పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం వచ్చింది. పురుషుల డిస్కస్ త్రో ఎఫ్ 56 కేటగిరీలో యోగేశ్ కథూనియా రజత పతకం గెలుచుకున్నాడు. కథూనియా తన తొలి ప్రయత్నంలోనే డిస్క్‌స్‌ను 42.22 మీటర్ల దూరం విసిరాడు. ఈ సీజన్‌లో అతనికి ఇది అత్యుత్తమ ప్రదర్శన. కథూనియాకు పారాలింపిక్స్‌లో ఇది వరుసగా రెండో రజత పతకం. గత (టోక్యో) పారాలింపిక్స్‌లోనూ కథూనియా రజతం సాధించాడు.
ప్రస్తుత పారాలింపిక్స్ ఎఫ్ 56 కేటగిరీలో యోగేశ్ కథూనియా రజత పతకం సాధించగా.. బ్రెజిల్‌కు చెందిన క్లౌడిని బటిస్ట డోస్ శాంటోస్ స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. పారాలింపిక్స్‌లో బటిస్టకు ఇది వరుసగా మూడో స్వర్ణం. నేటి ఈవెంట్‌లో బటిస్ట్ తన ఐదో ప్రయత్నంలో డిస్కస్‌ను 46.86 మీట్లర దూరం విసిరాడు. ఇది పారాలింపిక్స్ రికార్డు.
ఈ కేటగిరీలో గ్రీస్‌కు చెందిన కాన్‌స్టాంటినోస్ జోయునిస్ 41.32 మీటర్ల దూరం డిస్కస్‌ను విసిరి కాంస్యం సొంతం చేసుకున్నాడు. యోగేశ్ కథూనియా సాధించిన రజతంతో ప్రస్తుత పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య ఎనిమిదికి (ఒక స్వర్ణం, 3 రజతాలు, 4 కాంస్యాలు) చేరింది.
Comments
Please login to add a commentAdd a comment