ప్రేమలో మునిగిపోయా | Nenu Lenu Movie Official Release Trailer | Sakshi
Sakshi News home page

ప్రేమలో మునిగిపోయా

Published Sun, Dec 30 2018 4:25 AM | Last Updated on Sun, Dec 30 2018 4:25 AM

Nenu Lenu Movie Official Release Trailer - Sakshi

హర్షిత్

హర్షిత్, వంశీకృష్ణ పాండ్య, శ్రీపద్మ, మాధవి, బిశ్వజిత్‌నాధ్, రుద్రప్రకాశ్, వేల్పుల సూరి, యుగంధర్‌ ముఖ్య పాత్రల్లో రామ్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నేను లేను’. ‘లాస్ట్‌ ఇన్‌ లవ్‌’ అనేది ఉపశీర్షిక. ఓ.యస్‌.యం విజన్, దివ్యాషిక క్రియేషన్స్‌ పతాకంపై సుక్రి కుమార్‌ నిర్మించిన ఈ సినిమా  ఫిబ్రవరి 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. రామ్‌ కుమార్‌ మాట్లాడుతూ– ‘‘అందమైన ప్రేమకథతో తెరకెక్కిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ఇది. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ రక్తి కట్టిస్తుంది.  ఇప్పటి వరకూ ఎవరూ తీయని సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న చిత్రం ఇదే అని గర్వంగా ఫీలవుతున్నా. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి అనూహ్య స్పందన వచ్చింది. కొత్త నటీనటులతో సినిమా తీసినా థ్రిల్లింగ్‌ కాన్సెప్ట్‌ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఆశ్రిత్, సహనిర్మాత: యషిక.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement