Kripal Singh
-
22 ఏళ్ల చరిత్రను తిరగరాసిన పంజాబ్ అథ్లెట్
AFI National Federation Senior Athletics Championship 2022: కేరళలోని కాలికట్లో జరిగిన 25వ నేషనల్ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ మీట్లో పంజాబ్ డిస్కస్ త్రోయర్ కృపాల్ సింగ్ అద్భుతం చేశాడు. మంగళవారం జరిగిన పోటీల్లో డిస్క్‌ను 61.83 మీటర్ల దూరం విసిరి 22 క్రితం ఈ ఈవెంట్లో అనిల్ కుమార్ నెలకొల్పిన 59.55 మీటర్ల రికార్డును బద్దలు కొట్టాడు. Kirpal Singh of Punjab broke the 22 years old meet record in Discus Throw event in 25th National Federation Cup Sr Athletics Competition at Calicut (Kerala). He hurdled the discus to a distance of 61.83m in his fourth attempt. Old record was in the name of Anil Kumar (59.55m). — Athletics Federation of India (@afiindia) April 5, 2022 ఈ ఈవెంట్లో ఆది నుంచి నిలకడగా రాణించిన కృపాల్.. ఆరేళ్ల క్రితం తాను సాధించిన రికార్డ్‌ను (59.74 మీ) సైతం అధిగమించాడు. కృపాల్ నాలుగు ప్రయత్నాలలో డిస్క్‌ను 60మీకి పైగా దూరం విసిరాడు. ఇందులో రెండు సార్లు 61 మీటర్ల మార్కును అందుకోగా, అతని అత్యుత్తమ ప్రదర్శన 61.83 మీటర్లుగా నిలిచింది. కృపాల్ తన ప్రయత్నాల్లో 62 మార్కును దాటి ఉంటే, ఆ ఘనత సాధించిన మూడో భారత అథ్లెట్‌గా రికార్డుల్లోకెక్కేవాడు. చదవండి: భారత క్రికెటర్లకు శుభవార్త.. బయో బబుల్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం..! -
ఆశారాం కేసులో ప్రధాన సాక్షిపై కాల్పులు
షహజాన్ పుర్(యూపీ): సూరత్ అత్యాచారం కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న క్రిపాల్ సింగ్ పై దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు సాక్షులుగా ఉన్న ఏడుగురి పై దాడి జరిగినట్లయింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సూరత్ అత్యాచారం కేసులో ఆశారాం, ఆయన కుమారుడు సూరత్‌కు చెందిన ఇద్దరు అక్కచెల్లెళ్లని లైంగికంగా వేధించారన్న ఆరోపణలని ఎదుర్కొంటున్నారు. వివరాలు..సర్ధార్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దుండగులు జరిపిన కాల్పుల్లో 35 ఏళ్ల క్రిపాల్ సింగ్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్రిపాల్ శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ద్విచక్రవాహనం పై ఇంటికి వెలుతున్న సమయంలో ఇద్దరు దుండగులు వెంబడించి వెనకవైపు నుంచి కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన క్రిపాల్ సింగ్‌ను వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. క్రిపాల్ సింగ్ ఎల్ఐసీ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. అతనికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. క్రిపాల్ ఆశారాం కేసులో ప్రధాన సాక్షిగా ఉన్నట్టు కుటుంబ సభ్యులు నిర్ధారించారు. బాధితుని నుంచి వాంగ్ములం తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. జోద్‌పుర్‌లోని ఆశారాంకి చెందిన ఆశ్రమంలో 2013లో జరిగిన అత్యాచారం ఘటనలో క్రిపాల్ సింగ్ ముఖ్యమైన సాక్షిగా ఉన్నాడని బాధితురాలి తండ్రి పేర్కొన్నారు. మూడు నెలల కింద క్రిపాల్ వాంగ్మూలాన్ని కోర్టు తీసుకుందని చెప్పారు. తనకు కూడా కేసునుంచి తప్పుకోవాలని దుండగుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని బాధితురాలి తండ్రి అన్నారు.