పింఛన్లు పొందుతున్న వారిలో చాలా మంది అనర్హులున్నారు | Most of the pensioners are ineligible | Sakshi
Sakshi News home page

పింఛన్లు పొందుతున్న వారిలో చాలా మంది అనర్హులున్నారు

Published Fri, Sep 20 2024 4:59 AM | Last Updated on Fri, Sep 20 2024 4:59 AM

Most of the pensioners are ineligible

అనర్హుల గుర్తింపునకు మంత్రుల సబ్‌ కమిటీ

మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ వెల్లడి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చాలా మంది అన­ర్హులు పింఛన్లు పొందుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని, అన­ర్హులను గర్తింపు, వారికి సంబంధించి అన్ని అంశాలను పరిశీలించడానికి మంత్రుల సబ్‌ కమిటీ ఏర్పాటు చేయా­లని సీఎం చంద్రబాబు నిర్ణయించారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ చెప్పారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌)పై గురువారం సీఎం సమీక్షించారు. అనంతరం రాష్ట్ర సచివాల­యంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. అర్హులకే పింఛన్లు ఇస్తామని, అనర్హులు ఎవరైనా ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

ప్రస్తుతం పింఛన్ల మంజూరు ప్రక్రి­యలో లోపాలున్నాయని, వాటిని కూడా మంత్రు­ల సబ్‌ కమిటీ సరిచేస్తుందన్నారు. 50 ఏళ్లకే పింఛన్, పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు, మహిళా శక్తి కార్యక్రమా­లపైనా సమావేశంలో చర్చించా­మని, రాబోయే రోజుల్లో వాటిపై కొంత స్పష్టత వస్తుందని తెలిపారు. పొదుపు సంఘాల మహి­ళలు దాదాపు రూ.80 వేల కోట్లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటుండగా, అందులో రూ. 54 వేల కోట్లను మాత్రమే మహి­ళలు ఉపాధిని పెంచుకోవడానికి పెట్టుబడిగా పెడుతు­న్నారని ప్రభుత్వ పరిశీలనలో తేలిందని చెప్పారు. 

మిగి­లిన వారు తీసుకునే రుణాలను కూడా ఉపాధి మార్గాల్లోనే పెట్టుబడి పెట్టేలా చర్యలు చేపడతామన్నారు. స్త్రీనిధికి సంబంధించి రూ. 950 కోట్ల మేర వేరే బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకొని, ఆ మొత్తాలను ప్రభుత్వ నిధులకు మళ్లించారని, ఈ కారణంగా స్త్రీనిధి కార్యకలాపాల నిర్వ­హ­ణకు ఇబ్బందులొచ్చాయని చెప్పారు. 

పది జిల్లాల్లో పొదుపు సంఘాల మహిళలను  చిన్నతరహా పారిశ్రా­మికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఆ జిల్లాల్లో స్పెషల్‌ పర్పస్‌ వెహికల్స్‌ ఏర్పా­టు చేయాలని సీఎం సూచించినట్టు తెలి­పారు.  పొదుపు సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలకు అమరావతిలో కల్చరల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపినట్టు చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement