అందమైన ప్రేమకథ | Nenu Lenu Telugu Movie Trailer views one crore | Sakshi
Sakshi News home page

అందమైన ప్రేమకథ

Published Sun, Jun 30 2019 6:42 AM | Last Updated on Sun, Jun 30 2019 6:42 AM

Nenu Lenu Telugu Movie Trailer views one crore - Sakshi

హర్షిత్

హర్షిత్, వంశీకృష్ణ పాండ్య, శ్రీపద్మ, మాధవి, బిశ్వజిత్‌ నా«థ్‌ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘నేను లేను’. ‘లాస్ట్‌ ఇన్‌ లవ్‌’ అనేది ఉపశీర్షిక. రామ్‌కుమార్‌ దర్శకత్వంలో ఓ.యస్‌.యం విజన్‌–దివ్యాషిక క్రియేషన్స్‌ పతాకాలపై సుక్రి నిర్మించిన ఈ సినిమా జూలై 12న విడుదల కానుంది. రామ్‌కుమార్‌ మాట్లాడుతూ– ‘‘అందమైన ప్రేమకథతో తెరకెక్కిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ చిత్రమిది.

సన్నివేశాలు ఆద్యంతం ప్రేక్షకులను ఉత్కంఠపరుస్తాయి. ఈ సినిమా ట్రైలర్‌ని ఇప్పటి వరకూ కోటి మంది చూశారు. ట్రైలర్‌లాగే సినిమా కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ‘‘ఇండియన్‌ సినిమా స్క్రీన్‌పై ఇప్పటివరకు రాని సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమా ఇది’’ అని సుక్రి అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఆశ్రిత్, కెమెరా: ఎ. శ్రీకాంత్, నిర్వాహణ: సురేష్‌ కూరపాటి, సహనిర్మాత: యషిక. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement