ప్రపంచ అథ్లెటిక్స్ మీట్‌కు వికాస్, టింటూ
న్యూఢిల్లీ : ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 17 మంది సభ్యులతో కూడిన భారత బృందంలో గతేడాది కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ... అగ్రశ్రేణి అథ్లెట్ టింటూ లూకా తదితరులు ఉన్నారు. ఈనెల 22 నుంచి 30 వరకు చైనాలోని బీజింగ్‌లో ఈ మెగా ఈవెంట్ జరుగుతుంది. అంతర్జాతీయ అథ్లెటిక్స్ సంఘాల సమాఖ్య (ఐఏఏఎఫ్) నిర్దేశించిన అర్హత ప్రమాణాలను అందుకున్న అథ్లెట్స్‌ను మాత్రమే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ఎంపిక చేసినట్లు భారత అథ్లెటిక్స్ సమాఖ్య తెలిపింది.
భారత అథ్లెటిక్స్ జట్టు : వికాస్ గౌడ (డిస్కస్ త్రో), గుర్మీత్ సింగ్, బల్జీందర్ సింగ్, చందన్ సింగ్ (20 కి.మీ. నడక), ఇందర్జీత్ సింగ్ (షాట్‌పుట్), సందీప్ కుమార్, మనీష్ సింగ్ రావత్ (50 కి.మీ. నడక), టింటూ లూకా (800 మీ., 4ఁ400 మీటర్ల రిలే) లలితా శివాజీ బాబర్ (3000 మీ. స్టీపుల్‌చేజ్, మారథాన్), పూవమ్మ, దేబశ్రీ మజుందార్, అనూ రాఘవన్, జిస్నా మాథ్యూ (4ఁ400 మీటర్ల రిలే), , ఖుష్బీర్ కౌర్, సప్నా (20 కి.మీ. నడక), ఓపీ జైషా, సుధా సింగ్ (మారథాన్).