Commonwealth Youth Games
-
కామన్వెల్త్ యూత్ గేమ్స్ వాయిదా
న్యూఢిల్లీ: ఈ ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ వచ్చే సంవత్సరానికి వాయిదా పడటంతో... ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది జరగాల్సిన కామన్వెల్త్ యూత్ గేమ్స్‌ను 2023కు వాయిదా వేశారు. 2021 టోక్యో ఒలింపిక్స్ జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరుగుతాయి. ట్రినిడాడ్ అండ్ టొబాగో ఆతిథ్యమిచ్చే కామన్వెల్త్ యూత్ గేమ్స్ 2021 ఆగస్టు 1 నుంచి 7 వరకు జరగాల్సింది. అయితే టోక్యో ఒలింపిక్స్ దృష్ట్యా కామన్వెల్త్ యూత్ గేమ్స్‌ను రెండేళ్లపాటు వాయిదా వేస్తున్నామని కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య ఎగ్జిక్యూటివ్ బోర్డు ప్రకటించింది. -
జీల్, సచిన్‌లకు స్వర్ణాలు
కామన్వెల్త్ యూత్ గేమ్స్ నసావు (బహమాస్): పతకాల వేటను పసిడితో మొదలుపెట్టిన భారత క్రీడాకారులు స్వర్ణ పతకంతోనే ముగించారు. కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో మరోసారి సత్తా చాటుకున్నారు. బహమాస్‌లో ముగిసిన ఈ ఆరు రోజుల క్రీడల్లో భారత్ ఓవరాల్‌గా నాలుగు స్వర్ణాలు, రజతం, ఆరు కాంస్య పతకాలను సాధించి మొత్తం 11 పతకాలతో ఏడో స్థానంలో నిలిచింది. చివరిరోజు టెన్నిస్‌లో జీల్ దేశాయ్ బాలికల సింగిల్స్ విభాగంలో స్వర్ణం సాధించగా... బాలుర సింగిల్స్‌లో సిద్ధాంత్ బంతియా కాంస్య పతకాన్ని గెలిచాడు. మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లో జీల్ దేశాయ్–సిద్ధాంత్ ద్వయం బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. సింగిల్స్ ఫైనల్లో జీల్ దేశాయ్ 6–3, 7–6తో ఎలీజా ఒమిరూ (సైప్రస్)ను ఓడించగా... మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో జీల్–సిద్ధాంత్ జంట 6–4, 6–3తో నియోస్–ఒమిరూ (సైప్రస్) జోడీపై గెలిచింది. కాంస్య పతక పోరులో సిద్ధాంత్ 6–2, 6–0తో నియోస్ (సైప్రస్)పై నెగ్గాడు. ఇక బాక్సింగ్‌లో సచిన్ సివాచ్ (49 కేజీలు) స్వర్ణం దక్కించుకోగా... మొహమ్మద్ ఎతాష్ ఖాన్ (56 కేజీలు) కాంస్యం... బాలికల ఈవెంట్లో జానీ (60 కేజీలు) రజతం, ఏక్తా (51 కేజీలు) కాంస్యం గెలిచారు. -
జూడోలో భారత్‌కు నాలుగు పతకాలు
న్యూఢిల్లీ: కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో భారత జట్టు తొలి రోజే నాలుగు పతకాలు సాధించింది. బహమాస్‌లోని నసావూ నగరంలో జరుగుతున్న ఈ క్రీడల్లో జూడో క్రీడాంశంలో భారత్‌కు స్వర్ణం, 3 కాంస్య పతకాలు లభించాయి. బాలుర 73 కేజీల విభాగంలో హరియాణాకు చెందిన సోని విజేతగా నిలిచి పసిడి పతకం గెలిచాడు. ఫైనల్లో అతను 10–0తో ఉరోస్ (ఆస్ట్రేలియా)పై గెలిచా డు. బాలుర విభాగంలో ఆశిష్ (60 కేజీలు)... బాలికల విభాగంలో చానమ్ రెబీనా దేవి (57 కేజీలు), అంతిమ్ యాదవ్ (48 కేజీలు) కాంస్య పతకాలను సాధించారు. ఈనెల 24న ముగిసే ఈ క్రీడల్లో జూడోలో ఒక దేశం నుంచి నలుగురికి మాత్రమే (బాలుర విభాగంలో ఇద్దరు, బాలికల విభాగంలో ఇద్దరు) అవకాశం కల్పించారు. -
భారత్‌కు రెండు స్వర్ణాలు
అపియా (సమోవా) : అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో భారత కుర్రాళ్లు జోరు కొనసాగిస్తున్నారు. గురువారం రెండు స్వర్ణాలతో పాటు ఏడు పతకాలను దక్కించుకున్నారు. ఆర్చర్ ప్రాచీ సింగ్ బాలికల రికర్వ్ వ్యక్తిగత ఈవెంట్ ఫైనల్లో బంగ్లాదేశ్ ఆర్చర్‌పై నెగ్గి స్వర్ణం ఖాయం చేసుకుంది. మరోవైపు టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్‌లో శశికుమార్ ముకుంద్, ధ్రుతి వేణుగోపాల్ 7-6 (7/4), 6-3 తేడాతో మెకెలాండ్, లమ్స్‌డెన్ (స్కాట్లాండ్)ను ఓడించి స్వర్ణం దక్కించుకున్నారు. ఇక బాక్సర్ గౌరవ్ సోలంకి (52 కేజీలు) రజతంతో సంతృప్తి పడ్డాడు. అలాగే ఆర్చర్ నిశాంత్ (బాలుర రికర్వ్ వ్యక్తిగత), స్క్వాష్ మిక్స్డ్ టీమ్‌లో సెం థిల్ కుమార్, హర్షిత్ జవందాలకు కూడా రజతాలు లభించాయి. బాక్సర్లు లీచోం బన్ భీమ్‌చంద్ సింగ్ (49 కేజీలు), ప్రయాగ్ (64 కేజీలు) కాంస్యాలు దక్కించుకున్నారు. ఓవరాల్‌గా ఇప్పటిదాకా భారత్ 17 పతకాలతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. -
యూత్ గేమ్స్ లో సత్తాచాటిన భారత్
కామన్ వెల్త్ యూత్ గేమ్స్ గురువారం రోజు భారత్ చెలరేగారు. రెండు స్వర్ణాలతో సహా ఏకంగా.. ఏడు మెడల్స్ ఖాతాలో వేసుకున్నారు. ఆర్చర్ ప్రాచీ సింగ్ వ్యక్తిగత విభాగంలోనూ, టెన్సిస్ మిక్స్ డ్ డబల్స్ విభాగంలో శశికుమార్, ధృతీ వేణుగోపాల్ లు బంగారు పతకాలు సాధించారు. బాక్సర్ గౌరవ్ 52 కిలోల విభాగంలో, ఆర్చర్ నిషాంత్ బాలుర వ్యక్తిగత విభాగంలో, స్క్వాష్ మిక్స్ డ్ టీమ్ ఈవెంట్ లో సెంధిల్, హర్షిత్ లు రజత పతకాలు సాధించారు. ఇక భీమ్ చంద్, ప్రజ్ఞా చౌహాన్లు కాంస్యంతో సరిపెట్టుకున్నారు. కాగా ఈ క్రీడల్లో ఇప్పటి వరకూ 7 బంగారు, 4 రజత, 6 కాంస్య పతకాలు సాధించి భారత్ భారత్ పతకాల పట్టికలో ఆరో స్ధానం పొందింది. టెన్సిస్ వ్యక్తిగత విభాగంలో శశికుమార్, ధృతిలు ఫైనల్స్ శుక్రవారం ఉంది. దీంతో చివరి రోజు భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరే అవకాశం ఉంది. -
గౌరవ్ కు వెండి పతకం
అపియా: కామన్వెల్త్ యూత్ గేమ్స్ లో భారత్ బాక్సర్ గౌరవ్ సోలంకి- వెండి పతకం గెల్చుకున్నాడు. 52 కిలోల విభాగంలో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా బాక్సర్ జాక్ బొవెన్ చేతిలో 0-3 తేడాతో పరాజయం పాలయ్యాడు. దీంతో అతడికి వెండి పతకం దక్కింది. ఈ టోర్నిలో భారత్ తరపున గౌరవ్ సోలంకి అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. ఇదే విభాగంలో 49 కిలోల కేటగిరిలో భీంచంద్ సింగ్, 64 కిలోల విభాగంలో ప్రజ్ఞాన్ చౌహాన్ సెమీస్ లో ఓడి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. బాక్సింగ్ లో భారత్ కు మొత్తం మూడు పతకాలు దక్కాయి. -
నిరాశ పరిచిన బాక్సర్లు
కామన్ వెల్త్ యూత్ గేమ్స్ లో మూడో రోజు భారత్ కు మిశ్రమ ఫలితాలు లభించాయి. బాక్సింగ్ లో గౌరవ్ సోలంకి మినహా.. మన బాక్సర్లంతా.. ఇంటిదారి పట్టారు. 52 కిలోల విభాగంలో గౌరవ్ సోలంకి.. ఫైనల్ చేరుకున్నాడు. సోలంకి సెమీఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లండ్ కి చెందిన బ్రాండన్ ను 3-0 తేడాతో ఓడించాడు. దీంతో సోలంకి కనీసం రజతపతకం పొందే అవకాశం ఉంది. ఇక ఇదే విభాగంలో 49కిలోల కేటగిరీలో భీమ్ చంద్ సింగ్, 64 కిలోల విభాగంలో ప్రజ్ఞాన్ చౌహాన్ లు సెమీస్ లో ఓడి క్యాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. స్క్వాష్ డబుల్స్ లో భారత్ జంట సెమీ ఫైనల్ కు చేరింది. పూల్ సీలో భాగంగా నార్ధన్ ఐర్లాండ్ జంటపై ..భారత్ జంట సెంధిల్ కుమార్, హర్షిత్ లు 11-0, 11-2 స్కోర్స్ తేడాతో సునాయాస విజయాన్ని సాధించారు. భారత్ తర్వాత మ్యాచ్ పాకిస్తాన్ తో ఆడనుంది. -
యూత్ గేమ్స్‌లో మరో రెండు స్వర్ణాలు
అపియా (సమోవా) : కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో భారత కుర్రాళ్లు రెండో రోజు కూడా అదరగొట్టారు. మంగళవారం జరిగిన పోటీల్లో రెండు స్వర్ణాలతో మొత్తం ఐదు పతకాలు దక్కాయి. 15 ఏళ్ల వెయిట్‌లిఫ్టర్ దీపక్ లాథర్ (62కేజీ), జావెలిన్ త్రోయర్ మహ్మద్ హదీష్ స్వర్ణాలు కొల్లగొట్టగా మహిళల 400మీ. రేసులో జిస్నా మాథ్యూ రజతం సాధించింది. చందన్ బౌరి (బాలుర 400మీ.), వెల్వన్ సెంథిల్‌కుమార్ (స్క్వాష్)లకు కాంస్యాలు దక్కాయి. అథ్లెటిక్స్‌లో బియాంత్ సింగ్ 800మీ. ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. ఓవరాల్‌గా భారత్‌కు నాలుగు స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్యాలతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. -
రెండో రోజూ పతకాల పంట
కామన్ వెల్త్ యూత్ గేమ్స్ లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. తొలి రోజు నాలుగు మెడల్స్ గెలిచిన భారత్ రెండో రోజు కూడా రెండు స్వర్ణాలతో సహా ఐదు పతకాలు ఖాతాలో వేసుకున్నారు. వెయిట్ లిఫ్టర్ దీపక్ 62కేజీల విభాగంలో స్వర్ణం సాధించగా.. మొహద్ హదీస్ జావెలిన్ త్రో లో స్వర్ణం సాధించాడు. బాలికల 400 మీటర్ల రన్నింగ్ లో జిస్నామాథ్యూస్ రజత పతకం గెలుచుకుంది. 400 మీటర్ల బాలుర విభాగంలో చందన్ బౌరీ, స్వ్కాష్ సింగిల్స్ లో సెంధిల్ కుమార్ లు కాంస్య పతకాలు సాధించారు. -
యూత్ గేమ్స్ లో భారత్ కు మరో స్వర్ణం
కామన్ వెల్త్ యూత్ గేమ్స్ లో భారత్ కు మరో స్వర్ణం దక్కింది. సమోవాలో జరుగుతున్న ఈ క్రీడా పోటీల్లో వెయిట్ లిఫ్టర్ దీపక్ స్వర్ణం సాధించాడు. వెయిట్ లిఫ్టింగ్ 62 కేజీల విభాగంలో 15ఏళ్ల దీపక్ పతకం దక్కించుకున్నాడు. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో తొలి రోజు 56 కేజీల విభాగంలో జంజాంగ్ దేరు స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. -
భారత్‌కు రెండు స్వర్ణాలు
కామన్వెల్త్ యూత్ గేమ్స్ అపియా (సమోవా): కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో భారత్ రెండు స్వర్ణాలు, ఓ రజ తంతో ఖాతా తెరిచింది. సోమవారం బాలుర 56కేజీల విభాగంలో జరిగిన వెయిట్‌లిఫ్టింగ్‌లో జమ్జంగ్ దేరు తొలి స్థానంలో నిలిచాడు. 17 ఏళ్ల దేరు 237కేజీల బరువెత్తి స్వర్ణం దక్కించుకున్నాడు. అలాగే ఢిల్లీకి చెందిన తేజస్విని శంకర్ హైజంప్‌లో 2.14మీ. ఎత్తుతో స్వర్ణం నెగ్గాడు. స్విమ్మర్ మొండల్ 200మీ. బట్టర్‌ఫ్లయ్ ఈవెం ట్లో 2:01.94 టైమింగ్‌తో రెండో స్థానంలో నిలిచి రజతం గెలుచుకున్నాడు. ఈనెల 11 వరకు జరిగే ఈ క్రీడల్లో భారత్ తరఫున 25 మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు.