కాంగ్రెస్లో చేరిన కృష్ణపూనియా | Discus thrower Krishna Poonia joins Congress party today | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్లో చేరిన కృష్ణపూనియా

Published Wed, Oct 23 2013 6:52 PM | Last Updated on Fri, Sep 1 2017 11:54 PM

కాంగ్రెస్లో చేరిన కృష్ణపూనియా

కాంగ్రెస్లో చేరిన కృష్ణపూనియా

మహిళా డిస్కస్ త్రోయర్ కృష్ణపూనియా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ విషయాన్ని ఇదివరకే ప్రకటించిన పూనియా.. రాజస్థాన్లో బుధవారం జరిగిన ర్యాలీలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో లాంఛనంగా పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తదితరులు పాల్గొన్నారు.

రాజస్థాన్కు చెందిన పూనియా త్వరలో జరిగే ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయవచ్చని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఆమె విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. 'నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. క్రీడల్లో దేశం కోసం పతకాలు సాధించా. ప్రస్తుతం ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో రాజకీయాల్లోకి వచ్చా' అని పూనియా చెప్పారు. 2010 కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం పతకం సాధించారు. ఇతర అంతర్జాతీయ వేదికలపైనా సత్తాచాటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement