యూత్ గేమ్స్‌లో మరో రెండు స్వర్ణాలు | The other two gold medals in the Youth Games | Sakshi
Sakshi News home page

యూత్ గేమ్స్‌లో మరో రెండు స్వర్ణాలు

Published Wed, Sep 9 2015 12:42 AM | Last Updated on Sun, Sep 3 2017 9:00 AM

The other two gold medals in the Youth Games

అపియా (సమోవా) : కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో భారత కుర్రాళ్లు రెండో రోజు కూడా అదరగొట్టారు. మంగళవారం జరిగిన పోటీల్లో రెండు స్వర్ణాలతో మొత్తం ఐదు పతకాలు దక్కాయి. 15 ఏళ్ల వెయిట్‌లిఫ్టర్ దీపక్ లాథర్ (62కేజీ), జావెలిన్ త్రోయర్ మహ్మద్ హదీష్  స్వర్ణాలు కొల్లగొట్టగా మహిళల 400మీ. రేసులో జిస్నా మాథ్యూ రజతం సాధించింది. చందన్ బౌరి (బాలుర 400మీ.), వెల్వన్ సెంథిల్‌కుమార్ (స్క్వాష్)లకు కాంస్యాలు దక్కాయి. అథ్లెటిక్స్‌లో బియాంత్ సింగ్ 800మీ. ఫైనల్స్‌కు అర్హత సాధించాడు.

ఓవరాల్‌గా భారత్‌కు నాలుగు స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్యాలతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement