కామన్ వెల్త్ యూత్ గేమ్స్ గురువారం రోజు భారత్ చెలరేగారు. రెండు స్వర్ణాలతో సహా ఏకంగా.. ఏడు మెడల్స్ ఖాతాలో వేసుకున్నారు. ఆర్చర్ ప్రాచీ సింగ్ వ్యక్తిగత విభాగంలోనూ, టెన్సిస్ మిక్స్ డ్ డబల్స్ విభాగంలో శశికుమార్, ధృతీ వేణుగోపాల్ లు బంగారు పతకాలు సాధించారు.
కామన్ వెల్త్ యూత్ గేమ్స్ గురువారం రోజు భారత్ చెలరేగారు. రెండు స్వర్ణాలతో సహా ఏకంగా.. ఏడు మెడల్స్ ఖాతాలో వేసుకున్నారు. ఆర్చర్ ప్రాచీ సింగ్ వ్యక్తిగత విభాగంలోనూ, టెన్సిస్ మిక్స్ డ్ డబల్స్ విభాగంలో శశికుమార్, ధృతీ వేణుగోపాల్ లు బంగారు పతకాలు సాధించారు. బాక్సర్ గౌరవ్ 52 కిలోల విభాగంలో, ఆర్చర్ నిషాంత్ బాలుర వ్యక్తిగత విభాగంలో, స్క్వాష్ మిక్స్ డ్ టీమ్ ఈవెంట్ లో సెంధిల్, హర్షిత్ లు రజత పతకాలు సాధించారు. ఇక భీమ్ చంద్, ప్రజ్ఞా చౌహాన్లు కాంస్యంతో సరిపెట్టుకున్నారు. కాగా ఈ క్రీడల్లో ఇప్పటి వరకూ 7 బంగారు, 4 రజత, 6 కాంస్య పతకాలు సాధించి భారత్ భారత్ పతకాల పట్టికలో ఆరో స్ధానం పొందింది. టెన్సిస్ వ్యక్తిగత విభాగంలో శశికుమార్, ధృతిలు ఫైనల్స్ శుక్రవారం ఉంది. దీంతో చివరి రోజు భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరే అవకాశం ఉంది.