కామన్ వెల్త్ యూత్ గేమ్స్ లో మూడో రోజు భారత్ కు మిశ్రమ ఫలితాలు లభించాయి. బాక్సింగ్ లో గౌరవ్ సోలంకి మినహా.. మన బాక్సర్లంతా.. ఇంటిదారి పట్టారు. 52 కిలోల విభాగంలో గౌరవ్ సోలంకి.. ఫైనల్ చేరుకున్నాడు. సోలంకి సెమీఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లండ్ కి చెందిన బ్రాండన్ ను 3-0 తేడాతో ఓడించాడు. దీంతో సోలంకి కనీసం రజతపతకం పొందే అవకాశం ఉంది. ఇక ఇదే విభాగంలో 49కిలోల కేటగిరీలో భీమ్ చంద్ సింగ్, 64 కిలోల విభాగంలో ప్రజ్ఞాన్ చౌహాన్ లు సెమీస్ లో ఓడి క్యాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు.
స్క్వాష్ డబుల్స్ లో భారత్ జంట సెమీ ఫైనల్ కు చేరింది. పూల్ సీలో భాగంగా నార్ధన్ ఐర్లాండ్ జంటపై ..భారత్ జంట సెంధిల్ కుమార్, హర్షిత్ లు 11-0, 11-2 స్కోర్స్ తేడాతో సునాయాస విజయాన్ని సాధించారు. భారత్ తర్వాత మ్యాచ్ పాకిస్తాన్ తో ఆడనుంది.
నిరాశ పరిచిన బాక్సర్లు
Published Wed, Sep 9 2015 6:44 PM | Last Updated on Sun, Sep 3 2017 9:04 AM
Advertisement
Advertisement