
టోక్యో: టోక్యో వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట పండుతోంది. తాజాగా భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. జావిలన్‌త్రో లో దేవేంద్ర ఝజారియా రజతం పతకం సాధించగా, సుందర్ సింగ్ కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. దీంతో సోమవారం ఒక్కరోజే భారత్ ఖాతాలో నాలుగు పతకాలు చేరాయి. అంతకు ముందు పారా ఒలింపిక్స్ భారత్‌కు తొలి స్వర్ణ పతకం లభించింది.
మహిళల షూటింగ్ 10 మీటర్ల విభాగంలో విజయం సాధించి అవని లేఖారా గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. డిస్కస్ త్రోలో ఎఫ్-56 విభాగంలో యోగేశ్ కధూనియా రజత పతకం సాధించాడు.
ఇప్పటి వరకు పతకాలు సాధించింది వీరే
1. అవని లేఖారా- గోల్డ్ మెడల్ (షూటింగ్)
2. యోగేశ్ కధూనియా- సిల్వర్ మెడల్(డిస్కస్ త్రో)
3. నిశాద్ కుమార్- సిల్వర్ మెడల్(హైజంప్)
4.భవీనాబెన్ పటేల్- సిల్వర్ మెడల్(టేబుల్ టెన్నిస్)
5. దేవేంద్ర ఝజారియా- సిల్వర్ మెడల్(జావిలన్‌త్రో)
6. సుందర్ సింగ్- కాంస్య పతకం(జావిలన్‌త్రో)
చదవండి: Tokyo Paralympics 2021:పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం