36వ జాతీయ క్రీడల్లో గుజరాత్‌కు చెందిన 10 ఏళ్ల బాలుడు శౌర్యజిత్ ఖైరే చరిత్ర సృష్టించాడు. మల్లఖంబ్ అనే క్రీడాంశంలో శౌర్యజిత్ కాంస్య పతకం సాధించి.. జాతీయ క్రీడల్లో పతకం గెలిచిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రీడాంశంలో విశేష ప్రతిభ కనబర్చిన శౌర్యజిత్.. అందరినీ మంత్రముగ్దుల్ని చేశాడు. శౌర్యజిత్ విన్యాసాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. చిన్నారి విన్యాసాలు చూసి నోరెళ్లబెట్టిన నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, గుజరాతీ సంప్రదాయ క్రీడ అయిన మల్లఖంబ్‌కు ఇటీవలే జాతీయ క్రీడల్లో స్థానం కల్పించిన విషయం తెలిసిందే.
10-year-old Shauryajit Khaire from Gujarat wins Bronze Medal 🥉 in Mallakhamb(Individual Pole); Becomes the youngest Medalist at the #36thNationalGames
— All India Radio News (@airnewsalerts) October 10, 2022
#Mallakhamb #NationalGames2022 #Shauryajit @Media_SAI @ianuragthakur pic.twitter.com/Oa1OUHeRAj
Comments
Please login to add a commentAdd a comment