Gaurav Solanki
-
గౌరవ్, ఆశిష్ శుభారంభం
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా ఒలింపిక్ బాక్సింగ్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్లు గౌరవ్ సోలంకి, ఆశిష్ కుమార్ శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన పురుషుల 57 కేజీల తొలి రౌండ్ బౌట్లో గౌరవ్ 5–0తో అకైల్బెక్ ఎసెన్బెక్ ఊలు (కిర్గిస్తాన్)పై, 75 కేజీల విభాగంలో ఆసియా చాంపియన్‌షిప్ రజత పతక విజేత ఆశిష్ 5–0తో కాన్ చియా వీ (చైనీస్ తైపీ)పై గెలుపొంది ప్రిక్వార్టర్స్ చేరారు. ప్రిక్వార్టర్స్‌లో టాప్ సీడ్ మిరాజిజ్‌బెక్ (ఉజ్బెకిస్తాన్)తో గౌరవ్; ఒముర్బెక్ బెక్జిగిత్ ఊలు (కిర్గిస్తాన్)తో ఆశిష్ తలపడతారు. మహిళల విభాగంలో లవ్లీనా (69 కేజీలు), పూజా రాణి (75 కేజీలు)... పురుషుల విభాగంలో సతీశ్ కుమార్ (+91 కేజీలు) ఒలింపిక్ బెర్త్‌లకు విజయం దూరంలోనే ఉన్నారు. ఈ విభాగాల్లో ఎంట్రీల సంఖ్య తక్కువగా ఉండటం... నాలుగేసి బెర్త్‌లు ఉండటంతో భారత బాక్సర్లు ఓ విజయం సాధిస్తే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. -
గౌరవ్ కు వెండి పతకం
అపియా: కామన్వెల్త్ యూత్ గేమ్స్ లో భారత్ బాక్సర్ గౌరవ్ సోలంకి- వెండి పతకం గెల్చుకున్నాడు. 52 కిలోల విభాగంలో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా బాక్సర్ జాక్ బొవెన్ చేతిలో 0-3 తేడాతో పరాజయం పాలయ్యాడు. దీంతో అతడికి వెండి పతకం దక్కింది. ఈ టోర్నిలో భారత్ తరపున గౌరవ్ సోలంకి అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. ఇదే విభాగంలో 49 కిలోల కేటగిరిలో భీంచంద్ సింగ్, 64 కిలోల విభాగంలో ప్రజ్ఞాన్ చౌహాన్ సెమీస్ లో ఓడి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. బాక్సింగ్ లో భారత్ కు మొత్తం మూడు పతకాలు దక్కాయి. -
నిరాశ పరిచిన బాక్సర్లు
కామన్ వెల్త్ యూత్ గేమ్స్ లో మూడో రోజు భారత్ కు మిశ్రమ ఫలితాలు లభించాయి. బాక్సింగ్ లో గౌరవ్ సోలంకి మినహా.. మన బాక్సర్లంతా.. ఇంటిదారి పట్టారు. 52 కిలోల విభాగంలో గౌరవ్ సోలంకి.. ఫైనల్ చేరుకున్నాడు. సోలంకి సెమీఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లండ్ కి చెందిన బ్రాండన్ ను 3-0 తేడాతో ఓడించాడు. దీంతో సోలంకి కనీసం రజతపతకం పొందే అవకాశం ఉంది. ఇక ఇదే విభాగంలో 49కిలోల కేటగిరీలో భీమ్ చంద్ సింగ్, 64 కిలోల విభాగంలో ప్రజ్ఞాన్ చౌహాన్ లు సెమీస్ లో ఓడి క్యాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. స్క్వాష్ డబుల్స్ లో భారత్ జంట సెమీ ఫైనల్ కు చేరింది. పూల్ సీలో భాగంగా నార్ధన్ ఐర్లాండ్ జంటపై ..భారత్ జంట సెంధిల్ కుమార్, హర్షిత్ లు 11-0, 11-2 స్కోర్స్ తేడాతో సునాయాస విజయాన్ని సాధించారు. భారత్ తర్వాత మ్యాచ్ పాకిస్తాన్ తో ఆడనుంది. -
సెమీస్‌లో సోలంకి ఓటమి
యూత్ ఒలింపిక్స్ బాక్సింగ్ నాన్జింగ్: యూత్ ఒలింపిక్స్ పురుషుల బాక్సింగ్‌లో గౌరవ్ సోలంకి సెమీస్‌లో చిత్తయ్యాడు. ఆదివారం నాన్జింగ్లో జరిగిన 52 కేజీల ఫ్లయ్ వెయిట్ పోరులో సోలంకి 0-3 తేడాతో పింగ్ లూ(చైనా) చేతిలో ఓటమి పాలయ్యాడు. సెమీఫైనల్లో ఏ దశలోనూ ప్రత్యర్థితో పోటీపడలేకపోయిన సోలంకి సోమవారం జరిగే కాంస్య పతక పోరులో మహ్మద్ అలీ (గ్రేట్ బ్రిటన్)తో తలపడనున్నాడు. ఇక ఇతర క్రీడాంశాల్లో భారత్‌కు చెందిన క్రీడాకారులు నిరాశపరిచారు. పురుషుల 1500 మీటర్ల పరుగులో అజయ్ కుమార్ వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన నమోదు చేసినప్పటికీ ‘ఎ’ ఫైనల్లో ఐదో స్థానంలో నిలిచాడు. రేసును అజయ్ 3 నిమిషాల 46.92 సెకన్లలో పూర్తి చేసినా ఆఫ్రికా రన్నర్ల ముందు నిలవలేకపోయాడు. మహిళల జావెలిన్ త్రోలో పుష్పా జకార్ నేడు ఫైనల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. శుక్రవారం జరిగిన క్వాలిఫికేషన్లో పుష్ప వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శనను నమోదు చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి రెండవ యూత్ ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటిదాకా ఒకే ఒక రజత పతకం సాధించింది. -
గౌరవ్‌కు చివరి అవకాశం
యూత్ ఒలింపిక్స్ అర్హత టోర్నీ న్యూఢిల్లీ: యూత్ ఒలింపిక్ క్రీడలకు అర్హత పొందేందుకు భారత యువ బాక్సర్ గౌరవ్ సోలంకికి మరో అవకాశం మిగిలి ఉంది. బల్గేరియాలోని సోఫియాలో జరుగుతున్న ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌ను యూత్ ఒలింపిక్ క్రీడల అర్హత టోర్నీగా పరిగణిస్తున్నారు. ఈ మెగా ఈవెంట్లో గౌరవ్ సోలంకి 52 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. సెమీఫైనల్‌కు చేరుకున్న నలుగురు బాక్సర్లు యూత్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత పొందుతారు. క్వార్టర్స్‌లో ఓడిన మిగతా నలుగురి నుంచి ఇద్దరికి యూత్ ఒలింపిక్స్‌కు అర్హత పొందే అవకాశం లభిస్తుంది. గౌరవ్ సోలంకి మిగిలిన ఒక బెర్త్ కోసం కార్లోస్ సిల్వాతో తలపడతాడు. ఈ బౌట్లో నెగ్గినవారు యూత్ ఒలింపిక్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంటారు. నేడు శ్యామ్ సెమీఫైనల్ ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ బుధవారం కీలకపోరులో బరిలోకి దిగనున్నాడు. కజకిస్థాన్ బాక్సర్ శాల్కర్ అఖిన్బేతో శ్యామ్ సెమీఫైనల్లో పోటీపడనున్నాడు. ఒకవేళ సెమీస్‌లో శ్యామ్ ఓడితే కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.