భారత 'ఆశాకిరణం' వికాస్ గౌడ వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో డిస్కస్ త్రో లో నిరాశ పరిచాడు. ఫైనల్ కు చేరి పతకం పై ఆశలు రేపిన వికాస్ తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
భారత 'ఆశాకిరణం' వికాస్ గౌడ వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో డిస్కస్ త్రో లో నిరాశ పరిచాడు. ఫైనల్ కు చేరి పతకం పై ఆశలు రేపిన వికాస్ తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. శనివారం సాయంత్రం జరిగిన ఫైనల్లో ఇనప గుండును కేవలం 62.24 మీటర్లు విసిరి పాయింట్ల పట్టికలో కింది స్థానానికి పరిమితం అయ్యాడు. వికాస్ సీజనల్ బెస్ట్ 65.75మీటర్లు కూడా చేరుకోలేక పోయాడు. వికాస్ గౌడ్ ఇప్పటికి 5 సార్లు ప్రంపచ ఛాంపియన్ షిప్ కు క్వాలిఫై కాగా.. మూడు మార్లు ఫైనల్ రౌండ్ వరకూ వెళ్లాడు.
మరో వైపు శనివారం ఉదయం మహిళల 4X400 రిలేలో మన రన్నర్లు హీట్స్ స్థాయిలోనే వెనుదిరిగారు. చివరి రోజు బాబర్, ఒపి జైషా, సుధాసింగ్ చివరి రోజు ఆదివారం మారథాన్ లో పోటీ పడనున్నారు.