Kirpal Singh Batth Breaks 22 Year Old Discus Throw Meet Record - Sakshi
Sakshi News home page

Kripal Singh: 22 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన పంజాబ్‌ అథ్లెట్‌

Published Wed, Apr 6 2022 6:18 PM | Last Updated on Wed, Apr 6 2022 6:42 PM

Federation Cup: Kripal Singh Breaks 22 Year Old Discus Throw Meet Record - Sakshi

AFI National Federation Senior Athletics Championship 2022: కేరళలోని కాలికట్‌లో జరిగిన 25వ నేషనల్ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ మీట్‌లో పంజాబ్‌ డిస్కస్ త్రోయర్‌ కృపాల్ సింగ్ అద్భుతం చేశాడు. మంగళవారం జరిగిన పోటీల్లో డిస్క్‌ను 61.83 మీటర్ల దూరం విసిరి 22 క్రితం ఈ ఈవెంట్‌లో అనిల్‌ కుమార్‌ నెలకొల్పిన 59.55 మీటర్ల రికార్డును బద్దలు కొట్టాడు. 


ఈ ఈవెంట్‌లో ఆది నుంచి నిలకడగా రాణించిన కృపాల్.. ఆరేళ్ల క్రితం తాను సాధించిన రికార్డ్‌ను (59.74 మీ) సైతం అధిగమించాడు. కృపాల్‌ నాలుగు ప్రయత్నాలలో డిస్క్‌ను 60మీకి పైగా దూరం విసిరాడు. ఇందులో రెండు సార్లు 61 మీటర్ల మార్కును అందుకోగా, అతని అత్యుత్తమ ప్రదర్శన 61.83 మీటర్లుగా నిలిచింది. కృపాల్‌ తన ప్రయత్నాల్లో 62 మార్కును దాటి ఉంటే, ఆ ఘనత సాధించిన మూడో భారత అథ్లెట్‌గా రికార్డుల్లోకెక్కేవాడు. 
చదవండి: భారత క్రికెటర్లకు శుభవార్త.. బయో బబుల్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement