల్ట్ బొక్కబోర్లా పడిపోయాడు. సెగ్వే నేరుగా బోల్ట్ మోకాలి కింది భాగంలోనే తాకింది. అంతా ఒక్కసారిగా ఆందోళనకు గురవుతుండగా ప్రమాదం లేదంటూ స్టార్ స్ప్రింటర్ చిరునవ్వుతో లేచి నిలబడ్డాడు. ఆ ‘బంగారు కాళ్ల’ విలువ ఏమిటో ప్రపంచానికి తెలుసు. నిజంగా ఏదైనా పెద్ద గాయం తగిలి ఉంటే బోల్ట్ కెరీరే ముగిసేపోయేదేమో! పెద్ద ప్రమాదం తప్పిన అనంతరం ‘అతను నన్ను చంపాలని చూశాడు’ అంటూ బోల్ట్ సరదాగా వ్యాఖ్యానించడం విశేషం. -
ఫైనల్స్ కు చేరిన వికాస్ గౌడ
బీజింగ్ : భారత 'ఆశాకిరణం' వికాస్ గౌడ వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో డిస్కస్ త్రో ఫైనల్స్‌కు చేరుకున్నాడు. గురవారం ఇక్కడ జరిగిన 61.61 మీటర్ల దూరానికి డిస్కన్ను విసిరి ఫైనల్స్‌కు బెర్త్ ఖరారు చేసుకున్నాడు. ఫైనల్స్ శనివారం సాయంత్రం జరగనున్నాయి. -
ప్రపంచ అథ్లెటిక్స్ మీట్‌కు వికాస్, టింటూ
న్యూఢిల్లీ : ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 17 మంది సభ్యులతో కూడిన భారత బృందంలో గతేడాది కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ... అగ్రశ్రేణి అథ్లెట్ టింటూ లూకా తదితరులు ఉన్నారు. ఈనెల 22 నుంచి 30 వరకు చైనాలోని బీజింగ్‌లో ఈ మెగా ఈవెంట్ జరుగుతుంది. అంతర్జాతీయ అథ్లెటిక్స్ సంఘాల సమాఖ్య (ఐఏఏఎఫ్) నిర్దేశించిన అర్హత ప్రమాణాలను అందుకున్న అథ్లెట్స్‌ను మాత్రమే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ఎంపిక చేసినట్లు భారత అథ్లెటిక్స్ సమాఖ్య తెలిపింది. భారత అథ్లెటిక్స్ జట్టు : వికాస్ గౌడ (డిస్కస్ త్రో), గుర్మీత్ సింగ్, బల్జీందర్ సింగ్, చందన్ సింగ్ (20 కి.మీ. నడక), ఇందర్జీత్ సింగ్ (షాట్‌పుట్), సందీప్ కుమార్, మనీష్ సింగ్ రావత్ (50 కి.మీ. నడక), టింటూ లూకా (800 మీ., 4ఁ400 మీటర్ల రిలే) లలితా శివాజీ బాబర్ (3000 మీ. స్టీపుల్‌చేజ్, మారథాన్), పూవమ్మ, దేబశ్రీ మజుందార్, అనూ రాఘవన్, జిస్నా మాథ్యూ (4ఁ400 మీటర్ల రిలే), , ఖుష్బీర్ కౌర్, సప్నా (20 కి.మీ. నడక), ఓపీ జైషా, సుధా సింగ్ (మారథాన్). -
లలిత, వికాస్ గౌడలకు స్వర్ణాలు
ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ వుహాన్ : ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మూడో రోజు భారత్‌కు రెండు స్వర్ణాలు, ఓ రజతం దక్కాయి. శనివారం జరిగిన 3000మీ. స్టీపుల్‌చేజ్‌లో లలితా బాబర్ 9:34.13సె. టైమింగ్‌తో జాతీయ రికార్డును సవరిస్తూ స్వర్ణం కొల్లగొట్టింది. దీంతో రియో ఒలింపిక్స్‌కు కూడా 26 ఏళ్ల లలితా అర్హత సాధించింది. మరోవైపు 2013లోనూ స్వర్ణం సాధించిన డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ ఈసారి కూడా తన పతకాన్ని నిలబెట్టుకున్నాడు. 62.03మీ. దూరం డిస్క్ విసిరి తొలి స్థానంలో నిలిచాడు. 10 వేల మీ. రేసులో జి.లక్ష్మణన్ 29:42.81సె.లో గమ్యం చేరి రజతం సాధించాడు. పురుషుల 200మీ. రేసులో ధరమ్వీర్ సింగ్, శ్రబాని నందా.. మహిళల 200మీ. రేసులో టింటూ లూకా, గోమతి ఫైనల్స్‌కు అర్హత సాధించారు. -
ఆసియా చాంపియన్‌షిప్‌లో వికాస్, లలితకు స్వర్ణాలు
న్యూఢిల్లీ: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు వికాస్ గౌడ, లలిత బాబర్ స్వర్ణ పతకాలు సాధించారు. మరో భారత అథ్లెట్ లక్ష్మణన్ రజత పతకం సొంతం చేసుకున్నాడు. చైనాలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ్ 62.03 మీటర్ల దూరం విసిరి ప్రథమ స్థానంలో నిలిచాడు. ఇక మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో లలిత (9:34.13 నిమిషాలు) టైమింగ్‌తో మొదటి స్థానం సాధించింది. 10,000 మీటర్ల రేసులో లక్ష్మణన్ (29:42.81 నిమిషాలు) రెండో స్థానం దక్కించుకున్నాడు. -
వికాస్ గౌడకు కాంస్యం
ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ మీట్లో భారత డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ కాంస్య పతకం సాధించాడు. ఆదివారం చైనాలోని షాంఘైలో జరిగిన ఈ ఈవెంట్లో 31 ఏళ్ల వికాస్ గౌడ డిస్క్‌ను 63.90 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచాడు. మలాచౌస్కీ (పోలండ్-64.65 మీటర్లు) స్వర్ణం సాధించగా... రాబర్ట్ ఉర్బానెక్ (పోలండ్-64.47 మీటర్లు) రజతం దక్కించుకున్నాడు. వికాస్‌కు 4 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 53 వేలు) లభించింది. -
రజత 'వికాసం'
గత మూడు రోజులుగా ఇంచియాన్‌లో ‘పసిడి' కాంతులు విరజిమ్మిన భారత క్రీడాకారులు మంగళవారం మాత్రం రజతానందాన్ని కలిగించారు. మొత్తానికి 11వ రోజు ఏషియాడ్‌లో నాలుగు పతకాలతో భారత ప్రదర్శన కొంచెం మోదం... కొంచెం ఖేదంలా సాగింది. డిస్కస్ త్రోలో కచ్చితంగా స్వర్ణం సాధిస్తాడని భావించిన వికాస్ గౌడ రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇక బాక్సింగ్‌లో మిశ్రమ ఫలితాలు లభించాయి. మేరీకోమ్ మెరిపించి ఫైనల్‌కు చేరగా.. సరితా దేవి, పూజా రాణి సెమీఫైనల్లో ఓటమిపాలై కాంస్య పతకాలతో సంతృప్తి పడ్డారు. వికాస్ కృషన్, సతీశ్ కుమార్ సెమీఫైనల్‌కు చేరి కనీసం కాంస్యాలు ఖాయం చేయగా... దేవేంద్రో సింగ్, శివ థాపా క్వార్టర్ ఫైనల్లో ఓటమి చవిచూశారు. ఎవరూ ఊహించని విధంగా సెయిలింగ్‌లో వర్ష, ఐశ్వర్య ద్వయం కాంస్యం నెగ్గి ఆశ్చర్యపరిచింది. ఇంచియాన్: తన చిరకాల ప్రత్యర్థి చేతిలో మళ్లీ ఓడిపోయిన భారత స్టార్ డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ ఆసియా క్రీడల్లో రజత పతకంతో సంతృప్తి పడ్డాడు. మంగళవారం జరిగిన పురుషుల డిస్కస్ త్రో ఫైనల్లో వికాస్ గౌడ రెండో స్థానంలో నిలిచాడు. ఇటీవల గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన వికాస్ అదే ప్రదర్శనను ఆసియా క్రీడల్లో పునరావృతం చేయలేకపోయాడు. ఇరాన్‌కు చెందిన ఎహ్సాన్ హదాదీ వరుసగా మూడోసారి స్వర్ణం నెగ్గి ‘హ్యాట్రిక్’ సాధించాడు. 2 కేజీల బరువుండే డిస్క్‌ను హదాదీ 65.11 మీటర్ల దూరం విసరగా... వికాస్ 62.58 మీటర్ల దూరం విసిరి ఆసియా క్రీడల్లో తొలిసారి రజతం కైవసం చేసుకున్నాడు. 2006 దోహా క్రీడల్లో ఆరో స్థానంలో నిలిచిన ఈ కర్ణాటక అథ్లెట్... 2010 గ్వాంగ్జౌ క్రీడల్లో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించాడు. ఇప్పటివరకు హదాదీ, వికాస్ పరస్పరం బరిలోకి దిగిన ఈవెంట్లలో ఒక్కసారి మాత్రమే వికాస్ తన ప్రత్యర్థికంటే మెరుగైన ప్రదర్శన చేశాడు. 6 అడుగుల 9 అంగుళాల ఎత్తు, 110 కేజీల బరువున్న వికాస్‌కు ఇంచియాన్ వేదిక మరోసారి రజతానందాన్ని మిగిల్చింది. 2005లో ఇంచియాన్లోనే జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ వికాస్‌కు రజతం వచ్చింది. మరోవైపు పురుషుల 110 మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో సిద్ధాంత్ 13.73 సెకన్లతో ఆరో స్థానంలో నిలిచాడు. ఫైనల్స్‌కు ఐదుగురు: అథ్లెటిక్స్‌లో నాలుగు ఈవెంట్స్‌లో ఐదుగురు భారత అథ్లెట్స్ ఫైనల్లోకి ప్రవేశించారు. మహిళల 800 మీటర్లలో టింటూ లూకా, సుష్మా దేవి... మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో అశ్విని అకుంజి, పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో జితిన్ పాల్, పురుషుల 800 మీటర్లలో సాజిష్ జోసెఫ్ ఫైనల్‌కు అర్హత సాధించారు. -
డిస్కస్ త్రోలో వికాస్ గౌడకు రజతం
ఇంచియాన్:ఆసియా క్రీడల్లో భారత అథ్లెటిక్స్ మెరుస్తున్నారు. మంగళవారం జరిగిన పురుషుల డిస్కస్ త్రో విభాగంలో వికాస్ గౌడ్ రజత పతకాన్ని చేజిక్కించుకున్నాడు. ఇంచియాన్ జరుగుతున్న ఆసియన్ గేమ్స్ డిస్కస్ త్రో ఈవెంట్ లో 62.58 మీటర్లు విసిరిన వికాస్ రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉండగా ఇరాన్ కు చెందిన ఈషాన్ హదాది 65. 11 మీటర్లు విసిరి స్వర్ణ పతకాన్ని దక్కించుకోగా, ఖతార్ కు చెందిన మహ్మద్ అహ్మద్ కాంస్య పతకం లభించింది. మహ్మద్ 61.25 మీటర్లు విసిరి మూడో స్థానంలో నిలిచాడు. అంతకుముందు మహిళల విభాగంలో భారత్ కు చెందిన సీమా పూనియా స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. -
General Awareness Model Questions for IBPS RRBs
1. Vikas Gowda won a gold medal in the 2014 Commonwealth Games in Glasgow in which of the following sports? a) Weightlifting b) Shooting c) Wrestling d) Discus throw e) None of these 2. Reuven Rivlin is the new President of which of the following countries? a) Germany b) Israel c) Austria d) Hungary e) Romania 3. Which of the following teams was placed third in the 2014 FIFA World Cup? a) Germany b) Argentina c) Netherlands d) Brazil e) Belgium 4. Who were runners up in FIFA World Cup 2014? a) Germany b) Netherlands c) Argentina d) Brazil e) Colombia 5. Who is the Present Deputy Chairman of Rajya Sabha? a) Sumitra Mahajan b) Arun Jaitely c) Gulam Nabi Azad d) P. J. Kurien e) P. Sreedharan 6. 56th Annual Grammy Awards "Song of the Year"? a) I Will Wait b) I Cry c) One More Night d) Royals e) Passenger 7. Name the Chairman of ISRO (Indian Space Research Organization)? a) Shekar Basu b) Dr. M. Y. S. Prasad c) K. Radha Krishnan d) Ranjit Biswal e) N. Srinivasan 8. Who got the "India's Global Icon of the Year" award? a) Amir khan b) Amitabh Bachchan c) Narendra modi d) Rajini kanth e) Abdul kalam 9. Which film bagged Best Film in BAFTA Awards 2014? a) 12 Years a Slave b) Bhaag Milkha Bhaag c) The Flick d) The Goldfinch e) Margaret Fuller 10. What is the official currency of Argentina? a) Argentine Peso b) Argentine Real c) Argentine Pula d) Argentine Dollar e) Argentine Rope 11. Cricketer of the year of CEAT Awards is bagged by: a) Shikhar Dhawan (India) b) Shakib Al Hasan (Bangladesh) c) Virat Kohli (India) d) Mitchell Jonson (Australia) e) Glenn Maxwell (Australia) 12. Who among the following was conferred Padma Vibhushan during this year? a) Dr. Raghunath A. Mashelkar, Science and Engineering b) Shri B.K.S. Iyengar c) Shri T.H. Vinayakram, Art - Ghatam Artist, Tamil Nadu d) Dr. Thirumalachari Ramasami, Science and Engineering, Delhi e) Smt Rani Karnaa, Art - Kathak, West Bengal 13. Who is the Secretary General of SAARC (The South Asian Associa- tion for Regional Cooperation)? a) Takehiko Nakao b) Jose Manuel Barroso c) Nkosazana Dilmini Zuma d) Le luong Minh Jakartha e) Arjun Bahadur Thapa 14. K. V. Chowdary is the Chairman of: a) ICAI (Institute of Chartered Accountants of India) b) PAC (Public Accounts Committee) c) CBDT (Central Board of Direct Taxes) d) SEBI (Securities and Exchange Board of India) e) ABC (Audit Bureau of Circulations) 15. The Budget 2014-15 extends ____ per cent withholding tax on corporate bonds until June 30, 2017: a) 3 b) 4 c) 5 d) 6 e) 7 16. The Budget 2014-15 raises limit on foreign direct investment in defence sector to ____ per cent from ____ per cent: a) 49; 25 b) 46; 26 c) 47; 25 d) 48; 26 e) 49; 26 17. World Literacy Day is observed on a) Sep 5 b) Aug 6 c) Sep 8 d) Oct 24 e) Dec 7 Key 1) d; 2) b; 3) c; 4) c; 5) d; 6) d; 7) c; 8) b; 9) a; 10) a; 11) c; 12) b; 13) e; 14) c; 15) c; 16) e; 17) c. -
స్వర్ణం గురించే ఆలోచించాను...
గ్లాస్గో: నాలుగేళ్ల క్రితం స్వదేశంలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో రజతంతో సంతృప్తి పడిన భారత స్టార్ డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ... స్కాట్లాండ్లో మాత్రం అనుకున్నది సాధించాడు. ఐదున్నర దశాబ్దాల సుదీర్ఘ విరామానికి తెరదించుతూ... కామన్వెల్త్ గేమ్స్ అథ్లెటిక్స్ పురుషుల విభాగంలో భారత్‌కు స్వర్ణం అందించిన రెండో అథ్లెట్‌గా గుర్తింపు పొందాడు. గురువారం రాత్రి జరిగిన పురుషుల డిస్కస్ త్రోలో వికాస్ గౌడ డిస్క్‌ను 63.64 మీటర్ల దూరం విసిరి పసిడి పతకం నెగ్గిన సంగతి విదితమే. 1958 కార్డిఫ్ గేమ్స్‌లో మిల్కా సింగ్ స్వర్ణం గెలిచాక... ఈ క్రీడల్లో భారత అథ్లెట్‌కు బంగారు పతకం రావడం ఇదే ప్రథమం. ‘ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించాలనే ఏకైక ఆలోచన గత ఏడెనిమిది నెలలుగా నా మదిలో మెదులుతోంది. పసిడి నెగ్గడం నాకెంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఇక కొన్ని రోజులు సేదతీరుతాను. నాకిష్టమైన భోజనం చేస్తాను’ అని 6 అడుగుల 9 అంగుళాల ఎత్తు, 110 కేజీల బరువున్న 31 ఏళ్ల వికాస్ గౌడ తెలిపాడు. మైసూరులో జన్మించిన వికాస్ ప్రస్తుతం అమెరికాలోని ఆరిజోనాలో నివాసం ఉంటున్నాడు. వికాస్ తండ్రి శివ 1988 సియోల్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెటిక్స్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. -
‘రజత’ సీమ
డిస్కస్ త్రోలో రెండో స్థానం అథ్లెటిక్స్‌లో భారత్‌కు మరో పతకం కృష్ణ పూనియా విఫలం వేదిక మారింది. ఫలితం మారింది. నాలుగేళ్ల క్రితం న్యూఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్యం నెగ్గిన డిస్కస్ త్రోయర్ సీమా పూనియా (అంటిల్) ఈసారి మరో మెట్టు ఎగబాకింది. గ్లాస్గోలో అద్వితీయ ప్రదర్శనతో రజత పతకం సొంతం చేసుకుంది. మరోవైపు ఢిల్లీ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన స్టార్ డిస్కస్ త్రోయర్ కృష్ణ పూనియా తీవ్రంగా నిరాశపరిచి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో వరుసగా రెండో రోజు భారత డిస్కస్ త్రోయర్లు రాణించారు. గురువారం పురుషుల విభాగంలో వికాస్ గౌడ పసిడి పతకం నెగ్గగా... శుక్రవారం మహిళల విభాగంలో సీమా పూనియా (అంటిల్) ‘రజత’ దరహాసం చేసింది. మొత్తం 12 మంది పాల్గొన్న ఫైనల్లో సీమా తన ఐదో ప్రయత్నంలో డిస్క్‌ను అత్యధికంగా 61.61 మీటర్ల దూరం విసిరి రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన డానీ శామ్యూల్స్ (64.88 మీటర్లు) స్వర్ణం సాధించగా... జేడ్ లాలీ (ఇంగ్లండ్-60.48 మీటర్లు) కాంస్యం సంపాదించింది. నాలుగేళ్ల క్రితం న్యూఢిల్లీలో ఈ క్రీడాంశంలో భారత క్రీడాకారిణులు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు నెగ్గి ‘క్లీన్ స్వీప్’ చేశారు. కానీ ఈసారి మాత్రం అదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయారు. కచ్చితంగా పతకం సాధిస్తుందనుకున్న కృష్ణ పూనియా నిరాశపరిచింది. మొత్తం ఆరు ప్రయత్నాల్లో ఆమె అత్యుత్తమంగా డిస్క్‌ను 57.84 మీటర్ల దూరం మాత్రమే విసిరింది. ఇక మహిళల హైజంప్‌లో సహనా కుమారి కూడా పతకం నెగ్గలేకపోయింది. ఆమె 1.86 మీటర్ల దూరం ఎత్తుకు ఎగిరి ఎనిమిదో స్థానంతో సంతృప్తి పడింది. సరిత పంచ్ అదిరింది 60 కేజీల విభాగంలో ఫైనల్లోకి మహిళల బాక్సింగ్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. 60 కేజీల విభాగంలో లైష్రామ్ సరితా దేవి ఫైనల్లోకి దూసుకెళ్లగా... 51 కేజీల విభాగంలో పింకీ జాంగ్రా సెమీఫైనల్లో ఓడిపోయింది. మరియా మచోంగా (మొజాంబిక్)తో జరిగిన సెమీఫైనల్లో సరిత 3-0 (40-33, 40-32, 40-34)తో విజయం సాధించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. మచోంగాతో జరిగిన బౌట్లో సరిత ఆద్యంతం ఆధిపత్యం చలాయించింది. ఆరంభం నుంచే ప్రత్యర్థిపై పదునైన పంచ్‌లు సంధిస్తూ ఉక్కిరిబిక్కిరి చేసింది. ఒకదశలో సరిత పంచ్‌లు తాళలేక మచోంగా రింగ్‌లో సరిగ్గా నిలబడలేకపోయింది. రిఫరీ వార్నింగ్ తర్వాత మచోంగా బౌట్‌ను కొనసాగించినా సరిత ధాటికి ఆమె కోలుకోలేకపోయింది. పురుషుల 49 కేజీల సెమీఫైనల్లో దేవేంద్రో సింగ్ 3-0 (30-27, 30-27, 30-27)తో యాష్లే విలియమ్స్ (వేల్స్)పై నెగ్గి ఫైనల్లోకి ప్రవేశించాడు. పోరాడి ఓడిన పింకీ మిచెల్లా వాల్ష్ (ఇంగ్లండ్)తో జరిగిన సెమీఫైనల్లో పింకీ 0-2తో ఓడింది. రెండు నిమిషాల వ్యవధిగల నాలుగు రౌండ్స్ గల ఈ బౌట్లో పింకీ ప్రతి రౌండ్లో గట్టిపోటీనిచ్చినా కీలకదశలో వాల్ష్ పైచేయి సాధించింది. బౌట్‌ను పర్యవేక్షించిన కెనడా, హంగేరి జడ్జిలు 40-36, 39-37 స్కోర్లతో వాల్ష్ వైపు మొగ్గారు. కజకిస్థాన్ జడ్జి మాత్రం ఇద్దరికీ 38-38 పాయింట్లు ఇచ్చింది. సెమీస్‌లో ఓడిన పింకీకి కాంస్య పతకం ఖాయమైంది. సెమీస్‌లో కశ్యప్, సింధు, గురుసాయిదత్ కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్లు పారుపల్లి కశ్యప్, పి.వి.సింధు, గురుసాయిదత్లు సెమీఫైనల్స్‌కు చేరుకున్నారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సింధు 21-10, 21-9తో అన్నా రంకిన్ (న్యూజిలాండ్)పై అలవోక విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్స్‌లో కశ్యప్ 21-13, 21-14తో డారెన్ ల్యూ (మలేసియా)పై గెలుపొందగా, గురుసాయిదత్ 21-15, 8-21, 21-17తో చోంగ్ వీ ఫెంగ్ (మలేసియా) నెగ్గాడు. అయితే కిడాంబి శ్రీకాంత్ 10-21, 21-12, 12-21తో డెరెక్ వాంగ్ (సింగపూర్) చేతిలో, పి.సి.తులసి 21-18, 19-21, 19-21తో జింగ్ యీ టీ (మలేసియా) చేతిలో క్వార్టర్స్‌లో ఓటమిపాలయ్యారు.