National Games 2022
-
RK Roja: బాక్సింగ్ రింగులో మంత్రి రోజా పవర్ఫుల్ పంచ్‌లు
విశాఖ స్పోర్ట్స్ : గెలుపోటములు సహజం.. జాతీయ స్థాయి పోటీకి ఎదగడం గెలుపుతో సమానమని రాష్ట్ర పర్యాటక క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. ఆలిండియా ఆహ్వాన సీఎం కప్ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీలను సాగరతీరంలోని ఫ్లడ్‌లైట్ వెలుతురుతో ఆదివారం రాత్రి ఆమె ప్రారంభించారు. ఏ రంగంలోనైనా విజేతగా నిలవాలంటే పట్టుదల ఉండాలన్నారు. బాక్సింగ్ క్రీడలో రాణించి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు. విశాఖ ప్రత్యేక రైల్వే జోన్‌కోసం మంత్రి అమర్నాథ్తో కలిసి ఈ ప్రాంగణం నుంచే ఉద్యమించామని, రాజధానికి కోసం విశాఖ గర్జనలో పాల్గొన్నానని రోజా గుర్తు చేశారు. అంతేకాకుండా తన సినీ కెరీర్ ప్రారంభం నుంచి విశాఖ ప్రజలతో అనుబంధం ఉందన్నారు. విశాఖ వాసుల కష్టసుఖాల్లో తాను తోడుంటానని స్పష్టం చేశారు. క్రీడాకారులు, కళాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోదన్నారు. కాసేపు బాక్సింగ్ గ్లోవ్స్ ధరించి అతిథులతోనూ పంచ్‌లు విసురుతూ క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. జీసీసీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి మాట్లాడుతూ జాతీయస్థాయి పోటీలకు విశాఖ వేదిక కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ క్రీడల్లో రాణించిన వారికి గ్రూప్‌వన్ అధికారుల్ని చేయడం సీఎం జగన్ మోహన్‌రెడ్డికి క్రీడాకారులపై ఉన్న గౌరవానికి నిదర్శనమన్నారు. టోర్నీ నిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్రమారిటైమ్ బోర్డ్ చైర్మన్ కాయల వెంకటరెడ్డి మాట్లాడుతూ గతేడాది ఇదే వేదికపై రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు నిర్వహించామని ఇప్పుడు జాతీయ ఆహ్వాన పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఆంధ్ర ఆటగాడు బోయ అర్జున్, తెలంగాణ కు చెందిన భరణిప్రసాద్ మధ్య తొలి బౌట్‌ను అతిథులు ప్రారంభించడంతో చాంపియన్‌షిప్ ప్రారంభమైంది. కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ రవిబాబు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు, టోర్ని నిర్వాహక ప్రతినిధి కాయల సూర్యారెడ్డి పాల్గొన్నారు. ఈ చాంపియన్‌షిప్‌లో 14 రాష్ట్రాలకు చెందిన బాక్సర్లు సబ్‌జూనియర్, జూనియర్, యూత్, ఎలైట్ గ్రూప్‌ల్లో పోటీపడనున్నారు. -
ప్రాథమిక స్థాయిలో శిక్షణేదీ?
ఇటీవల 36వ జాతీయ క్రీడలను ప్రారంభిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ... గత పాలకుల వైఫల్యం, క్రీడల్లో బంధుప్రీతి, అవినీతి, తీవ్రమైన మౌలిక వసతుల కొరత వంటి కారణాలవల్ల ప్రపంచ క్రీడా వేదికలపై మనం వెనుకపడ్డామని అన్నారు. విద్యావిధానంలో భాగంగా క్రీడా విధానాన్ని చూసినప్పుడే క్రీడలు కాలానుగుణంగా అభివృద్ధి చెందుతాయి. మన ప్రభుత్వాలు ఆ విషయాన్ని మరచాయి. 1968లో ఇందిరాగాంధీ, 1986లో రాజీవ్ గాంధీ, 1992లో పీవీ నరసింహారావు ప్రభుత్వాలు జాతీయ విద్యా విధానంలో మార్పులు చేసినప్పటికీ క్రీడలకు సముచిత స్థానం కల్పించలేకపోయాయి. కానీ మోదీ ప్రభుత్వ ఆధ్వర్యంలో వచ్చిన నూతన విద్యా విధానం – 2020లో వ్యాయామ విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. మోదీ ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ‘గ్రాస్ రూట్ టాలెంట్ హంట్’ అనే నినాదంతో ‘ఖేలో ఇండియా’ గేమ్స్‌ను తీసుకురావడం కొంతవరకు మంచి సత్ఫలితాలు ఇస్తున్నప్పటికీ ఇంకా అనేక అంశాలలో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర జనాభా కన్నా చాలా తక్కువ ఉన్న దేశాలు కూడా ఒలింపిక్స్‌లో మొదటి పది దేశాల జాబితాలో ఉంటున్నాయి. ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెటిక్స్ ఈవెంట్స్, ఈత కొలనులో జరిగే పోటీల్లో అత్యంత వెనుకబడిన దేశాలూ ఎన్నో పతకాలను కొల్లగొడు తున్నాయి. కాబట్టి మనం కూడా వీటిపై ప్రత్యేక శ్రద్ధపెడితే మంచి ఫలితాలు వస్తాయి. విద్యాహక్కు చట్టం–2009 ప్రతి పాఠశాలలో క్రీడాస్థలం, క్రీడలకు కావాల్సిన సౌకర్యాలు ఉండాలని ప్రతిపాదించింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పట్టించు కున్నట్టు కనిపించదు. చదువు కన్నా ఆటలను ఇష్టపడే వయసులో ఉన్న పిల్లలు ప్రాథమిక పాఠశాలల్లో ఉంటారు. ఆ వయసులోనే పిల్లల్లో నిబిడీకృతమై ఉన్న క్రీడా నైపుణ్యాలు బయటపడతాయి. కానీ దురదృష్టవశాత్తూ మన దేశంలో ప్రాథమిక పాఠశాల స్థాయిలో వ్యాయామ ఉపాధ్యాయులు కనిపించరు. క్రీడల్లో అగ్రదేశాలకు సవాల్ విసురుతున్న చైనా... అతిచిన్న వయసులోనే పిల్లలో ఉన్న క్రీడా సామర్థ్యాన్ని గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్న విష యాన్ని ఇక్కడ గమనంలో ఉంచుకోవాలి. అందుకే ముందుగా ప్రాథమిక పాఠశా లల్లోనూ వ్యాయామ ఉపాధ్యాయులను నియ మించాలి. పాఠశాలలూ, కళాశాలల్లోనే కాక... గ్రామ, మండల, జిల్లా స్థాయుల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి శిక్షకులనూ అందుబాటులో ఉంచాలి. అప్పుడే మన దేశంలో ఎంతో మంది పీవీ సింధులు, నికత్ జరీన్‌లు, నీరజ్ చోప్రాలు మన మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ప్రపంచ వేదికపై రెపరెపలాడిస్తారు. (క్లిక్ చేయండి: వెల్లివిరుస్తున్న కొత్త క్రీడా సంస్కృతి!) – జంగం పాండు, ఏబీవీపీ ఖేల్ స్టేట్ కన్వీనర్ -
వెల్లివిరుస్తున్న కొత్త క్రీడా సంస్కృతి!
సమగ్రాభివృద్ధిలో క్రీడల పాత్ర ఎంతో ఉందని ఐక్యరాజ్య సమితి ఉద్ఘాటించింది. జాతి నిర్మాణంలో క్రీడలది కీలక పాత్ర అనీ, క్రీడలకూ, అభివృద్ధికీ మధ్య అవినాభావ సంబంధం ఉందనీ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కూడా మనసా, వాచా, కర్మణః నమ్మటం వల్లనే ఇపుడు భారత దేశంలో కొత్త క్రీడా సంస్కృతి వెల్లి విరుస్తోంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రభుత్వాలు కనీసం ఊహించనైనా ఊహించని వినూత్న క్రీడా పథకాలతో దేశంలో క్రీడారంగ స్వరూప స్వభావాలు పూర్తిగా మారి పోయాయి. సెప్టెంబర్ 29న అహ్మదాబాద్‌లో 36వ జాతీయ క్రీడలను ప్రారంభిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగం – దేశంలో అపూర్వ స్ధాయిలో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయాలన్న ఆయన సంకల్పాన్ని చాటి చెప్పింది. ఈ ఏడాది జాతీయ క్రీడా పోటీల్లో భారత సాయుధ దళాలకు చెందిన క్రీడాకారులతో పాటు 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన దాదాపు 7,000 మంది అథ్లెట్లు 36 రకాల క్రీడాంశాల్లో తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శించారు. దేశంలో క్రీడల అభివృద్ధికి ప్రధాని మోదీ ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతర్జాతీయ క్రీడలు జరిగే ప్రతిసారీ ఆయన ఆటగాళ్లను వ్యక్తిగతంగా కలిసి, వెన్నుతట్టి ప్రోత్స హిస్తారు. గతంలో ఏ ప్రధానమంత్రీ క్రీడాకారుల మనసులపై ఇంత ప్రభావం చూపలేదు. గెలిచినప్పుడే కాకుండా... ఓడిపోయినా మోదీ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడడం మన అంతర్జాతీయ క్రీడాకారులను అబ్బురపరుస్తోంది. ప్రధాని స్వయంగా మాట్లాడడం మనో నిబ్బరాన్ని పెంచుతోందని ఒలింపిక్ బ్యాడ్మింటన్ మెడలిస్టు పీవీ సింధూ చెప్పారు. నైపుణ్యానికి బదులు బంధుప్రీతి, అవినీతీ భారత క్రీడా రంగాన్ని పట్టి పీడిస్తూ వెనక్కి లాగాయని క్రీడోత్సవాల ఆరంభం సందర్భంగా మోదీ అన్న మాట నూటికి నూరుపాళ్లూ నిజం. అథ్లెట్ల కోచింగ్, ఆట సామగ్రి, టోర్నమెంట్ల ఖర్చులు, విద్య, పోషకాహారం, పాకెట్ మనీ వంటి అవసరాల్ని చారిత్రాత్మక ‘ఖేలో ఇండియా’ పథకం ద్వారా తీరుస్తుండటంతో – వేలాది మంది క్రీడాకారులు ఎంతో ప్రయోజనం పొందుతున్నారు. క్రీడాకారులు, వారి తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గింది. ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీం’ (టాప్స్) కారణంగా ఒలింపిక్‌లో దేశ విజయావకాశాలు మెరుగు పడుతున్నాయి. స్త్రీ, పురుష హాకీ టీమ్‌లతో పాటు 13 క్రీడాంశాల్లో 104 టాప్స్ కోర్ గ్రూప్ అథ్లెట్లకు ఈ పథకం ద్వారా ప్రోత్సాహం లభిస్తోంది. 2024 పారిస్, 2028 లాస్ ఏంజిలిస్ గేమ్స్ వంటి భారీ క్రీడోత్సవాలకు సన్నద్ధం కావడానికి వీలుగా 12 క్రీడాంశాల్లో మరో 269 టాప్స్ డెవలప్ మెంట్ గ్రూప్ అథ్లెట్లకూ ప్రోత్సాహం అందజేస్తున్నారు. తెలంగాణకు చెందిన పలువురు క్రీడాకారులు ఖేలో ఇండియా, టాప్స్ పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. (క్లిక్ చేయండి: ములాయం ప్రాభవం కొనసాగేనా?) కేంద్ర ప్రభుత్వం వినూత్న పథకాలు తెస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం తనవంతు తోడ్పాటు అందజేయకపోవడంతో క్రీడాకారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ జాతీయ క్రీడల్లో తెలంగాణ పెద్దగా ప్రభావం చూపకపోవడానికి కేసీఆర్ ప్రభుత్వం క్రీడల పట్ల చూపిన నిర్లక్ష్యమే ప్రధాన కారణం. కనీసం క్రీడా రంగంలోనైనా మోదీ నుంచి కేసీఆర్ స్ఫూర్తి పొందాలి. (క్లిక్ చేయండి: ‘పార్టీ’టైమ్... కాసింత కామెడీగా!) - కిశోర్ పోరెడ్డి బీజేపీ తెలంగాణ శాఖ అధికార ప్రతినిధి -
National Games 2022: సర్వీసెస్‌కు అగ్రస్థానం
అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో మళ్లీ సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ) జట్టే సత్తా చాటుకుంది. ‘సెంచరీ’ని మించిన పతకాలతో ‘టాప్’ లేపింది. సర్వీసెస్ క్రీడాకారులు మొత్తం 128 పతకాలతో అగ్రస్థానంలో నిలిచారు. ఇందులో 61 స్వర్ణాలు, 35 రజతాలు, 32 కాంస్యాలున్నాయి. అట్టహాసంగా ఆరంభమైన 36వ జాతీయ క్రీడలకు బుధవారం తెరపడింది. 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 8000 పైచిలుకు అథ్లెట్లు ఈ పోటీల్లో సందడి చేశారు. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో 38, అక్వాటిక్స్లో 36 జాతీయ క్రీడల రికార్డులు నమోదయ్యాయి. ఆఖరి రోజు వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు పాల్గొన్నారు. తదుపరి జాతీయ క్రీడలకు వచ్చే ఏడాది గోవా ఆతిథ్యమిస్తుంది. ► వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఈ జాతీయ క్రీడలు గోవాలో జరగాలి. కానీ అనూహ్యంగా గుజరాత్‌కు కేటాయించగా... నిర్వాహకులు వంద రోజుల్లోపే వేదికల్ని సిద్ధం చేయడం విశేషం. పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ఇండోర్ స్టేడియంలో ముగింపు వేడుకలు జరిగాయి. ► పురుషుల విభాగంలో ఎనిమిది పతకాలు సాధించిన కేరళ స్విమ్మర్ సజన్ ప్రకాశ్ (5 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యం) ‘ఉత్తమ క్రీడాకారుడు’గా... మహిళల విభాగంలో ఏడు పతకాలు సాధించిన కర్ణాటకకు చెందిన 14 ఏళ్ల స్విమ్మర్ హషిక (6 స్వర్ణాలు, 1 కాంస్యం) ‘ఉత్తమ క్రీడాకారిణి’గా పురస్కారాలు గెల్చుకున్నారు. గత జాతీయ క్రీడల్లోనూ (2015లో కేరళ) సజన్ ప్రకాశ్ ‘ఉత్తమ క్రీడాకారుడు’ అవార్డు అందుకోవడం విశేషం. ► చివరిరోజు తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ ‘పసిడి పంచ్’తో అలరించాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన హుసాముద్దీన్ సర్వీసెస్ తరఫున ఈ క్రీడల్లో పాల్గొన్నాడు. 57 కేజీల ఫైనల్లో హుసాముద్దీన్ 3–1తో సచిన్ సివాచ్ (హరియాణా)పై గెలిచాడు. ► ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఓవరాల్ చాంప్ సర్వీసెస్‌కు ‘రాజా భళీంద్ర సింగ్’ ట్రోఫీని అందజేశారు. సర్వీసెస్ నాలుగోసారి ఈ ట్రోఫీ చేజిక్కించుకుంది. 39 స్వర్ణాలు, 38 రజతాలు, 63 కాంస్యాలతో కలిపి మొత్తం 140 పతకాలు సాధించి రెండో స్థానంలో నిలిచిన మహారాష్ట్రకు ‘బెస్ట్ స్టేట్’ ట్రోఫీ లభించింది. ఓవరాల్‌గా సర్వీసెస్‌కంటే మహా రాష్ట్ర ఎక్కువ పతకాలు సాధించినా స్వర్ణాల సంఖ్య ఆధారంగా సర్వీసెస్‌కు టాప్ ర్యాంక్ దక్కింది. ► తెలంగాణ 8 స్వర్ణాలు, 7 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి మొత్తం 23 పతకాలతో 15వ స్థానంలో... ఆంధ్రప్రదేశ్ 2 స్వర్ణాలు, 9 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 16 పతకాలతో 21వ స్థానంలో నిలిచాయి. 2015 కేరళ జాతీయ క్రీడల్లో తెలంగాణ 8 స్వర్ణాలు, 14 రజతాలు, 11 కాంస్యాలతో కలిపి మొత్తం 33 పతకాలతో 12వ స్థానంలో... ఆంధ్రప్రదేశ్ 6 స్వర్ణా లు, 3 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి మొత్తం 16 పతకాలతో 18వ స్థానంలో నిలిచాయి. హషికకు ట్రోఫీ ప్రదానం చేస్తున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా -
చరిత్ర సృష్టించిన చిన్నారి అథ్లెట్.. విన్యాసాలు చూసి నోరెళ్లబెట్టిన నెటిజన్లు
36వ జాతీయ క్రీడల్లో గుజరాత్‌కు చెందిన 10 ఏళ్ల బాలుడు శౌర్యజిత్ ఖైరే చరిత్ర సృష్టించాడు. మల్లఖంబ్ అనే క్రీడాంశంలో శౌర్యజిత్ కాంస్య పతకం సాధించి.. జాతీయ క్రీడల్లో పతకం గెలిచిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రీడాంశంలో విశేష ప్రతిభ కనబర్చిన శౌర్యజిత్.. అందరినీ మంత్రముగ్దుల్ని చేశాడు. శౌర్యజిత్ విన్యాసాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. చిన్నారి విన్యాసాలు చూసి నోరెళ్లబెట్టిన నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, గుజరాతీ సంప్రదాయ క్రీడ అయిన మల్లఖంబ్‌కు ఇటీవలే జాతీయ క్రీడల్లో స్థానం కల్పించిన విషయం తెలిసిందే. 10-year-old Shauryajit Khaire from Gujarat wins Bronze Medal 🥉 in Mallakhamb(Individual Pole); Becomes the youngest Medalist at the #36thNationalGames #Mallakhamb #NationalGames2022 #Shauryajit @Media_SAI @ianuragthakur pic.twitter.com/Oa1OUHeRAj— All India Radio News (@airnewsalerts) October 10, 2022 -
'మెడల్స్ అక్కడే వదిలేసి రమ్మంటారా?'.. స్టార్ స్విమ్మర్‌కు అవమానం
భారత స్టార్ స్విమ్మర్ శ్రీహరి నటరాజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. నటరాజ్‌తో పాటు అతని బృందానికి ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది భారీ జరిమానా విధించింది. లగేజీ ఎక్కువగా ఉండమే దీనికి కారణం అని తెలిసింది. అయితే లగేజీలో ఉన్నవాటిలో ఎక్కువమొత్తంలో మెడల్స్ ఉన్నాయి. వాటి బరువు వల్లే లగేజీ బరువు పెరిగిపోయిందని శ్రీహరి నటరాజ్ బృందం పేర్కొంది. 36వ జాతీయ క్రీడలు ముగించుకొని వస్తున్న సమయంలో గుజరాత్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇదే విషయమై శ్రీహరి నటరాజ్ మాట్లాడుతూ.. '' గుజరాత్లో జరిగిన 36వ జాతీయ క్రీడలు ముగించుకొని మా బృందంతో కలిసి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చాను. కానీ ఇండిగో సిబ్బంది మాతో దురుసుగా ప్రవర్తించడమే గాక అదనపు లగేజీ కారణంగా భారీ జరిమానా విధించారు. అయితే అదనపు లగేజీగా భావిస్తున్న వాటిలో మెడల్స్, అథ్లెట్స్‌కు సంబంధించిన వస్తువులే ఉన్నాయి. నిజాయితీగా చెప్పాలంటే వారి విధించిన జరిమానా మాకు పెద్ద విషయం కాకపోవచ్చు..కానీ నాతో పాటు మా బృందాన్ని ట్రీట్ చేసిన తీరు బాగాలేదు. సిబ్బంది తీరు చూస్తుంటే ఎక్కడ మెడల్స్ గెలిచామో అదే స్థలంలో విడిచిపెట్టాలన్నట్లుగా ఉంది.'' అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక జాతీయ క్రీడల్లో తొలిసారి పాల్గొన్న శ్రీహరి నటరాజ్ అదరగొట్టాడు. జాతీయ క్రీడల్లో కర్నాటక తరపున పాల్గొన్న నటరాజ్ వివిధ విభాగాలు కలిపి ఆరు గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నాడు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లో మంచి ప్రదర్శన కనబరిచిన శ్రీహరి నటరాజ్ తృటిలో పతకం కోల్పోయినప్పటిక A-స్టాండర్డ్‌లో చోటు సంపాదించాడు. ఆ తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌లోనూ పతకం సాధించడంలో విఫలమైనప్పటికి 100 మీ, 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్స్‌లో మంచి ప్రదర్శన కనబరిచాడు. Dear @IndiGo6E I was returning from the National Games held in Gujarat, and the staff not only behaved badly, but also charged us a hefty amount for excess baggage which was the medals and goodies that we athletes had won. — Srihari Nataraj OLY (@srihari3529) October 10, 2022 Honestly, the amount wasn't an issue, it's the the way they treated me and my teammates. Should we leave the medals we win back at the venue?🤔 @IndiGo6E — Srihari Nataraj OLY (@srihari3529) October 10, 2022 National Games Round Up: Srihari Nataraj finishes campaign with a flourish, claiming sixth gold with 100m Freestyle win@YASMinistry@IndiaSports @PIB_Indiahttps://t.co/bVhWkybCuu pic.twitter.com/3EhIB1yWbT — PIB in Tripura (@PIBAgartala) October 9, 2022 చదవండి: పుట్టినరోజున హార్దిక్ పాండ్యా ఎమోషనల్.. బెలూన్ వరల్డ్‌కప్.. క్రీడాకారిణి ప్రాణం మీదకు -
కృష్ణ చైతన్య–మహేశ్ జోడీకి స్వర్ణం
అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో తెలంగాణ రాష్ట్రానికి ఎనిమిదో స్వర్ణ పతకం లభించింది. ఆదివారం జరిగిన పురుషుల బీచ్ వాలీబాల్ ఈవెంట్లో తెలంగాణకు చెందిన కృష్ణ చైతన్య–మహేశ్ జోడీ విజేతగా నిలిచింది. ఫైనల్లో కృష్ణ చైతన్య–మహేశ్ ద్వయం 22–24, 23–21, 15–11తో కృష్ణంరాజు–నరేశ్ (ఆంధ్రప్రదేశ్) జోడీపై విజయం సాధించింది. 2015 కేరళ జాతీయ క్రీడల బీచ్ వాలీబాల్ ఫైనల్లో కృష్ణంరాజు–నరేశ్ జోడీ చేతిలో ఓడిపోయి రజత పతకం నెగ్గిన కృష్ణ చైతన్య ఏడేళ్ల తర్వాత అదే జంటను ఓడించి ఈసారి స్వర్ణ పతకం సాధించడం విశేషం. 2015 కేరళ జాతీయ క్రీడల్లో రవీందర్ రెడ్డితో కలిసి కృష్ణ చైతన్య బరిలోకి దిగాడు. ఈసారి మహేశ్‌తో జతకట్టిన కృష్ణ చైతన్య పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. కనోయింగ్‌లో 1000 మీటర్ల స్ప్రింట్ విభాగంలో తెలంగాణకు చెందిన అమిత్ కుమార్ సింగ్ కాంస్య పతకాన్ని సాధించాడు. అమిత్ రేసును 4ని:31.533 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచాడు. పురుషుల బాక్సింగ్‌లో సర్వీసెస్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ 57 కేజీల విభాగంలో సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో హుసాముద్దీన్ 5–0తో రోహిత్ మోర్ (ఢిల్లీ)పై గెలిచాడు. -
National Games 2022: వ్రిత్తి ఖాతాలో మరో పతకం
అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో మరో పతకం చేరింది. మహిళల స్విమ్మింగ్ 400 మీటర్ల ఫ్రీస్టయిల్లో వ్రిత్తి అగర్వాల్ కాంస్య పతకం సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఈ విభాగంలో వ్రిత్తి 4 నిమిషాల 34.96 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది. ఈ జాతీయ క్రీడల్లో వ్రిత్తికిది మూడో పతకం కావడం విశేషం. ఇప్పటి వరకు తెలంగాణ ఏడు స్వర్ణాలు, ఏడు రజతాలు, నాలుగు కాంస్యాలతో కలిపి మొత్తం 18 పతకాలతో 14వ స్థానంలో ఉంది. -
జ్యోతి ఖాతాలో రెండో స్వర్ణం
అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యెర్రాజీ మళ్లీ మెరిసింది. ఇప్పటికే మహిళల 100 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన ఈ వైజాగ్ అథ్లెట్ 100 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్లోనూ బంగారు పతకం సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును జ్యోతి 12.79 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది. తెలంగాణకు చెందిన అగసార నందిని 13.38 సెకన్లలో గమ్యానికి చేరి రజత పతకం సాధించింది. మహిళల జావెలిన్ త్రోలో రష్మీ శెట్టి ఆంధ్రప్రదేశ్‌కు రజత పతకం అందించింది. రష్మీ జావెలిన్‌ను 53.95 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచింది. టెన్నిస్ పురుషుల డబుల్స్ విభాగంలో కొసరాజు శివదీప్–ముని అనంత్‌మణి (ఆంధ్రప్రదేశ్) జోడీ కాంస్య పతకం సాధించింది. సెమీఫైనల్లో శివదీప్–అనంత్‌మణి ద్వయం 7–5, 3–6, 6–10తో ప్రజ్వల్ దేవ్–ఆదిల్ (కర్ణాటక) జోడీ చేతిలో ఓడి కాంస్యం సొంతం చేసుకుంది. చదవండి: London Marathon: విషాదం నింపిన మారథాన్.. ట్రాక్‌పైనే కుప్పకూలిన అథ్లెట్ -
జాతీయ క్రీడల్లో సత్తా చాటుతున్న తెలుగు తేజాలు
అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో ఆదివారం తెలంగాణకు ఒక రజత పతకం లభించింది. మరో రెండు పతకాలు ఖరారయ్యాయి. మహిళల షూటింగ్ స్కీట్ ఈవెంట్ ఫైనల్లో తెలంగాణకు చెందిన రష్మీ రాథోడ్ 25 పాయింట్లు స్కోరు చేసి రజతం సాదించింది. బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్లో తెలంగాణ జట్టు ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్లో తెలంగాణ 3–2తో మహారాష్ట్రపై నెగ్గింది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో సిక్కి రెడ్డి–పుల్లెల గాయత్రి జోడీ 21–9, 21–16తో సిమ్రన్–రితిక జంటను ఓడించి తెలంగాణను గెలిపించింది. వియత్నాం ఓపెన్‌లో ఆడి శనివారం రాత్రి నేరుగా గుజరాత్ చేరుకున్న సిక్కి రెడ్డి ఆదివారం మధ్యాహ్నం సెమీఫైనల్లో ఆడటం విశేషం. నేడు ఫైనల్లో కేరళతో తెలంగాణ ఆడుతుంది. మహిళల 3్ఠ3 బాస్కెట్‌బాల్ ఈవెంట్లో తెలంగాణ జట్టు ఫైనల్ చేరి కనీసం రజత పతకం ఖాయం చేసుకుంది. రజతాలు నెగ్గిన పల్లవి, కార్తీక జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ ఖాతాలో ఆదివారం రెండు రజత పతకాలు చేరాయి. మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 64 కేజీల విభాగంలో విజయనగరం జిల్లాకు చెందిన ఎస్.పల్లవి రజతం సాధించింది. 18 ఏళ్ల పల్లవి మొత్తం 199 కేజీల బరువెత్తి రెండో స్థానంలో నిలిచింది. మహిళల ట్రిపుల్ జంప్ ఈవెంట్లో జి.కార్తీక రజతం సాధించింది. కార్తీక 12.85 మీటర్ల దూరం దూకింది. అథ్లెటిక్స్ మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి యెర్రాజీ ఫైనల్ చేరింది. -
National Games 2022: ఈ బంగారు పతకం ప్రత్యేకం: ఇషా సింగ్
National Games 2022: నేషనల్ గేమ్స్-2022లో మహిళల షూటింగ్ 25 మీటర్ల పిస్టల్ విభాగంలో తెలంగాణ షూటర్ ఇషా సింగ్ చాంపియన్‌గా నిలిచింది. ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో ఇషా 26 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణం దక్కించుకుంది. రిథమ్ సాంగ్వాన్ (హరియాణా; 25 పాయింట్లు) రజత పతకం, అభిద్న్యా (మహారాష్ట్ర; 19 పాయింట్లు) కాంస్యం గెలిచారు. ఈ క్రీడల్లో తెలంగాణకిది రెండో స్వరం. ఆర్టిస్టిక్ సింగిల్ ఫ్రీ స్కేటింగ్‌లో రియా సాబూ బంగారు పతకం గెలిచింది. ఇక జాతీయ క్రీడల్లో పసిడి పతకం గెలిచిన అనంతరం ఇషా సింగ్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేనెంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. నేషనల్ గేమ్స్‌లో గోల్డ్ గెలవడం నాకెంతో ప్రత్యేకం. స్వర్ణం గెలిచేందుకు దగ్గరవుతున్న తరుణంలో నా మనసులో కలిగిన భావోద్వేగాల గురించి చెప్పడం కష్టం. ముఖ్యంగా చివరి రెండు షాట్లు’’ అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైంది. అదే విధంగా ఈ ఈవెంట్ తన రాష్ట్రం తెలంగాణకు ఒలింపిక్స్ వంటిదంటూ ఉద్వేగపూరిత ట్వీట్ చేసింది. కాగా జూనియర్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో పసిడి గెలిచిన ఇషా సింగ్‌కు తెలంగాణ సర్కారు రూ. 2 కోట్ల నగదు బహుమతి ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: National Games 2022: ఇద్దరూ ఒకప్పుడు టీమిండియా కెప్టెన్లే! ప్రేమా..పెళ్లి.. కవలలు.. మూడేళ్ల తర్వాత.. RSWS 2022 Final: శ్రీలంకను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడిన ఇండియా లెజెండ్స్.. వరుసగా రెండోసారి #NationalGames2022. Won first gold 🏅 Olympic event for my state Telangana 25msportspistol.@TelanganaCMO @MPsantoshtrs @RaoKavitha @KTRTRS @jayesh_ranjan @suldeep @Media_SAI @DGSAI pic.twitter.com/0weXDCjq5p — Esha Singh (@singhesha10) October 1, 2022 -
National Games 2022: జ్యోతి పసిడి పరుగు
గాంధీనగర్: జాతీయ క్రీడల్లో శనివారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు పతకాలతో మెరిశారు. మహిళల అథ్లెటిక్స్ 100 మీటర్ల విభాగంలో విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి యెర్రాజీ స్వర్ణ పతకం సాధించగా... 400 మీటర్ల విభాగంలో దండి జ్యోతిక శ్రీ రజత పతకం సొంతం చేసుకుంది. పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ 67 కేజీల విభాగంలో నీలం రాజు రజత పతకం దక్కించుకున్నాడు. మరోవైపు తెలంగాణ యువ షూటర్ ఇషా సింగ్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో విజేతగా నిలిచి బంగారు పతకాన్ని గెల్చు కుంది. రోలర్ స్కేటింగ్ కపుల్ డ్యాన్స్ ఈవెంట్లో తెలంగాణకు చెందిన అనుపోజు కాంతిశ్రీ–చలంచర్ల జూహిత్ జోడీ కాంస్య పతకాన్ని సాధించింది. ఈ ద్వయం 71 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ స్కేటర్ ఏలూరి కృష్ణసాయి రాహుల్ –యాష్వి శిరీష్ షా జోడీ 90.8 పాయింట్లతో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జ్యోతి యెర్రాజీ అదే ఉత్సాహంతో జాతీయ క్రీడల్లోనూ అదరగొట్టింది. 100 మీటర్ల రేసును జ్యోతి 11.51 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. అర్చన (తమిళనాడు; 11.55 సెకన్లు) రజతం, డియాండ్ర (మహారాష్ట్ర; 11.62 సెకన్లు) కాంస్యం సాధించారు. 400 మీటర్ల ఫైనల్ రేసును జ్యోతిక శ్రీ 53.30 సెకన్లలో ముగించి రెండో స్థానంలో నిలిచి రజతం గెలిచింది. ఐశ్వర్య మిశ్రా (మహారాష్ట్ర; 52.62 సెకన్లు) స్వర్ణం, రూపల్ చౌదరీ (ఉత్తరప్రదేశ్; 53.41 సెకన్లు) కాంస్యం సొంతం చేసుకున్నారు. వెయిట్‌లిఫ్టింగ్ 67 కేజీల విభాగంలో నీలం రాజు మొత్తం 270 కేజీలు (స్నాచ్‌లో 124+క్లీన్ అండ్ జెర్క్‌లో 146) బరువెత్తి రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు. 73 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్ జె.కోటేశ్వర రావు 280 కేజీల బరువెత్తి నాలుగో స్థానంలో నిలిచాడు. శుక్రవారం రాత్రి జరిగిన రోలర్ స్పోర్ట్స్ ఆర్టిస్టిక్ సింగిల్ ఫ్రీ స్కేటింగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆకుల సాయిసంహిత రజతం, భూపతిరాజు అన్మిష కాంస్య పతకం సాధించారు. -
National Games 2022: తెలంగాణ నెట్‌బాల్ జట్టుకు రజతం
అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో తెలంగాణ రాష్ట్రం ఖాతాలో నాలుగో పతకం చేరింది. టేబుల్ టెన్నిస్ (టీటీ)లో ఇప్పటికే మూడు పతకాలు లభించగా... తాజాగా నెట్‌బాల్ క్రీడాంశంలో తెలంగాణ జట్టుకు రజత పతకం దక్కింది. భావ్‌నగర్‌లో శుక్రవారం జరిగిన పురుషుల నెట్‌బాల్ ఫైనల్లో తెలంగాణ 73–75తో (16–9, 12–18, 16–20, 29–28) హరియాణా చేతిలో పోరాడి ఓడిపోయింది. రజత పతకం నెగ్గిన తెలంగాణ జట్టులో బి.విక్రమాదిత్య రెడ్డి, సయ్యద్ అమ్జాద్ అలీ, జన్ను హరీశ్, కంబాల శ్రీనివాసరావు, ముజీబుద్దీన్, మొహమ్మద్ ఇస్మాయిల్, పి.వంశీకృష్ణ, కె.సుమన్, కురకుల సంయుత్, బి.రంజీత్ కుమార్, సయ్యద్ మొహమ్మద్ అహ్మద్, ఎన్.లునావత్ అఖిల్ సభ్యులుగా ఉన్నారు. మహిళల టీమ్ టెన్నిస్‌లో తెలంగాణ జట్టు తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. తెలంగాణ 0–2తో గుజరాత్ చేతిలో ఓడిపోయింది. మరోవైపు మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌లో టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత, కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ మీరాబాయి చాను 49 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. మణిపూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మీరాబాయి మొత్తం 191 కేజీలు (స్నాచ్‌లో 84+క్లీన్ అండ్ జెర్క్‌లో 107) బరువెత్తి అగ్రస్థానంలో నిలిచింది. -
ఇద్దరూ ఒకప్పుడు టీమిండియా కెప్టెన్లే! ప్రేమా..పెళ్లి.. కవలలు.. మూడేళ్ల తర్వాత..
భార్యాభర్తలు.. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ పరస్పర సమన్వయంతో ముందడుగు వేస్తే జీవితం సాఫీగా సాగిపోతుంది. జీవనసహచరులు ఒకరికొకరు అండగా నిలిస్తే అనుకున్న లక్ష్యాలు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. భారత రగ్బీ క్రీడాకారుల జంట నేహా పర్దేశీ- గౌతమ్ దాగర్ ఈ కోవకే చెందుతారు. భారత రగ్బీ జట్ల మాజీ కెప్టెన్లు అయిన వీరిద్దరు తమ ప్రేమను పెళ్లి పీటల దాకా తీసుకువచ్చి 2019, ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నారు. ప్రణయ బంధాన్ని వైవాహిక బంధంగా మార్చుకుని దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. నేహా- గౌతమ్ జీవితంలోని సంతోషాలను రెట్టింపు చేస్తూ గతేడాది నవంబరులో వీరికి కవలలు జన్మించారు. తమ కలల పంటకు దెమీరా దాగర్(కూతురు), కబీర్ దాగర్(కొడుకు)గా నామకరణం చేశారు ఈ క్రీడా దంపతులు. (Photo Credit: Gautam Dagar Facebook) ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే.. సిజేరియన్ ద్వారా కవలలకు జన్మనిచ్చిన నేహా.. తిరిగి మైదానంలో దిగేందుకు సిద్ధమయ్యారు. జాతీయ క్రీడల్లో భాగంగా ఈ ‘సూపర్ మామ్’ రీఎంట్రీ ఇవ్వనున్నారు. గుజరాత్ వేదికగా 36వ జాతీయ క్రీడలు గురువారం అట్టహాసంగా మొదలైన విషయం తెలిసిందే. గతంలో కనీవినీ ఎరుగని రీతిలో సుమారు లక్షా 25 వేల మందితో కిక్కిరిసిన నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించిన ఆరంభ వేడుకల సంబరం అంబరాన్నంటింది. 36 క్రీడాంశాలు.. దాదాపుగా 600 మంది గుజరాతీ కళాకారులు తమ సాంస్కృతిక ప్రదర్శనతో కట్టిపడేశారు. ప్రేక్షకుల జయజయధ్వానాల మధ్య భారత ప్రధాని మోదీ అంగరంగ వైభవంగా ఈ ఆటల పండగను ప్రారంభించారు. జాతీయ క్రీడలు- 2022లో భాగంగా సుమారు 7000 మందికి పైగా అథ్లెట్లు 36 క్రీడాంశాల్లో పాల్గొననున్నారు. ఇందులో నేహా కూడా ఒకరు. మాతృత్వపు మధురిమలు ఆస్వాదిస్తూ.. తల్లిగా బాధ్యతలు నెరవేరుస్తూ ఇన్నాళ్లు ఆటకు దూరంగా ఉన్న ఆమె దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ రగ్బీ ఆడనున్నారు. ఈ నేపథ్యంలో టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నేహా మాట్లాడుతూ.. సిజేరియన్ తర్వాత 20 రోజులకే ట్రెయినింగ్ ఆరంభించానంటూ ఆట పట్ల అంకిత భావాన్ని చాటుకున్నారు. ఆత్మవిశ్వాసం కోల్పోను ‘‘ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ధైర్యంగా ఉంటాను. ఇప్పుడు నా ఆటలో కాస్త వేగం తగ్గినట్లు అనిపించవచ్చు. కానీ మానసికంగా నేనెంతో దృఢంగా ఉన్నాను. క్రీడాకారిణిగా నా బాధ్యతలను గతంలో కంటే మెరుగ్గా నెరవేర్చగలను. ఎందుకంటే.. నాకిపుడు మల్టీటాస్కింగ్ అలవాటైంది. ఇద్దరు చిన్నారుల ఆలనాపాలనా చూసుకుంటూనే తిరిగి రగ్బీ ఆడేందుకు సిద్ధమయ్యాను. సిజేరియన్ తర్వాత 20 రోజులకే ఫిజికల్ ట్రెయినింగ్ మొదలు పెట్టాను. ఫిట్నెస్ సాధించాను. తల్లిగా.. ప్లేయర్‌గా నా కర్తవ్యాన్ని నెరవేర్చడాన్ని నేను పూర్తి ఆస్వాదిస్తున్నా’’ అని ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న 29 ఏళ్ల నేహా చెప్పుకొచ్చారు. తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకోవడమే తన ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. కాగా 2019లో చివరిసారిగా టీమిండియాకు ఆడిన నేహా.. శుక్రవారం నాటి మ్యాచ్‌తో రీఎంట్రీకి సన్నద్ధమయ్యారు. ఇక నేహా భర్త గౌతమ్ దాగర్ గతంలో భారత పురుషుల రగ్బీ జట్టుకు సారథిగా వ్యవహరించాడు. చదవండి: T20 WC 2022: 'బుమ్రా స్థానంలో అతడికి అవకాశమివ్వండి' -
National Games 2022: నేటి నుంచి జాతీయ క్రీడలు
అహ్మదాబాద్: ఆయా క్రీడాంశాల్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు లేకుండానే నేటి నుంచి జాతీయ క్రీడలు అధికారికంగా మొదలుకానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ క్రీడలను ప్రారంభిస్తారు. అక్టోబర్ 10 వరకు జరిగే ఈ క్రీడల్లో 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలతోపాటు భారత త్రివిధ దళాలకు చెందిన సర్వీసెస్ జట్టు నుంచి మొత్తం ఏడువేల మంది క్రీడాకారులు పోటీపడనున్నారు. మొత్తం 36 ఈవెంట్స్‌లో పతకాల కోసం పోటీలుంటాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, రాజ్‌కోట్, భావ్‌నగర్ నగరాల్లో మ్యాచ్‌లను ఏర్పాటు చేశారు. సైక్లింగ్ ఈవెంట్‌ను మాత్రం న్యూఢిల్లీలో నిర్వహిస్తారు. భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) ఎల్లుండి నుంచి చైనాలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనాల్సి ఉండటంతో... టీటీ పోటీలను ఈనెల 20 నుంచి 24 వరకు నిర్వహించారు. కబడ్డీ, లాన్ బౌల్స్, రగ్బీ క్రీడాంశాల్లోనూ పోటీలు మొదలయ్యాయి. ఏడేళ్ల తర్వాత మళ్లీ జాతీయ క్రీడలు జరుగుతున్నాయి. చివరిసారి 2015లో జరిగిన జాతీయ క్రీడలకు కేరళ ఆతిథ్యమిచ్చింది. ఆ క్రీడల్లో తెలంగాణ 8 స్వర్ణాలు, 14 రజతాలు, 11 కాంస్యాలతో కలిపి 33 పతకాలతో 12వ ర్యాంక్‌లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 6 స్వర్ణాలు, 3 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి 16 పతకాలతో 18వ స్థానంలో నిలిచింది.