discus throw
-
పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం
పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం వచ్చింది. పురుషుల డిస్కస్ త్రో ఎఫ్ 56 కేటగిరీలో యోగేశ్ కథూనియా రజత పతకం గెలుచుకున్నాడు. కథూనియా తన తొలి ప్రయత్నంలోనే డిస్క్స్ను 42.22 మీటర్ల దూరం విసిరాడు. ఈ సీజన్లో అతనికి ఇది అత్యుత్తమ ప్రదర్శన. కథూనియాకు పారాలింపిక్స్‌లో ఇది వరుసగా రెండో రజత పతకం. గత (టోక్యో) పారాలింపిక్స్‌లోనూ కథూనియా రజతం సాధించాడు. ప్రస్తుత పారాలింపిక్స్ ఎఫ్ 56 కేటగిరీలో యోగేశ్ కథూనియా రజత పతకం సాధించగా.. బ్రెజిల్‌కు చెందిన క్లౌడిని బటిస్ట డోస్ శాంటోస్ స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. పారాలింపిక్స్‌లో బటిస్టకు ఇది వరుసగా మూడో స్వర్ణం. నేటి ఈవెంట్లో బటిస్ట్ తన ఐదో ప్రయత్నంలో డిస్కస్‌ను 46.86 మీట్లర దూరం విసిరాడు. ఇది పారాలింపిక్స్ రికార్డు. ఈ కేటగిరీలో గ్రీస్‌కు చెందిన కాన్స్టాంటినోస్ జోయునిస్ 41.32 మీటర్ల దూరం డిస్కస్‌ను విసిరి కాంస్యం సొంతం చేసుకున్నాడు. యోగేశ్ కథూనియా సాధించిన రజతంతో ప్రస్తుత పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య ఎనిమిదికి (ఒక స్వర్ణం, 3 రజతాలు, 4 కాంస్యాలు) చేరింది. -
22 ఏళ్ల చరిత్రను తిరగరాసిన పంజాబ్ అథ్లెట్
AFI National Federation Senior Athletics Championship 2022: కేరళలోని కాలికట్లో జరిగిన 25వ నేషనల్ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ మీట్లో పంజాబ్ డిస్కస్ త్రోయర్ కృపాల్ సింగ్ అద్భుతం చేశాడు. మంగళవారం జరిగిన పోటీల్లో డిస్క్‌ను 61.83 మీటర్ల దూరం విసిరి 22 క్రితం ఈ ఈవెంట్లో అనిల్ కుమార్ నెలకొల్పిన 59.55 మీటర్ల రికార్డును బద్దలు కొట్టాడు. Kirpal Singh of Punjab broke the 22 years old meet record in Discus Throw event in 25th National Federation Cup Sr Athletics Competition at Calicut (Kerala). He hurdled the discus to a distance of 61.83m in his fourth attempt. Old record was in the name of Anil Kumar (59.55m). — Athletics Federation of India (@afiindia) April 5, 2022 ఈ ఈవెంట్లో ఆది నుంచి నిలకడగా రాణించిన కృపాల్.. ఆరేళ్ల క్రితం తాను సాధించిన రికార్డ్‌ను (59.74 మీ) సైతం అధిగమించాడు. కృపాల్ నాలుగు ప్రయత్నాలలో డిస్క్‌ను 60మీకి పైగా దూరం విసిరాడు. ఇందులో రెండు సార్లు 61 మీటర్ల మార్కును అందుకోగా, అతని అత్యుత్తమ ప్రదర్శన 61.83 మీటర్లుగా నిలిచింది. కృపాల్ తన ప్రయత్నాల్లో 62 మార్కును దాటి ఉంటే, ఆ ఘనత సాధించిన మూడో భారత అథ్లెట్‌గా రికార్డుల్లోకెక్కేవాడు. చదవండి: భారత క్రికెటర్లకు శుభవార్త.. బయో బబుల్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం..! -
అదరహో... దేవేంద్ర, సుందర్
పారాలింపిక్స్ జావెలిన్ త్రోలోనే భారత్‌కు మరో రెండు పతకాలు లభించాయి. పురుషుల ఎఫ్–46 కేటగిరీలో పోటీపడిన రాజస్తాన్ జావెలిన్ త్రోయర్లు దేవేంద్ర ఝఝారియా రజతం సాధించగా... సుందర్ సింగ్ గుర్జర్ కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. 40 ఏళ్ల దేవేంద్ర బల్లెంను 64.35 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో... 25 ఏళ్ల సుందర్ సింగ్ బల్లెంను 64.01 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచారు. పారాలింపిక్స్‌లో దేవేంద్రకిది మూడో పతకం కావడం విశేషం. 2004 ఏథెన్స్ పారాలింపిక్స్ లో, 2016 రియో పారాలింపిక్స్‌లో దేవేంద్ర స్వర్ణ పతకాలు గెలిచాడు. వినోద్‌కు నిరాశ మరోవైపు ఆదివారం పురుషుల డిస్కస్ త్రో ఎఫ్–52 విభాగంలో కాంస్యం గెలిచిన వినోద్ కుమార్‌పై నిర్వాహకులు అనర్హత వేటు వేశారు. వినోద్ వైకల్యం వర్గీకరణ జాబితాలో లేదని అతని ప్రత్యర్థులు ఫిర్యాదు చేయడంతో సోమవారం నిర్వాహకులు దీనిపై సమీక్షించారు. చివరకు వినోద్ వైకల్యం వర్గీకరణ జాబితాలో లేకపోవడంతో అతని ఫలితాన్ని రద్దు చేసి కాంస్య పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. యోగేశ్ అద్భుతం... పురుషుల డిస్కస్ త్రో ఎఫ్–56 విభాగంలో భారత అథ్లెట్ యోగేశ్ కథునియా రజత పతకం సాధించాడు. తొలిసారి పారాలింపిక్స్‌లో బరిలోకి దిగిన 24 ఏళ్ల యోగేశ్ డిస్క్‌ను చివరిదైన ఆరో ప్రయత్నంలో 44.38 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. క్లాడినె బటిస్టా (బ్రెజిల్–45.59 మీటర్లు) స్వర్ణం, లియోనార్డో దియాజ్ (క్యూబా–43.36 మీటర్లు) కాంస్యం సాధించారు. మరోవైపు పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్–1 కేటగిరీలో భారత షూటర్ స్వరూప్ ఉన్హాల్కర్ నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన స్వరూప్ 203.9 పాయింట్లు స్కోరు చేశా>డు. -
అసాధారణం... దేవేంద్ర ప్రస్థానం
దేవేంద్ర ఝఝారియా గెలుపు ప్రస్థానమిది. ఒక్క మాటలో చెప్పాలంటే పారాలింపిక్స్‌లో భారత్‌కు పర్యాయదంగా ఝఝారియా నిలిచాడు. 2004లో అతను స్వర్ణం సాధించిన రోజు దేశంలో ఎంత మందికి తెలుసు? ఇప్పుడు ఎన్ని కోట్ల మంది పారాలింపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నారు? ఈ పురోగతిలో అతను పోషించిన పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. సొంత డబ్బులు పెట్టుకొని ఝఝారియా 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌కు వెళ్లాల్సి వచ్చింది. అందుకోసం అతని తండ్రి అప్పు కూడా చేశాడు. ఒక గొడ్డలి, ఒక సైకిల్ ట్యూబ్ అతని ప్రాక్టీస్ కిట్ అంటే నమ్మగలరా! భుజాలను బలంగా మార్చేందుకు గొడ్డలిని ఉపయోగించడం, చేతిలో బలం పెరిగేందుకు సైకిల్ ట్యూబ్‌ను వాడటం... ఇలాంటి స్థితిలో స్వర్ణం సాధించిన రోజుల నుంచి టోక్యోలో మూడో పతకం సాధించే వరకు దేవేంద్ర భారత పారా క్రీడలకు ప్రతినిధిగా వ్యవహరించగలిగాడంటే ఆ విజయాల వెనక ఎంతో శ్రమ, పట్టుదల ఉన్నాయి. ఎనిమిదేళ్ల వయసులో చెట్టు ఎక్కుతుంటే కరెంట్ షాక్ తగిలి ఝఝారియా తన ఎడమ చేతిని కోల్పోయాడు. అయితే పెరిగి పెద్దవుతున్న సమయంలో అతని చేతిని చూసి చుట్టుపక్కల పిల్లలు ‘కమ్జోర్’ అంటూ ఆట పట్టించడం మొదలు పెట్టారు. తాను బలహీనుడిని కాదని చూపించాలనే కసితో బల్లెం పట్టిన అతను మూడు ఒలింపిక్ పతకాలు అందుకునే వరకు ఎదగడం అసాధారణం. 2008, 2012 పారాలింపిక్స్‌లో దేవేంద్ర పాల్గొనే ఎఫ్–46 కేటగిరీ లేకపోవడంతో అతనికి మరో రెండు పతకాలు దూరమయ్యాయని కచ్చితంగా చెప్పవచ్చు. ‘మా నాన్న చేసిన త్యాగాలు, ఆయన ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి చేరుకున్నాను. కొద్ది రోజుల క్రితం ఒలింపిక్స్ కోసం నా శిక్షణ సాగుతున్న సమయంలోనే క్యాన్సర్‌తో ఆయన మరణించారు. ఈ పతకం నాన్నకు అంకితం.’ – దేవేంద్ర -
పారా ఒలింపిక్స్ విజేతలకు ప్రధాని ఫోన్ కాల్
టోక్యో: టోక్యో వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట పండుతోంది. ఈవెంట్లో దేశానికి తొలి స్వర్ణం సాధించిన షూటర్ అవని లేఖారా, రజతం సాధించిన డిస్కస్ త్రోయర్ యోగేశ్ కతునియాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించారు. మోదీ లేఖారాతో మాట్లాడుతూ.. ఇది చాలా గర్వించదగ్గ విషయం అని ఆమెను అభినందించారు. ప్రధాని మాటల అనంతరం అవని.. దేశ ప్రజల నుంచి తనకు లభించిన మద్దతు పట్ల సంతోషం వ్యక్తం చేసింది. లేఖారా మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1 ఈవెంట్లో మొత్తం 249.6 స్కోరుతో ప్రపంచ రికార్డును సమం చేసింది. ఎఫ్56 విభాగంలో రజత పతకం సాధించిన కతునియాను అభినందిస్తూ, ప్రధానీ మోదీ ట్వీట్ చేశారు. అందులో.. యోగేశ్ కతునియాది అత్యుత్తమ ప్రదర్శన. అతను మన దేశానికి రజత పతకం తెచ్చినందుకు సంతోషిస్తున్నాను. అతని విజయం వర్ధమాన అథ్లెట్లను ప్రోత్సహిస్తుందన్నారు. అనంతరం ప్రధాని కాల్ చేసి.. యోగేశ్ విజయానికి భరోసా ఇవ్వడంలో అతని తల్లి చేసిన కృషిని ప్రశంసించారు. 40 ఏళ్లలో రెండుసార్లు స్వర్ణం గెలిచిన జావెలిన్ త్రోయర్ దేవేంద్ర ఝజారియా కూడా ఎఫ్ 46 విభాగంలో సోమవారం రజత పతకాన్ని సాధించాడు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఝజారియాను ప్రధాని అభినందించారు. మోదీ ట్వీట్ చేస్తూ.. అద్భుతమైన ప్రదర్శన! మా అత్యంత అనుభవజ్ఞులైన అథ్లెట్లలో ఒకరు రజత పతకం సాధించారు. మీరు సాధించిన పతకాలతో దేశం గర్వపడుతుందన్నారు. చదవండి: Tokyo Paralympics 2021: పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట.. -
కోచ్ లేకుండానే పతకం సాధించిన అభినవ ఏకలవ్యుడు
టోక్యో: పారాలింపిక్స్ డిస్కస్ త్రో ఈవెంట్లో 44.38 మీటర్లు డిస్కస్‌ను విసిరి రజత పతకం సాధించిన యోగేశ్ కతునియాపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లివిరుస్తున్నాయి. ఢిల్లీకి చెందిన ఈ 24 ఏళ్ల అథ్లెట్.. కోచ్ లేకుండానే పతకం సాధించి దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాడు. ఈ విషయం తెలిసుకున్న క్రీడాభిమానలు యోగేశ్‌ను అభినవ ఏకలవ్యుడిగా అభివర్ణిస్తున్నారు. పతకం సాధించిన సందర్భంగా యోగేశ్ మాట్లాడుతూ.. చాలాకాలంగా కోచ్ లేకుండానే సాధన చేశానని, ఈసారి స్వర్ణం తృటిలో చేజారినా(మీటర్ తేడాతో) బాధలేదని, ప్యారిస్ పారాలింపిక్స్‌లో మాత్రం ఖచ్చితంగా స్వర్ణం గెలుస్తానని ధీమా వ్యక్తం చేశాడు. ఈ మాటలు భారతీయులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా, కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో సాధన చేసేందుకు యోగేశ్ గత రెండేళ్లుగా అడ్డంకులను ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఈ మధ్యకాలంలో కఠోరంగా సాధన చేసిన అతను.. ఖాళీ స్టేడియాల్లో, మార్గనిర్దేశకుడు లేకుండానే ఒంటరిగా సాధన చేశాడు. ఇలా ఎవరి సహాయ సహకారాలు లేకుండా పారాలింపిక్స్‌లో పతకం సాధించి భవిష్యత్తు తరం క్రీడాకారులకు స్పూర్తిగా నిలిచాడు. ఇదిలా ఉంటే, ఎనిమిదేళ్ల వయసులోనే యోగేశ్‌కు పక్షవాతం వచ్చి శరీరంలో కొన్ని అవయవాలు పనిచేయకుండా పోయాయి. అప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న అతను.. ఎన్నో అడ్డంకులను అధిగమించి పారాలింపిక్స్‌కు సిద్ధమయ్యాడు. గురువు లేకుండానే పతకం గెలిచి క్రీడాభిమానల మనసుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించాడు. చదవండి: వినోద్ కుమార్‌కు భంగపాటు.. కాంస్య పతకాన్నిరద్దు చేసిన నిర్వాహకులు -
వినోద్ కుమార్‌కు భంగపాటు.. కాంస్య పతకాన్ని రద్దు చేసిన నిర్వాహకులు
టోక్యో: పారాలింపిక్స్ పురషుల డిస్కస్ త్రో(F52) కేటగిరీలో ఆదివారం భారత అథ్లెట్ వినోద్ కుమార్ డిస్క్‌ను 19.91 మీటర్ల దూరం విసిరి కాంస్య పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అయితే, వినోద్ F52 కేటగిరీ పరిధిలోకి రాడని ఫిర్యాదు అందడంతో అతడు గెలిచిన పతకాన్ని నిర్వహకులు హోల్డ్‌లో ఉంచారు. అయితే, ఇవాళ ఫిర్యాదును సమీక్షించిన నిర్వహకులు వినోద్ కుమార్ F52 కేటగిరీ పరిధిలోకి రాడని తేల్చి అతను గెలుచుకున్న కాంస్య పతకాన్ని రద్దు చేశారు. ఈ విషయాన్ని టోక్యో పారాలింపిక్స్ నిర్వహకులు అధికారికంగా ప్రకటించారు. కండరాల బలహీనత, కదలికల్లో లోపం, అవయవ లోపం ఉన్న వారు మాత్రమే F52 కేటగిరీ పరిధిలోకి వస్తారని, వినోద్ కుమార్ ఈ కేటగిరీ పరిధిలోకి రాడని వారు తేల్చారు. కాగా, ఇదే నిర్వహకులు ఈ నెల 22న వినోద్ కుమార్ F52 కేటగిరీలో పోటీపడవచ్చని అనుమతివ్వడం చర్చనీయాంశంగా మారింది. చదవండి: Avani Lekhara: భారత 'అవని' పులకించింది.. -
టోక్యో పారా ఒలింపిక్స్‌లో ఇవాళ ఒక్కరోజే భారత్‌కు 4 పతకాలు
-
Tokyo Paralympics 2021: పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట..
టోక్యో: టోక్యో వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట పండుతోంది. తాజాగా భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. జావిలన్‌త్రో లో దేవేంద్ర ఝజారియా రజతం పతకం సాధించగా, సుందర్ సింగ్ కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. దీంతో సోమవారం ఒక్కరోజే భారత్ ఖాతాలో నాలుగు పతకాలు చేరాయి. అంతకు ముందు పారా ఒలింపిక్స్ భారత్‌కు తొలి స్వర్ణ పతకం లభించింది. మహిళల షూటింగ్ 10 మీటర్ల విభాగంలో విజయం సాధించి అవని లేఖారా గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. డిస్కస్ త్రోలో ఎఫ్-56 విభాగంలో యోగేశ్ కధూనియా రజత పతకం సాధించాడు. ఇప్పటి వరకు పతకాలు సాధించింది వీరే 1. అవని లేఖారా- గోల్డ్ మెడల్ (షూటింగ్) 2. యోగేశ్ కధూనియా- సిల్వర్ మెడల్(డిస్కస్ త్రో) 3. నిశాద్ కుమార్- సిల్వర్ మెడల్(హైజంప్) 4.భవీనాబెన్ పటేల్- సిల్వర్ మెడల్(టేబుల్ టెన్నిస్) 5. దేవేంద్ర ఝజారియా- సిల్వర్ మెడల్(జావిలన్‌త్రో) 6. సుందర్ సింగ్- కాంస్య పతకం(జావిలన్‌త్రో) చదవండి: Tokyo Paralympics 2021:పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం -
డిస్కస్ త్రోలో కాంస్యం గెలిచినా...
పురుషుల అథ్లెటిక్స్ డిస్కస్ త్రో ఎఫ్–52 కేటగిరీలో భారత ప్లేయర్ వినోద్ కుమార్ డిస్క్‌ను 19.91 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. కోసెవిచ్ (పోలాండ్– 20.02 మీటర్లు) స్వర్ణం... సాండోర్ (క్రొయేషియా–19.98 మీటర్లు) రజతం గెల్చుకున్నారు. అయితే ప్రత్యర్థులు వినోద్ ఎఫ్–52 కేటగిరీ పరిధిలోకి రాడని ఫిర్యాదు చేశారు. కండరాల బలహీనత, కదలికల్లో లోపం, అవయయ లోపం ఉన్నవారు ఎఫ్–52 కేటగిరీలోకి వస్తారు. ‘నిర్వాహకులు 22వ తేదీన వినోద్‌ను పరీక్షించి అతను ఎఫ్–52 విభాగంలో పోటీపడవచ్చని నిర్ణయించారు. నేడు ఫిర్యాదును సమీక్షించి ఫలితాన్ని ప్రకటిస్తారు’ అని భారత చెఫ్ డి మిషన్ గురుశరణ్ సింగ్ వివరించారు. -
Tokyo Olympics: మహిళల డిస్కస్ త్రో ఫైనల్స్‌లో భారత్‌కు నిరాశ
టోక్యో: ఒలింపిక్స్ మహిళల డిస్కస్ త్రో ఫైనల్లో భారత్‌కు నిరాశ ఎదురైంది. ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడో పతకం సాధిస్తుందని ఆశించిన డిస్కస్ త్రో అథ్లెట్ కమల్‌ప్రీత్ కౌర్ ఫైనల్స్‌లో విఫలమైంది. 12 మంది పాల్గొన్న ఫైనల్లో కమల్‌ప్రీత్ కౌర్ ఆరో స్థానంలో నిలిచింది. అమెరికా అథ్లెట్ అల్మన్ వాలరీ అత్యుత్తమ ప్రదర్శన చేసి స్వర్ణం సొంతం చేసుకుంది. జర్మనీ అథ్లెట్ పుడెనెజ్ క్రిస్టిన్ రజతం ఎగరేసుకుపోయింది. ఇక క్యూబా అథ్లెట్ పెరెజ్ యామి మూడో స్థానంలో నిలిచి కాంస్యం చేజిక్కించుకుంది. ఇక అమెరికా అథ్లెట్ అల్మన్ వాలరీ తొలి ప్రయత్నంలోనే 68.98 మీటర్లతో అందరికన్నా అత్యుత్తమ ప్రదర్శన చేసింది. జర్మనీ అథ్లెట్ పుడెనెజ్ క్రిస్టిన్ ఐదో ప్రయత్నంలో 66.86 మీటర్ల ప్రదర్శనతో రెండో స్థానంలో నిలువగా.. ఇక క్యూబా అథ్లెట్ పెరెజ్ యామి తొలి ప్రయత్నంలో సాధించిన 65.72 మీటర్ల ప్రదర్శనతో మూడో స్థానంలో నిలిచింది. మరోవైపు సెమీస్‌లో 64 మీటర్లతో రెండో అత్యుత్తమ ప్రదర్శన చేసిన భారత అథ్లెట్ కమల్‌ప్రీత్‌కౌర్ ఫైనల్లో మూడో ప్రయత్నంలో 63.70 ప్రదర్శన చేసింది. -
ఎన్నోఏళ్ల భారత్ కల.. రేపు నిజమయ్యే ఛాన్స్!
అంతా అనుకున్నట్లు జరిగితే... ఎన్నో ఏళ్లుగా ఒలింపిక్స్‌లో భారత్‌ను ఊరిస్తోన్న అథ్లెటిక్స్ పతకం సోమవారం నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మహిళల డిస్కస్ త్రో విభాగంలో భారత క్రీడాకారిణి కమల్‌ప్రీత్ కౌర్ ప్రదర్శన పతకంపై ఆశలు రేకెత్తిస్తోంది. తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న 25 ఏళ్ల ఈ పంజాబీ అమ్మాయి శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌లో మూడో ప్రయత్నంలో నేరుగా ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసే కనీస అర్హత మార్క్‌ను (64 మీటర్లు) అందుకుంది. అంతేకాకుండా ఫైనల్‌కు అర్హత పొందిన మొత్తం 12 మందిలో కమల్‌ప్రీత్ రెండో స్థానంలో నిలువడం విశేషం. భారత్‌కే చెందిన మరో డిస్కస్ త్రోయర్ సీమా పూనియా నాలుగోసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నప్పటికీ ఈసారి కూడా క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగి నిరాశపరిచింది. టోక్యో: ఒలింపిక్స్‌లో శనివారం భారత అథ్లెట్స్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల డిస్కస్ త్రో ఈవెంట్లో కమల్‌ప్రీత్ కౌర్ ఫైనల్‌కు అర్హత సాధించగా... సీమా పూనియా క్వాలిఫయింగ్‌ను దాటలేకపోయింది. పురుషుల లాంగ్‌జంప్ క్వాలిఫయింగ్‌లో శ్రీశంకర్ ఓవరాల్‌గా 25వ స్థానంలో నిలిచాడు. క్వాలిఫయింగ్ గ్రూప్ ‘బి’లో పోటీపడిన కమల్‌ప్రీత్ మూడో ప్రయత్నంలో డిస్క్‌ను 64 మీటర్ల దూరం విసిరి తన గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచింది. తొలి ప్రయత్నంలో ఆమె డిస్క్‌ను 60.29 మీటర్లు... రెండో ప్రయత్నంలో 63.97 మీటర్ల దూరం విసిరింది. 16 పాల్గొన్న ఈ విభాగంలో వలారీ ఆల్మన్ (అమెరికా) 66.42 మీటర్లతో అగ్రస్థానాన్ని సంపాదించింది. 64 మీటర్ల దూరం విసిరితే నేరుగా ఫైనల్ బెర్త్ ఖరారవుతుంది. 15 మందితో కూడిన గ్రూప్ ‘ఎ’లో పోటీపడ్డ భారత మరో డిస్కస్ త్రోయర్ సీమా డిస్క్‌ను 60.57 మీటర్ల దూరం విసిరి ఆరో స్థానం లో నిలిచింది. మొత్తం రెండు గ్రూప్‌లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 12 మంది ఫైనల్‌కు అర్హత సాధించారు. ఓవరాల్‌గా సీమా 16వ స్థానం లో నిలిచి ఫైనల్ బెర్త్ దక్కించుకోలేకపోయింది. సోమవారం స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం ఫైనల్ జరుగుతుంది. క్వాలిఫయింగ్‌లో కమల్ ప్రీత్ ప్రదర్శన డిఫెండింగ్ చాంపియన్ సాండ్రా పెర్కోవిచ్ (క్రొయేషియా–63.75 మీటర్లు), వరల్డ్ చాంపియన్ వైమి పెరెజ్ (క్యూబా–63.18 మీటర్లు) కంటే మెరుగ్గా ఉండటం విశేషం. దాంతో కమల్‌ప్రీత్ ఇదే ప్రదర్శనను ఫైనల్లోనూ పునరావృతం చేస్తే పతకం వచ్చే అవకాశముంది. ‘తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నందుకు కాస్త నెర్వస్‌గా ఫీలయ్యాను. అయితే తొలి త్రో వేశాక ఆత్మవిశ్వాసం పెరిగింది. ఫైనల్లో నా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి భారత్‌కు పతకం అందించమే నా ఏకైక లక్ష్యం’ అని వచ్చే ఏడాది అమెరికాలో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు కూడా అర్హత పొందిన కమల్‌ప్రీత్ వ్యాఖ్యానించింది. ►పురుషుల లాంగ్‌జంప్‌లో భారత ప్లేయర్ శ్రీశంకర్ 7.69 మీటర్ల దూరం దూకి గ్రూప్ ‘బి’లో 13వ స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా 29 మంది పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో శ్రీశంకర్‌కు 25వ స్థానం దక్కింది. -
డిస్కస్ త్రోలో సీమాకు కాంస్యమే!
ఏషియాడ్ మహిళల డిస్కస్ త్రో డిఫెండింగ్ చాంపియన్, భారత వెటరన్ క్రీడాకారిణి సీమా పూనియా... ఈసారి కాంస్యంతో వెనుదిరిగింది. గురువారం జరిగిన పోటీలో 35 ఏళ్ల సీమా డిస్క్‌ను 62.26 మీటర్లు మాత్రమే విసరగలిగింది. ఆసియా చాంపియన్, చైనా అథ్లెట్ చెన్ యాంగ్ (65.12 మీ.) స్వర్ణం నెగ్గింది. ఆ దేశానికే చెందిన ఫెంగ్ బిన్ (64.25 మీ.)కు రజతం దక్కింది. మరోవైపు 2014 ఇంచియోన్ ఏషియాడ్‌లో స్వర్ణం గెలిచిన గణాంకాలను (61.03 మీ.) సీమా సవరించినా ప్రత్యర్థులు ఇంకా మెరుగ్గా రాణించడంతో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత ఆరేళ్లలో ఆమెకిదే అత్యుత్తమ రికార్డు కావడం గమనార్హం. భారత మరో త్రోయర్ సందీప్ కుమారి (54.61 మీ.) ఐదో స్థానంలో నిలిచింది. పెద్ద మనసు చాటుకుంది ఆసియా క్రీడల రోజువారీ భత్యం కింద తనకు లభించిన 700 అమెరికన్ డాలర్ల (రూ.50 వేలు)కు మరో లక్ష రూపాయలు కలిపి కేరళ వరద బాధితుల సహాయార్థం అందజేయనున్నట్లు సీమా పూనియా ప్రకటించింది. ఇతర అథ్లెట్లు కూడా తమ భత్యాల్లో కనీసం సగమైనా అందించాలని ఆమె కోరింది. స్వయంగా కేరళ వెళ్లి సహాయ చర్యల్లో పాల్గొంటానని హరియాణాకు చెందిన సీమా తెలిపింది. అక్కడి నుంచి తిరిగి వచ్చాక తన ఎడమ పాదంలో దెబ్బతిన్న ఎముకకు శస్త్ర చికిత్స చేయించుకోనున్నట్లు పేర్కొంది. గురువారం డిస్కస్ త్రో పోటీల సందర్భంగానూ గాయం ఇబ్బంది పెట్టిందని, అయితే తన వైఫల్యానికి అది కారణం కాదని వివరించింది. ఇదే సందర్భంగా తనకు అర్జున అవార్డు రాకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రస్తుతం సీమా హరియాణా పోలీస్ శాఖలో ఎస్సైగా పనిచేస్తోంది. ద్యుతీ, స్వప్నలకు నజరానా ఏషియాడ్ మహిళల 100 మీ., 200 మీ. పరుగులో రజతాలు నెగ్గిన ద్యుతీ చంద్‌కు రూ.కోటిన్నర నగదు ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. హెప్టాథ్లాన్‌లో స్వర్ణం సాధించిన స్వప్నా బర్మన్కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రూ.10 లక్షల నజరానా ప్రకటించారు. -
'వెన్నెల' క్రీడా వెలుగులు
మట్టిలో ఉన్నా మాణిక్యం కాంతులీనుతుందంటారు. అలాంటి కోవకు చెందినదే ఓ చిన్నారి. చదివేది గ్రామీణ పాఠశాలలోనైనా.. క్రీడా పోటీల్లో మాత్రం మిస్సైల్లా దూసుకుపోతోంది. తొమ్మిదో తరగతిలోనే తన ప్రతిభతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ప్రశంసలందుకుంటోంది. అయితే నిరుపేద కుటుంభంలో పుట్టిన ఆ బాలిక ప్రతిభను పేదరికం అడ్డుకుంటోంది. ఎవరైనా ప్రోత్సహిస్తే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించి పతకాలు తెస్తానంటున్న చిన్నారి శ్రీవెన్నెల వివరాలు చదవండి. మేదరమెట్ల: క్రీడల్లో వెలుగులు నింపుతున్న శ్రీవెన్నెల ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలంలోని తిమ్మనపాలెం గ్రామానికి చెందిన కోటా దేవదాసు, సుజాతల కుమార్తె. ఈ బాలిక గ్రామంలోని ఆరివారి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈఏడాది తొమ్మిదో తరగతి చదువుతోంది. క్రీడల పట్ల వెన్నెల కున్న ఆసక్తి గమనించిన వ్యాయామ ఉపాధ్యాయురాలు ప్రతిమ ఆ బాలికకు, డిస్కస్‌త్రో. షాట్‌పుట్‌లలో తర్ఫీదునిచ్చారు. ఆ రెండు ఈవెంట్స్‌లో విద్యార్థిని ఇప్పటికే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సా«ధించి, జాతీయ స్థాయికి ఎంపికై అందరి మన్ననలను అందుకుంటోంది. ఆశయానికి అడ్డోస్తున్న పేదరికం.. శ్రీ వెన్నెల తండ్రి బేల్దారీ పనులు చేస్తుంటాడు. పేద కుటుంబం కావడంతో తమ కుమార్తెను గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో చదివిస్తున్నారు. తన బిడ్డ డిస్కస్‌త్రో, షాట్‌పుట్ ఈవెంట్లలో జాతీయ స్థాయికి ఎంపికైందని తెలుసుకుని బాలిక తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. ఆమెకు మరింత ప్రోత్సాహం ఇవ్వడానికి, తమ పేదరికం అడ్డొస్తుందని, ఎవరైనా దాతలు ప్రోత్సహిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడి పతకాలను అందిస్తానని చెబుతోందంటున్నారు కన్నవారు. శ్రీవెన్నెల సాధించిన విజయాలు.. ♦ 2016–17 సంవత్సరం పొదిలిలో నిర్వహించిన డిస్కస్ త్రో షాట్çపుట్ పోటీల్లో మొదటి స్థానం సాధించింది. ♦ 2017–18లో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో రెండు ఈవెంట్స్‌లో మొదటి స్థానం సాధించింది. విద్యార్థిని ప్రతిభను గమనించిన స్టేట్ సెలక్షన్ కమిటీ బాలికను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసింది. ♦ పలాసాలో నిర్వహించిన రాష్ట్ర పోటీల్లో పాల్గొని డిస్కస్ త్రోలో మొదటి స్థానం, షాట్పట్లో మూడో స్థానం సాధించింది. జాతీయ స్థాయికి ఎంపిక.. ♦ ఈనెల 18న మహారాష్ట్రలో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ప్రోత్సహిస్తే దేశానికి పతకాలు తెస్తా.. క్రీడల్లో మరింత రాణించి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని దేశానికి పతకాలను అందించాలని ఉంది. క్రీడలతో పాటు ఉన్నత చదువులు చదుకొని పోలీసు అధికారి కావాలని ఆసక్తిగా ఉంది. పెద్ద కోచ్‌ల వద్ద కోచింగ్ ఇప్పించే స్తోమత నా తల్లిదండ్రులకు లేదు. ఎవరైనా ప్రోత్సాహం ఇస్తే మంచి స్థాయిలో నిలిచేందుకు కృషి చేస్తా. – కోటీ శ్రీ వెన్నెల -
సీమా పూనియా అవుట్
రియో డీ జనీరో:రియో ఒలింపిక్స్ లో భారత డిస్కస్క త్రో క్రీడాకారిణి సీమా పూనియా నిరాశపరిచింది. గ్రూప్-బిలో జరిగిన డిస్కస్ త్రో క్వాలిఫయింగ్ రౌండ్లో పూనియా ఫైనల్ కు అర్హత సాధించడంలో వైఫల్యం చెందింది. తొలి ప్రయత్నంలో 57.58 మీటర్లు డిస్క్ విసిరిన సీమా.. ఆ తరువాత ప్రయత్నాలో ఘోరంగా విఫలమై 20వ స్థానానికి పరిమితమైంది. డిస్కస్ త్రో పాల్గొనే వారిని రెండు గ్రూపులుగా విభజించారు. ఒకో గ్రూపులో 17 మంది క్రీడాకారిణులు పాల్గొనగా, ఫైనల్‌కు మాత్రం రెండు గ్రూపుల్లో కలిపి 12 మంది మాత్రమే అర్హత సాధిస్తారు. దీంతో డిస్కస్ త్రో ఈవెంట్లో ఫైనల్ కు చేరాలన్న సీమా ఆశలు తీరలేదు. కాగా, క్యూబీ క్రీడాకారిణి యెమీ పెరెజ్ 65. 38 మీటర్లు డిస్క్ విసిరి అగ్రస్థానంలో నిలిచింది. -
తొమ్మిదితో సరి
భారత 'ఆశాకిరణం' వికాస్ గౌడ వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో డిస్కస్ త్రో లో నిరాశ పరిచాడు. ఫైనల్ కు చేరి పతకం పై ఆశలు రేపిన వికాస్ తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. శనివారం సాయంత్రం జరిగిన ఫైనల్లో ఇనప గుండును కేవలం 62.24 మీటర్లు విసిరి పాయింట్ల పట్టికలో కింది స్థానానికి పరిమితం అయ్యాడు. వికాస్ సీజనల్ బెస్ట్ 65.75మీటర్లు కూడా చేరుకోలేక పోయాడు. వికాస్ గౌడ్ ఇప్పటికి 5 సార్లు ప్రంపచ ఛాంపియన్ షిప్ కు క్వాలిఫై కాగా.. మూడు మార్లు ఫైనల్ రౌండ్ వరకూ వెళ్లాడు. మరో వైపు శనివారం ఉదయం మహిళల 4X400 రిలేలో మన రన్నర్లు హీట్స్ స్థాయిలోనే వెనుదిరిగారు. చివరి రోజు బాబర్, ఒపి జైషా, సుధాసింగ్ చివరి రోజు ఆదివారం మారథాన్ లో పోటీ పడనున్నారు. -
డిస్కస్ త్రోలో వికాస్ గౌడకు రజతం
ఇంచియాన్:ఆసియా క్రీడల్లో భారత అథ్లెటిక్స్ మెరుస్తున్నారు. మంగళవారం జరిగిన పురుషుల డిస్కస్ త్రో విభాగంలో వికాస్ గౌడ్ రజత పతకాన్ని చేజిక్కించుకున్నాడు. ఇంచియాన్ జరుగుతున్న ఆసియన్ గేమ్స్ డిస్కస్ త్రో ఈవెంట్ లో 62.58 మీటర్లు విసిరిన వికాస్ రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉండగా ఇరాన్ కు చెందిన ఈషాన్ హదాది 65. 11 మీటర్లు విసిరి స్వర్ణ పతకాన్ని దక్కించుకోగా, ఖతార్ కు చెందిన మహ్మద్ అహ్మద్ కాంస్య పతకం లభించింది. మహ్మద్ 61.25 మీటర్లు విసిరి మూడో స్థానంలో నిలిచాడు. అంతకుముందు మహిళల విభాగంలో భారత్ కు చెందిన సీమా పూనియా స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే.