Discus thrower
-
పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం
పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం వచ్చింది. పురుషుల డిస్కస్ త్రో ఎఫ్ 56 కేటగిరీలో యోగేశ్ కథూనియా రజత పతకం గెలుచుకున్నాడు. కథూనియా తన తొలి ప్రయత్నంలోనే డిస్క్స్ను 42.22 మీటర్ల దూరం విసిరాడు. ఈ సీజన్లో అతనికి ఇది అత్యుత్తమ ప్రదర్శన. కథూనియాకు పారాలింపిక్స్‌లో ఇది వరుసగా రెండో రజత పతకం. గత (టోక్యో) పారాలింపిక్స్‌లోనూ కథూనియా రజతం సాధించాడు. ప్రస్తుత పారాలింపిక్స్ ఎఫ్ 56 కేటగిరీలో యోగేశ్ కథూనియా రజత పతకం సాధించగా.. బ్రెజిల్‌కు చెందిన క్లౌడిని బటిస్ట డోస్ శాంటోస్ స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. పారాలింపిక్స్‌లో బటిస్టకు ఇది వరుసగా మూడో స్వర్ణం. నేటి ఈవెంట్లో బటిస్ట్ తన ఐదో ప్రయత్నంలో డిస్కస్‌ను 46.86 మీట్లర దూరం విసిరాడు. ఇది పారాలింపిక్స్ రికార్డు. ఈ కేటగిరీలో గ్రీస్‌కు చెందిన కాన్స్టాంటినోస్ జోయునిస్ 41.32 మీటర్ల దూరం డిస్కస్‌ను విసిరి కాంస్యం సొంతం చేసుకున్నాడు. యోగేశ్ కథూనియా సాధించిన రజతంతో ప్రస్తుత పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య ఎనిమిదికి (ఒక స్వర్ణం, 3 రజతాలు, 4 కాంస్యాలు) చేరింది. -
డిస్కస్ త్రోయర్ కమల్‌ప్రీత్‌పై మూడేళ్ల నిషేధం
న్యూఢిల్లీ: భారత మహిళా డిస్కస్ త్రోయర్ కమల్‌ప్రీత్ కౌర్‌పై ప్రపంచ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) మూడేళ్ల నిషేధం విధించింది. ఆమె నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో ఇదివరకే తాత్కాలిక సస్పెన్షన్ వేటు పడింది. తాజాగా డబ్ల్యూఏకి చెందిన అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) తుది విచారణ అనంతరం శిక్ష ఖరారు చేసింది. ఆమెకు నాలుగేళ్ల నిషేధం విధించాల్సి ఉండగా, నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు విచారణలో అంగీకరించడంతో ఏడాది మినహాయించారు. మార్చిలో ఏఐయూ కమల్‌ప్రీత్ రక్తమూత్ర నమూనాలు సేకరించి పరీక్షించగా ‘పాజిటివ్’ అని తేలడంతో అదే నెల 29న సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో ఆమె భారత ప్రభుత్వ పురస్కారాలు, ప్రోత్సాహకాలకు దూరం కానుంది. గతేడాది టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో ఆమె ఆరో స్థానంలో నిలిచింది. -
డోపింగ్‌లో దొరికిన భారత డిస్కస్ త్రోయర్ నవ్‌జీత్ కౌర్
ఇటీవల బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో పోటీపడ్డ భారత మహిళా డిస్కస్ త్రోయర్ నవ్‌జీత్ కౌర్ ధిల్లాన్ డోపింగ్ పరీక్షలో విఫలమైంది. గత నెలలో ప్రపంచ చాంపియన్‌షిప్ కంటే ముందు ఆమె నుంచి సేకరించిన శాంపిల్స్‌లో నిషేధిత ఉత్ప్రేరకాల ఆనవాళ్లు ఉన్నాయని అథ్లెటిక్స్ ఇంటెగ్రిటీ యూనిట్ (ఏఐయూ) శనివారం ప్రకటించింది. పంజాబ్‌కు చెందిన 27 ఏళ్ల నవ్‌జీత్ 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం నెగ్గింది. బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో మాత్రం ఆమె ఎనిమిదో స్థానంలో నిలిచింది. గత జూన్‌లో చెన్నైలో జరిగిన ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్‌లో, కజకిస్తాన్‌లో జరిగిన కొసనోవ్ స్మారక మీట్లో నవ్‌జీత్ స్వర్ణ పతకాలు సాధించింది. నవ్‌జీత్‌పై నాలుగేళ్ల నిషేధం విధించే అవకాశముంది. -
22 ఏళ్ల చరిత్రను తిరగరాసిన పంజాబ్ అథ్లెట్
AFI National Federation Senior Athletics Championship 2022: కేరళలోని కాలికట్లో జరిగిన 25వ నేషనల్ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ మీట్లో పంజాబ్ డిస్కస్ త్రోయర్ కృపాల్ సింగ్ అద్భుతం చేశాడు. మంగళవారం జరిగిన పోటీల్లో డిస్క్‌ను 61.83 మీటర్ల దూరం విసిరి 22 క్రితం ఈ ఈవెంట్లో అనిల్ కుమార్ నెలకొల్పిన 59.55 మీటర్ల రికార్డును బద్దలు కొట్టాడు. Kirpal Singh of Punjab broke the 22 years old meet record in Discus Throw event in 25th National Federation Cup Sr Athletics Competition at Calicut (Kerala). He hurdled the discus to a distance of 61.83m in his fourth attempt. Old record was in the name of Anil Kumar (59.55m). — Athletics Federation of India (@afiindia) April 5, 2022 ఈ ఈవెంట్లో ఆది నుంచి నిలకడగా రాణించిన కృపాల్.. ఆరేళ్ల క్రితం తాను సాధించిన రికార్డ్‌ను (59.74 మీ) సైతం అధిగమించాడు. కృపాల్ నాలుగు ప్రయత్నాలలో డిస్క్‌ను 60మీకి పైగా దూరం విసిరాడు. ఇందులో రెండు సార్లు 61 మీటర్ల మార్కును అందుకోగా, అతని అత్యుత్తమ ప్రదర్శన 61.83 మీటర్లుగా నిలిచింది. కృపాల్ తన ప్రయత్నాల్లో 62 మార్కును దాటి ఉంటే, ఆ ఘనత సాధించిన మూడో భారత అథ్లెట్‌గా రికార్డుల్లోకెక్కేవాడు. చదవండి: భారత క్రికెటర్లకు శుభవార్త.. బయో బబుల్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం..! -
ఫైనల్స్ కు చేరిన వికాస్ గౌడ
బీజింగ్ : భారత 'ఆశాకిరణం' వికాస్ గౌడ వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో డిస్కస్ త్రో ఫైనల్స్‌కు చేరుకున్నాడు. గురవారం ఇక్కడ జరిగిన 61.61 మీటర్ల దూరానికి డిస్కన్ను విసిరి ఫైనల్స్‌కు బెర్త్ ఖరారు చేసుకున్నాడు. ఫైనల్స్ శనివారం సాయంత్రం జరగనున్నాయి. -
ఈసారి ఖేల్ రత్న లేనట్లే!
► ఏడుగురి పేర్లూ తిరస్కరణ ► ఏ అథ్లెట్‌నూ సిఫారసు చేయని సెలక్షన్ కమిటీ ► ‘అర్జున’కు 15 మంది సిఫారసు న్యూఢిల్లీ: దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ గాంధీ ఖేల్ రత్న’కు ఈ ఏడాది ఏ అథ్లెట్ పేరును ప్రతిపాదించొద్దని సెలక్షన్ కమిటీ నిర్ణయించింది. 1991లో స్థాపించిన ‘ఖేల్ రత్న’ పురస్కారం చరిత్రలో ఏ క్రీడాకారుడి పేరును సిఫారసు చేయకపోవడం ఇది మూడోసారి. ఈ అవార్డు కోసం ఎంపిక చేసిన తుది జాబితాలో వికాస్ గౌడ, కృష్ణ పూనియా (డిస్కస్ త్రోయర్లు), సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ (టెన్నిస్), జీవ్ మిల్కా సింగ్ (గోల్ఫ్), పి.వి.సింధు (బ్యాడ్మింటన్), దేవేంద్ర జజారియా (జావెలిన్ త్రో) ఉన్నారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ నేతృత్వం వహిస్తున్న ఈ సెలక్షన్ కమిటీ ‘అర్జున’ అవార్డుల కోసం 15 మంది పేర్లను మాత్రం సిఫారసు చేసింది. ఇందులో క్రికెటర్ అశ్విన్, మేటి షూటర్ హీనా సిద్ధూ... అమెరికాలోని విఖ్యాత ఎన్బీఏ సెలక్షన్స్‌లో పాల్గొన్న కేరళ స్టార్ బాస్కెట్‌బాల్ ప్లేయర్ గీతూ అన్నా జోస్... 2012 ప్రపంచకప్ కబడ్డీ విజేత భారత జట్టులో సభ్యురాలైన మమతా పూజారి ఉన్నారు. మహారాష్ట్రకు చెందిన మమత దక్షిణ మధ్య రైల్వేలో పనిచేస్తోంది. ఇండియన్ రైల్వేస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రాకపోతే ఆంధ్రప్రదేశ్ తరఫున బరిలోకి దిగుతుంది. ‘పిస్టల్ షూటర్’ హీనా సిద్ధూ ప్రపంచకప్ ఫైనల్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించడంతోపాటు ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచింది. బీసీసీఐ నుంచి కేవలం క్రికెటర్ అశ్విన్ పేరును సిఫారసు చేయగా అతనికి ‘అర్జున’ ఖాయమైంది. అశ్విన్ మొత్తం 20 టెస్టుల్లో పాల్గొని 104 వికెట్లు తీశాడు. 79 వన్డేల్లో 106 వికెట్లు పడగొట్టాడు. గతేడాది ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో కాంస్యం నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన సింధుకు ఈసారి ‘ఖేల్త్న్ర’ దక్కుతుందని భావించారు. ‘ఖేల్త్న్ర రేసులో ఉన్న ఏడుగురి పేర్లను చర్చించాం. కపిల్ ప్రతిపాదించిన గోల్ఫర్ జీవ్ మిల్కాసింగ్‌పై ఎక్కువ సమయం చర్చ జరిగింది. అయితే జీవ్పై మిగతా సభ్యులు అంతగా ఆసక్తి చూపలేదు’ అని సెలక్షన్ కమిటీ సభ్యుడొకరు తెలిపారు. ‘అర్జున’ కోసం సెలక్షన్ కమిటీ పంపించిన 15 మంది పేర్లను కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ పరిశీలిస్తుంది. వీలైతే కొంతమంది పేర్లను చేర్చడంగానీ, తొలగించడంగానీ జరుగుతుంది. ఇదే జాబితాకు ఆమోదముద్ర పడే అవకాశం కూడా ఉంటుంది. జాతీయ క్రీడాదినోత్సవం ఆగస్టు 29న ఈ అవార్డులు అందజేస్తారు. అర్జున అవార్డుల ప్రతిపాదిత జాబితా: అభిషేక్ వర్మ (ఆర్చరీ), టింటూ లుకా (అథ్లెటిక్స్), హెచ్.ఎన్.గిరీష (పారాలింపిక్స్), వి.దిజు (బ్యాడ్మింటన్), గీతూ అన్నా జోస్ (బాస్కెట్‌బాల్), జై భగవాన్ (బాక్సింగ్), అశ్విన్ (క్రికెట్), అనిర్బన్ లాహిరి (గోల్ఫ్), మమతా పూజారి (కబడ్డీ), సాజీ థామస్ (రోయింగ్), హీనా సిద్ధూ (షూటింగ్), అనక అలంకమోని (స్క్వాష్), టామ్ జోసెఫ్ (వాలీబాల్), రేణుబాల చాను (వెయిట్‌లిఫ్టింగ్), సునీల్ రాణా (రెజ్లింగ్). -
కాంగ్రెస్‌లో చేరిన కృష్ణపూనియా
మహిళా డిస్కస్ త్రోయర్ కృష్ణపూనియా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ విషయాన్ని ఇదివరకే ప్రకటించిన పూనియా.. రాజస్థాన్‌లో బుధవారం జరిగిన ర్యాలీలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో లాంఛనంగా పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తదితరులు పాల్గొన్నారు. రాజస్థాన్‌కు చెందిన పూనియా త్వరలో జరిగే ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయవచ్చని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఆమె విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. 'నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. క్రీడల్లో దేశం కోసం పతకాలు సాధించా. ప్రస్తుతం ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో రాజకీయాల్లోకి వచ్చా' అని పూనియా చెప్పారు. 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం పతకం సాధించారు. ఇతర అంతర్జాతీయ వేదికలపైనా సత్తాచాటారు.