
టోక్యో: పారాలింపిక్స్ పురషుల డిస్కస్ త్రో(F52) కేటగిరీలో ఆదివారం భారత అథ్లెట్ వినోద్ కుమార్ డిస్క్‌ను 19.91 మీటర్ల దూరం విసిరి కాంస్య పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అయితే, వినోద్ F52 కేటగిరీ పరిధిలోకి రాడని ఫిర్యాదు అందడంతో అతడు గెలిచిన పతకాన్ని నిర్వహకులు హోల్డ్‌లో ఉంచారు. అయితే, ఇవాళ ఫిర్యాదును సమీక్షించిన నిర్వహకులు వినోద్ కుమార్ F52 కేటగిరీ పరిధిలోకి రాడని తేల్చి అతను గెలుచుకున్న కాంస్య పతకాన్ని రద్దు చేశారు.
ఈ విషయాన్ని టోక్యో పారాలింపిక్స్ నిర్వహకులు అధికారికంగా ప్రకటించారు. కండరాల బలహీనత, కదలికల్లో లోపం, అవయవ లోపం ఉన్న వారు మాత్రమే F52 కేటగిరీ పరిధిలోకి వస్తారని, వినోద్ కుమార్ ఈ కేటగిరీ పరిధిలోకి రాడని వారు తేల్చారు. కాగా, ఇదే నిర్వహకులు ఈ నెల 22న వినోద్ కుమార్ F52 కేటగిరీలో పోటీపడవచ్చని అనుమతివ్వడం చర్చనీయాంశంగా మారింది.
చదవండి: Avani Lekhara: భారత 'అవని' పులకించింది..