Tintu Luka
-
రియో ఫైనల్‌కు చేరాలని ఉంది
కోజికోడ్: వచ్చేనెలలో జరగబోయే రియో ఒలింపిక్స్‌కు సిద్ధంగా ఉన్ననని, మెగాటోర్నీ ఫైనల్‌కు చేరాలనుందని స్టార్ అథ్లెట్ టింటూ లూకా పేర్కొంది. తాను పోటీపడుతోన్న 800 మీ విభాగంలో ఫైనల్‌కు చేరుకుంటానని ధీమా వ్యక్తం చేసింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో సెమీస్‌కు చేరిన టింటూ ఈసారి తన ప్రదర్శన మెరుగుపర్చుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. లండన్‌తో పోలిస్తే కొన్ని విభాగాల్లో ఇప్పుడు చాలా మెరుగయ్యానని, ప్రత్యర్థులు చాలా అనుభవజ్ఞులైనా తాను అందుకు సిద్ధంగా ఉన్నానని టింటూ ఆత్మవిశ్వాసంతో పేర్కొంది. -
ప్రపంచ అథ్లెటిక్స్ మీట్‌కు వికాస్, టింటూ
న్యూఢిల్లీ : ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 17 మంది సభ్యులతో కూడిన భారత బృందంలో గతేడాది కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ... అగ్రశ్రేణి అథ్లెట్ టింటూ లూకా తదితరులు ఉన్నారు. ఈనెల 22 నుంచి 30 వరకు చైనాలోని బీజింగ్‌లో ఈ మెగా ఈవెంట్ జరుగుతుంది. అంతర్జాతీయ అథ్లెటిక్స్ సంఘాల సమాఖ్య (ఐఏఏఎఫ్) నిర్దేశించిన అర్హత ప్రమాణాలను అందుకున్న అథ్లెట్స్‌ను మాత్రమే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ఎంపిక చేసినట్లు భారత అథ్లెటిక్స్ సమాఖ్య తెలిపింది. భారత అథ్లెటిక్స్ జట్టు : వికాస్ గౌడ (డిస్కస్ త్రో), గుర్మీత్ సింగ్, బల్జీందర్ సింగ్, చందన్ సింగ్ (20 కి.మీ. నడక), ఇందర్జీత్ సింగ్ (షాట్‌పుట్), సందీప్ కుమార్, మనీష్ సింగ్ రావత్ (50 కి.మీ. నడక), టింటూ లూకా (800 మీ., 4ఁ400 మీటర్ల రిలే) లలితా శివాజీ బాబర్ (3000 మీ. స్టీపుల్‌చేజ్, మారథాన్), పూవమ్మ, దేబశ్రీ మజుందార్, అనూ రాఘవన్, జిస్నా మాథ్యూ (4ఁ400 మీటర్ల రిలే), , ఖుష్బీర్ కౌర్, సప్నా (20 కి.మీ. నడక), ఓపీ జైషా, సుధా సింగ్ (మారథాన్). -
టింటూ లుకాకు రజతం
ఇంచియాన్: ఆసియా క్రీడల్లో భారత్ కు మరో వెండి పతకం దక్కింది. మహిళల 800 మీటర్ల రేసులో భారత్ క్రీడాకారిణి టింటూ లుకా రజత పతకం సాధించింది. 1:59.19 సెకనల్లో గమ్యాన్ని చేరి ఆమె సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. గ్వాంగ్జూలో జరిగిన గత ఆసియా క్రీడల్లో టింటూ కాంస్య పతకం గెలిచింది. మరో భారత క్రీడాకారిణి సుష్మాదేవి నాలుగో స్థానంలో నిలిచింది. ఆమె 2:01.92 సెకన్లలో లక్ష్యాన్ని చేరింది. కజఖ్‌స్థాన్ కు చెందిన మార్గారిటా స్వర్ణం, చైనాకు చెందిన జింగ్ కాంస్యం దక్కించుకున్నారు.