కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో భారత్ రెండు స్వర్ణాలు, ఓ రజతంతో ఖాతా తెరిచింది...
కామన్వెల్త్ యూత్ గేమ్స్
అపియా (సమోవా): కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో భారత్ రెండు స్వర్ణాలు, ఓ రజ తంతో ఖాతా తెరిచింది. సోమవారం బాలుర 56కేజీల విభాగంలో జరిగిన వెయిట్‌లిఫ్టింగ్‌లో జమ్‌జంగ్ దేరు తొలి స్థానంలో నిలిచాడు. 17 ఏళ్ల దేరు 237కేజీల బరువెత్తి స్వర్ణం దక్కించుకున్నాడు. అలాగే ఢిల్లీకి చెందిన తేజస్విని శంకర్ హైజంప్‌లో 2.14మీ. ఎత్తుతో స్వర్ణం నెగ్గాడు. స్విమ్మర్ మొండల్ 200మీ. బట్టర్‌ఫ్లయ్ ఈవెం ట్‌లో 2:01.94 టైమింగ్‌తో రెండో స్థానంలో నిలిచి రజతం గెలుచుకున్నాడు. ఈనెల 11 వరకు జరిగే ఈ క్రీడల్లో భారత్ తరఫున 25 మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు.