Harshit
-
మూడో టెస్టుకు హర్షిత్
ముంబై: భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే మూడో టెస్టు కోసం పేస్ బౌలర్ హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకున్నారు. బుధవారం అతను జట్టుతో చేరతాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన ట్రావెలింగ్ రిజర్వ్‌లలో ఢిల్లీకి చెందిన హర్షిత్ కూడా ఉన్నాడు. అయితే ఇప్పుడు ప్రధాన జట్టులోకి రానున్నాడని సమాచారం. నవంబర్ 1 నుంచి భారత్, కివీస్ మధ్య మూడో టెస్టు వాంఖెడే మైదానంలో జరుగుతుంది. హర్షిత్‌కు ఇప్పటికే బోర్డర్–గావస్కర్ ట్రోఫీ కోసం ఆ్రస్టేలియాకు వెళ్లే భారత టెస్టు టీమ్‌లో చోటు లభించింది. దానికి ముందు ఒక టెస్టులో అతడిని ఆడిస్తే బాగుంటుందని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.కివీస్‌తో ఇప్పటికే సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో మూడో టెస్టులో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే హర్షిత్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టవచ్చు. బంగ్లాదేశ్‌తో టి20 సిరీస్‌లకు ఎంపికైనా... హర్షిత్‌కు మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. మంగళవారం అస్సాంతో ముగిసిన రంజీ మ్యాచ్‌లో 7 వికెట్లు తీసిన హర్షిత్...ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 10 మ్యాచ్‌ల ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 24.00 సగటుతో రాణా 43 వికెట్లు పడగొట్టాడు. విలియమ్సన్ దూరం వెలింగ్టన్: న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ భారత్‌తో సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. గాయం కారణంగా తొలి రెండు టెస్టులకు అందుబాటులో లేని అతను ఇప్పుడు మూడో టెస్టునుంచి తప్పుకున్నాడు. విలియమ్సన్ భారత్‌కు రావడం లేదని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. గాయం నుంచి కోలుకొని అతను ప్రస్తుతం రీహాబిలిటేషన్‌లో ఉన్నాడు. అయితే ముందు జాగ్రత్తగా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.సంచలన ప్రదర్శనతో కివీస్ ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకున్న నేపథ్యంలో హడావిడిగా విలియమ్సన్‌ను బరిలోకి దించరాదని బోర్డు భావించింది. ఈ సిరీస్ తర్వాత సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో న్యూజిలాండ్ తలపడనుంది. దాని కోసం విలియమ్సన్ పూర్తి స్థాయిలో ఫిట్‌గా అందుబాటులో ఉండాలనేదే ప్రధాన కారణం. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ఆడిన తర్వాత స్వదేశానికి వెళ్లిన విలియమ్సన్ గాయం కారణంగా భారత గడ్డపై అడుగు పెట్టనే లేదు. -
ఈసారి ప్రేక్షకులను గెలిపించాలనుకుంటున్నాను: శ్రీవిష్ణు
‘‘తెలుగు ప్రేక్షకుల ప్రోత్సాహం వల్లే మేం గెలుస్తుంటాం. ఈసారి ప్రేక్షకులను గెలిపించాలనుకుంటున్నాను. దాని కోసం ఎంతో కష్టపడ్డాం. నిజంగా మీకు మా ‘శ్వాగ్’ సినిమా నచ్చితే అభినందిస్తూ రెండు చప్పట్లు కొట్టండి చాలు. ఈ నెల 4న థియేటర్స్‌కి వచ్చి మీరు గెలిచి, నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని హీరో శ్రీవిష్ణు అన్నారు. హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘శ్వాగ్’. మీరా జాస్మిన్, దక్షా నగార్కర్ కీలక పాత్రలు పోషించారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్‌కి ‘గూఢచారి, ఓ బేబీ, కార్తికేయ 2’ సినిమాలు చాలా పెద్ద సక్సెస్ ఇచ్చాయి. ‘శ్వాగ్’ కూడా అలాంటి సక్సెస్ ఇస్తుంది. ఈ మూవీలో శ్రీవిష్ణు నటన చూశాక కమల్హాన్గారితో ΄ోల్చుతారు’’ అని తెలి΄ారు. ‘‘శ్రీ విష్ణు, వివేక్ ఆత్రేయ స΄ోర్ట్తోనే ఈ ప్రయాణం కొనసాగిస్తున్నాను. ‘రాజ రాజ చోర’ సినిమా తర్వాత రెండో సినిమా ‘శ్వాగ్’ని విశ్వప్రసాద్‌గారి నిర్మాణంలో చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు హసిత్ గోలి. -
రోహిత్ శర్మ ఫ్లైయింగ్ కిస్.. ఫొటోలు డిలీట్ చేసిన సన్‌రైజర్స్
టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ సహచర ఆటగాళ్లతో ఎంత సరదాగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కీలక సమయంలో కాస్త గట్టిగానే సలహాలు, సూచనలు ఇచ్చే హిట్‌మ్యాన్.. అప్పుడప్పుడూ చిలిపి చేష్టలతో వారిని ఆటపట్టిస్తుంటాడు కూడా! తాజాగా రోహిత్ శర్మ ‘బాధితుల’ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ చేరాడు. కాగా ఐపీఎల్-2024లో తమ రెండో మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ సన్‌రైజర్స్‌తో తలపడనుంది. ఉప్పల్ వేదికగా ఇరు జట్ల మధ్య బుధవారం రాత్రి మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్న సందర్భంగా రోహిత్ శర్మ.. మయాంక్ అగర్వాల్‌ను టీజ్ చేశాడు. మయాంక్‌కు ఫ్లైయింగ్ కిస్ ఇస్తూ అల్లరి చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ హర్షిత్ రాణాను ఇమిటేట్ చేస్తూ అతడిని ఆటపట్టించాడు. దీంతో మయాంక్ నవ్వు ఆపుకోలేకపోయాడు. ‘‘ఇక చాల్లే’’ అన్నట్లుగా రోహిత్‌కు సైగలు చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎక్స్‌లో షేర్ చేసింది. ‘‘ఫ్లైయింగ్ కిస్సులు.. స్నేహపూర్వక శత్రుత్వాలు’’ అంటూ క్యాప్షన్ జతచేసింది. ఈ ఫొటో నెట్టింట వైరల్ కాగా.. కాసేపటికే డిలీట్ చేసింది. మయాంక్ పట్ల హర్షిత్ రాణా ప్రవర్తించిన తీరును కూడా ప్రమోట్ చేస్తారా అంటూ నెటిజన్ల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. Rohit Sharma things 😄#RohitSharma𓃵 #MayankAgarwal #MIvsSRH pic.twitter.com/o1C7l2OrGF — RSSB_BEROJGAR (@rssb_berojgar) March 27, 2024 కాగా ఐపీఎల్ పదిహేడో ఎడిషన్‌లో తమ ఆరంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్.. కేకేఆర్‌తో తలపడ్డ విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మయాంక్ తొలి ఓవర్ నుంచే హర్షిత్ రాణాను టార్గెట్ చేస్తూ వరుస బౌండరీలు బాదాడు. A flying kiss by Harshit Rana to Mayank Agarwal as a send off.pic.twitter.com/LVkQYKmisZ — Mufaddal Vohra (@mufaddal_vohra) March 23, 2024 అయితే, అనూహ్యంగా అతడి బౌలింగ్‌లోనే భారీ షాట్‌కు యత్నించి వెనుదిరిగాడు. ఈ క్రమంలో కోపంగా.. మయాంక్‌ను చూస్తూ ఫ్లైయింగ్ కిస్ ఇస్తూ వికెట్ సెలబ్రేట్ చేసుకున్నాడు హర్షిత్. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ విషయంలోనూ దూకుడుగా ప్రవర్తించాడు. ఈ నేపథ్యంలో హర్షిత్ రాణా అతి చేష్టలను తీవ్రంగా పరిగణించిన ఐపీఎల్ నిర్వాహకులు.. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కారణంగా మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధించారు. అదీ సంగతి! -
IPL 2024 ఓవరాక్షన్‌కు తగిన మూల్యం చెల్లించుకున్న హర్షిత్ రాణా
కేకేఆర్ పేస్ సంచలనం హర్షిత్ రాణా తాను చేసిన ఓవరాక్షన్‌కు తగిన మూల్యం చెల్లించుకున్నాడు. సన్‌రైజర్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన రాణా.. మయాంక్ అగర్వాల్‌ను ఔట్ చేసిన అనంతరం కోపంగా ఫ్లయింగ్ కిస్ ఇస్తూ సెండాఫ్ ఇచ్చాడు. A flying kiss by Harshit Rana to Mayank Agarwal as a send off.pic.twitter.com/LVkQYKmisZ — Mufaddal Vohra (@mufaddal_vohra) March 23, 2024 ఈ అతి చేష్ఠలను తీవ్రంగా పరిగణించిన మ్యాచ్ రిఫరీ మను నయ్యర్ రాణా మ్యాచ్ ఫీజ్‌లో 60 శాతం కోత విధించాడు. ఇదే మ్యాచ్‌లో రాణా హెన్రిచ్ క్లాసెన్ పట్ల కూడా దురుసుగా ప్రవర్తించాడు. ఈ రెండింటినీ పరిగణలోకి తీసుకున్న రిఫరీ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆర్టికల్ 2.5 నిబంధన ఉల్లంఘన కింద జరిమానా విధించాడు. Harshit Rana fined 60% of his match fees for giving Mayank Agarwal a send off. pic.twitter.com/kTXDBOXUtB — Mufaddal Vohra (@mufaddal_vohra) March 24, 2024 కాగా, నిన్నటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గెలుపుకు చివరి ఓవర్లో 13 పరుగులు కావాల్సి ఉండగా రాణా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. షాబాజ్ అహ్మద్‌తో పాటు అప్పటికే శివాలెత్తిపోయిన ఉన్న క్లాసెన్‌ను ఔట్ చేసి కేకేఆర్‌ను గెలిపించాడు. ఓవర్ తొలి బంతికే క్లాసెన్ సిక్సర్ బాదినప్పటికీ.. సన్‌రైజర్స్ మిగిలిన ఐదు బంతుల్లో 7 పరుగులు చేయలేక ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన రాణా 33 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. HARSHIT RANA, THE HERO OF KKR. SRH needed 13 in 6 balls - 6 on the first ball then 1,W,1,W,0 to win it for KKR. 🤯 pic.twitter.com/oXlzpAEJLV — Mufaddal Vohra (@mufaddal_vohra) March 23, 2024 ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సాల్ట్ (54; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రసెల్ (64; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగా.. ఛేదనలో క్లాసెన్ (63; 8 సిక్సర్లు) చెలరేగినప్పటికీ సన్‌రైజర్స్ 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సన్‌రైజర్స్ ఈ మ్యాచ్ చేజార్చుకున్నప్పటికీ.. క్లాసెన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అభిమానుల మనసుల్ని దోచుకున్నాడు. -
KKR Vs SRH: శభాష్ సుయాష్.. సన్‌రైజర్స్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు..!
ఐపీఎల్ 2024 సీజన్లో ప్రారంభమైన రెండో రోజు అదిరిపోయే మ్యాచ్‌ను అందించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య నిన్న (రాత్రి 7:30 గంటలకు) జరిగిన మ్యాచ్ ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగింది. భారీ లక్ష్య ఛేదనలో ఆఖరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సి ఉండగా.. హెన్రిచ్ క్లాసెన్ తొలి బంతికే సిక్సర్ బాది సన్‌రైజర్స్ శిబిరంలో గెలుపుపై ధీమా పెంచగా.. కేకేఆర్ ఆటగాళ్లు హర్షిత్ రాణా, సుయాష్ శర్మ ఆ ఆనందాన్ని వారికి ఎంతో సేపు నిలబడనీయలేదు. చివరి ఓవర్ బౌలింగ్ చేసిన రాణా వైవిధ్యమైన బంతులు సంధించి సన్‌రైజర్స్ గెలుపుకు అడ్డుకోగా.. సుయాష్ శర్మ కీలక దశలో (2 బంతుల్లో 5 పరుగులు) మెరుపు క్యాచ్ (క్లాసెన్) పట్టి ఆరెంజ్ ఆర్మీ చేతుల్లో నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు. ONE OF THE GREATEST CATCHES IN IPL HISTORY...!!! - Take a bow, Suyash Sharma. 🫡pic.twitter.com/CAq18gb8EO — Johns. (@CricCrazyJohns) March 23, 2024 సుయాష్ ఆ క్యాచ్ మిస్ చేసి ఉంటే బౌండరీ లభించి సన్‌రైజర్స్ సునాయాసంగా మ్యాచ్ గెలిచేది. ఒకవేళ ఆ క్యాచ్ డ్రాప్ అయ్యి, పరుగు రాకపోయినా అప్పటికే శివాలెత్తి ఉన్న క్లాసెన్ ఆఖరి బంతికి సిక్సర్ బాది సన్‌రైజర్స్‌ను గెలిపించేవాడు. సుయాష్ అందుకున్న ఈ అద్భుతమైన రన్నింగ్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. క్యాచెస్ విన్ మ్యాచెస్ అని ఇందుకే అంటారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సాల్ట్ (54), రసెల్ (64) అర్దసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఆఖర్లో రసెల్ 7 సిక్సర్లు, 3 బౌండరీలతో విరుచుకుపడి కేకేఆర్ 200 పరుగుల మార్కును దాటేందుకు దోహదపడ్డాడు. చివర్లో రమన్‌దీప్ సింగ్ (35; ఫోర్, 4 సిక్సర్లు), రింకూ సింగ్ (23; 3 ఫోర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. సన్‌రైజర్స్ బౌలర్లలో నటరాజన్ 3 వికెట్లు పడగొట్టగా.. మయాంక్ మార్కండే 2, కమిన్స్ ఓ వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. ఆదిలో తడబడినప్పటికీ గెలుపు అంచుల వరకు వచ్చి ఓటమిపాలైంది. క్లాసెన్ మెరుపు ఇన్నింగ్స్‌తో (29 బంతుల్లో 63; 8 సిక్సర్లు) మ్యాచ్ రూపురేఖల్నే మార్చేశాడు. అయితే గెలుపుకు 5 పరుగులు కావాల్సిన తరుణంలో అతడు ఔట్ కావడంతో మ్యాచ్ ఒక్కసారిగా కేకేఆర్పైపు మలుపు తిరిగింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసి లక్ష్యానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సన్‌రైజర్స్ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (32), అభిషేక్ శర్మ (32) ఓ మోస్తరు స్కోర్లతో శుభారంభాన్ని అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి జిడ్డు బ్యాటింగ్‌తో (20 బంతుల్లో 20) సన్‌రైజర్స్ ఓటమికి పరోక్ష కారకుడయ్యాడు. సన్‌రైజర్స్ ఈ మ్యాచ్ చేజార్చుకున్నప్పటికీ.. క్లాసెన్ తమ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అభిమానుల మనసుల్ని దోచుకున్నాడు. -
నటితో సీక్రెట్ మ్యారేజ్.. అప్పుడే అసలు కథ మొదలైంది!
సింగర్ హర్షిత్ సక్సేనా ఓ ఇంటివాడయ్యాడు. నటి సమోనికా శ్రీవాత్సవను పెళ్లి చేసుకున్నాడు. గత నెలలో గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్న వీరిద్దరూ తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. హర్షిత్ జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'సమోనికా, నేను ముంబైలో కలిశాం. మా మధ్య కేవలం పరిచయం మాత్రమే ఉంది. కానీ మా పేరెంట్స్ మమ్మల్ని ఒక జంటగా గుర్తించారు. సమోనికా తల్లి మా పేరెంట్స్‌తో మాట్లాడటంతో ఇదంతా మొదలైంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. మూడు రోజులపాటు ఎంతో ఘనంగా జరిగింది. పెళ్లికి రెండు రోజుల ముందే నిశ్చితార్థం చేసుకున్నాం. కేవలం అతి దగ్గరి బంధుమిత్రుల మధ్యే వివాహం జరిగింది అని వెల్లడించారు. వీరి పెళ్లి ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌ఘర్‌లో ఫిబ్రవరి 9న ఫైవ్‌స్టార్ హెటల్లో జరిగింది. ఈ పెళ్లి విషయాన్ని గుట్టుగా ఉంచడానికి గల కారణాన్ని వెల్లడిస్తూ.. నాకు వరుస షెడ్యూల్స్ ఉన్నాయి. పెళ్లయిపోయిన వెంటనే వరుస పెట్టి లైవ్ షోలు ఉన్నాయి. అందుకే పెళ్లి గురించి ఎవరికీ చెప్పలేదు. కానీ నా ఫ్రెండ్స్ కోసం రిసెప్షన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాను' అని వెల్లడించాడు. View this post on Instagram A post shared by Harshit Saxena (@harshitsaxena_official) -
ప్రాణం తీసిన వ్యవసాయ బావి
చేవెళ్ల: మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం రామన్నగూడలో ఆదివారం చోటు చేసుకుంది. రామన్నగూడ గ్రామానికి చెందిన నడిమొళ్ల శ్రీనివాస్, లత దంపతులకు ఒక కూతురు, మూడేళ్ల కుమారుడు హర్షిత్ ఉన్నారు. ఎప్పటిలాగే ఆదివారం మధ్యాహ్నం హర్షిత్ ఆడుకునేందుకు వెళ్లాడు. ఇంటి వెనుకే వ్యవసాయ పొలాలు ఉన్నాయి. పొలానికి వెళ్లే రోడ్డుకు సమీపంలో వ్యవసాయ బావి ఉంది. ఇటీవల కురిసిన వర్షాలతో బావి పూర్తిగా నిండింది. ఆడుకుంటానని వెళ్లిన బాలుడు ఎం తకీ ఇంట్లోకి రాకపోవడంతో ఆందోళన చెం దిన తల్లిదండ్రులు గ్రామస్తులతో కలిసి వ్యవసాయ బావిలో వెతికా రు. అప్పటివరకు కళ్ల ముందే ఆడు కుంటున్న కుమారుడు బావిలో శవ మై తేలడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు. -
అందమైన ప్రేమకథ
హర్షిత్, వంశీకృష్ణ పాండ్య, శ్రీపద్మ, మాధవి, బిశ్వజిత్ నా«థ్ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘నేను లేను’. ‘లాస్ట్ ఇన్ లవ్’ అనేది ఉపశీర్షిక. రామ్‌కుమార్ దర్శకత్వంలో ఓ.యస్.యం విజన్–దివ్యాషిక క్రియేషన్స్ పతాకాలపై సుక్రి నిర్మించిన ఈ సినిమా జూలై 12న విడుదల కానుంది. రామ్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘అందమైన ప్రేమకథతో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. సన్నివేశాలు ఆద్యంతం ప్రేక్షకులను ఉత్కంఠపరుస్తాయి. ఈ సినిమా ట్రైలర్‌ని ఇప్పటి వరకూ కోటి మంది చూశారు. ట్రైలర్‌లాగే సినిమా కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ‘‘ఇండియన్ సినిమా స్క్రీన్‌పై ఇప్పటివరకు రాని సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమా ఇది’’ అని సుక్రి అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఆశ్రిత్, కెమెరా: ఎ. శ్రీకాంత్, నిర్వాహణ: సురేష్ కూరపాటి, సహనిర్మాత: యషిక. -
ప్రేమలో మునిగిపోయా
హర్షిత్, వంశీకృష్ణ పాండ్య, శ్రీపద్మ, మాధవి, బిశ్వజిత్‌నాధ్, రుద్రప్రకాశ్, వేల్పుల సూరి, యుగంధర్ ముఖ్య పాత్రల్లో రామ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నేను లేను’. ‘లాస్ట్ ఇన్ లవ్’ అనేది ఉపశీర్షిక. ఓ.యస్.యం విజన్, దివ్యాషిక క్రియేషన్స్ పతాకంపై సుక్రి కుమార్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు. రామ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘అందమైన ప్రేమకథతో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ రక్తి కట్టిస్తుంది. ఇప్పటి వరకూ ఎవరూ తీయని సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న చిత్రం ఇదే అని గర్వంగా ఫీలవుతున్నా. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి అనూహ్య స్పందన వచ్చింది. కొత్త నటీనటులతో సినిమా తీసినా థ్రిల్లింగ్ కాన్సెప్ట్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఆశ్రిత్, సహనిర్మాత: యషిక. -
రజతాలు నెగ్గిన హర్షిత, హర్ష
హైదరాబాద్: ఆసియా జూనియర్ అండర్–20 చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జి.హర్షిత, హైదరాబాద్ కుర్రాడు హర్ష భరతకోటి బ్లిట్జ్ విభాగంలో రజత పతకాలు సాధించారు. ఇరాన్‌లోని షిరాజ్ పట్టణంలో బుధవారం జరిగిన బాలికల బ్లిట్జ్ ఈవెంట్లో హర్షిత నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత ఏడు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఐదు గేముల్లో గెలిచిన హర్షిత, మిగతా నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకుంది. అలీనసాబ్ మొబీనా (ఇరాన్–8 పాయింట్లు) స్వర్ణం నెగ్గగా... హŸతామి ముత్రిబా (తజికిస్తాన్–6.5 పాయింట్లు) కాంస్యం సాధించింది. ఓపెన్ విభాగంలో హర్ష 7.5 పాయింట్లు సాధించి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఏడు గేముల్లో గెలిచిన హర్ష, ఒక గేమ్‌లో ఓడి, మరో గేమ్‌ను ‘డ్రా’గా ముగించాడు. -
నిరాశ పరిచిన బాక్సర్లు
కామన్ వెల్త్ యూత్ గేమ్స్ లో మూడో రోజు భారత్ కు మిశ్రమ ఫలితాలు లభించాయి. బాక్సింగ్ లో గౌరవ్ సోలంకి మినహా.. మన బాక్సర్లంతా.. ఇంటిదారి పట్టారు. 52 కిలోల విభాగంలో గౌరవ్ సోలంకి.. ఫైనల్ చేరుకున్నాడు. సోలంకి సెమీఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లండ్ కి చెందిన బ్రాండన్ ను 3-0 తేడాతో ఓడించాడు. దీంతో సోలంకి కనీసం రజతపతకం పొందే అవకాశం ఉంది. ఇక ఇదే విభాగంలో 49కిలోల కేటగిరీలో భీమ్ చంద్ సింగ్, 64 కిలోల విభాగంలో ప్రజ్ఞాన్ చౌహాన్ లు సెమీస్ లో ఓడి క్యాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. స్క్వాష్ డబుల్స్ లో భారత్ జంట సెమీ ఫైనల్ కు చేరింది. పూల్ సీలో భాగంగా నార్ధన్ ఐర్లాండ్ జంటపై ..భారత్ జంట సెంధిల్ కుమార్, హర్షిత్ లు 11-0, 11-2 స్కోర్స్ తేడాతో సునాయాస విజయాన్ని సాధించారు. భారత్ తర్వాత మ్యాచ్ పాకిస్తాన్ తో ఆడనుంది. -
ఫైనల్లో హర్షిత్
జింఖానా, న్యూస్‌లైన్: ఏఐటీఏ టాలెంట్ సిరీస్ టెన్నిస్ టోర్నీ బాలుర అండర్-12 విభాగంలో ఆంధ్రప్రదేశ్ కుర్రాడు హర్షిత్ ఫైనల్లోకి ప్రవేశించాడు. బోయిన్‌పల్లిలో సూర్యా టెన్నిస్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో హర్షిత్ 6-2, 6-0తో అనురాగ్ అగర్వాల్ (పశ్చిమ బెంగాల్)పై విజయం సాధించాడు. తనతో పాటు ప్రీతమ్ (ఆంధ్రప్రదేశ్) 6-2, 7-5తో రుచిత్ గౌడ్ (ఆంధ్రప్రదేశ్)పై నెగ్గాడు. బాలిక ల అండర్-12 విభాగంలో సంస్కృతి 6-4, 6-1తో అవంతికా రెడ్డి (ఆంధ్రప్రదేశ్)పై, సాహితి రెడ్డి (ఆంధ్రప్రదేశ్) 6-3, 5-7, 7-6తో సమృతి భాసిన్ (ఆంధ్రప్రదేశ్)పై గెలిచారు. బాలుర అండర్-14 విభాగంలో అనికేత్ (ఆంధ్రప్రదేశ్) 0-6, 6-4, 6-3తో శ్రీహర్ష (ఆంధ్రప్రదేశ్)పై, సాయి కార్తీక్ (ఆంధ్రప్రదేశ్) 6-2, 6-0తో హర్షిత్ (ఆంధ్రప్రదేశ్)పై గెలుపొందారు. బాలికల అండర్-14 విభాగంలో ఉమర్ మిష్గాన్ (ఆంధ్రప్రదేశ్) 3-6, 6-4, 6-4తో జువేరా ఫాతిమ (ఆంధ్రప్రదేశ్)ను, శ్రావ్య శివాని (ఆంధ్రప్రదేశ్) 6-1, 6-1తో శ్రేయ (ఆంధ్రప్రదేశ్)ను ఓడించి ఫైనల్స్‌కు అర్హత సాధించారు.