ప్రాణం తీసిన వ్యవసాయ బావి | Three Year Old Boy Fell Into Farm Well And Passed Away In Rangareddy District | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన వ్యవసాయ బావి

Published Mon, Sep 13 2021 3:04 AM | Last Updated on Mon, Sep 13 2021 9:09 AM

Three Year Old Boy Fell Into Farm Well And Passed Away In Rangareddy District - Sakshi

హర్షిత్‌ (ఫైల్‌) 

చేవెళ్ల: మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం రామన్నగూడలో ఆదివారం చోటు చేసుకుంది. రామన్నగూడ గ్రామానికి చెందిన నడిమొళ్ల శ్రీనివాస్, లత దంపతులకు ఒక కూతురు, మూడేళ్ల కుమారుడు హర్షిత్‌ ఉన్నారు. ఎప్పటిలాగే ఆదివారం మధ్యాహ్నం హర్షిత్‌ ఆడుకునేందుకు వెళ్లాడు. ఇంటి వెనుకే వ్యవసాయ పొలాలు ఉన్నాయి.

పొలానికి వెళ్లే రోడ్డుకు సమీపంలో వ్యవసాయ బావి ఉంది. ఇటీవల కురిసిన వర్షాలతో బావి పూర్తిగా నిండింది. ఆడుకుంటానని వెళ్లిన బాలుడు ఎం తకీ ఇంట్లోకి రాకపోవడంతో ఆందోళన చెం దిన తల్లిదండ్రులు గ్రామస్తులతో కలిసి వ్యవసాయ బావిలో వెతికా రు. అప్పటివరకు కళ్ల ముందే ఆడు కుంటున్న కుమారుడు బావిలో శవ మై తేలడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement