
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా ఒలింపిక్ బాక్సింగ్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్లు గౌరవ్ సోలంకి, ఆశిష్ కుమార్ శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన పురుషుల 57 కేజీల తొలి రౌండ్ బౌట్‌లో గౌరవ్ 5–0తో అకైల్‌బెక్ ఎసెన్‌బెక్ ఊలు (కిర్గిస్తాన్)పై, 75 కేజీల విభాగంలో ఆసియా చాంపియన్‌షిప్ రజత పతక విజేత ఆశిష్ 5–0తో కాన్ చియా వీ (చైనీస్ తైపీ)పై గెలుపొంది ప్రిక్వార్టర్స్ చేరారు. ప్రిక్వార్టర్స్‌లో టాప్ సీడ్ మిరాజిజ్‌బెక్ (ఉజ్బెకిస్తాన్)తో గౌరవ్; ఒముర్‌బెక్ బెక్‌జిగిత్ ఊలు (కిర్గిస్తాన్)తో ఆశిష్ తలపడతారు. మహిళల విభాగంలో లవ్లీనా (69 కేజీలు), పూజా రాణి (75 కేజీలు)... పురుషుల విభాగంలో సతీశ్ కుమార్ (+91 కేజీలు) ఒలింపిక్ బెర్త్‌లకు విజయం దూరంలోనే ఉన్నారు. ఈ విభాగాల్లో ఎంట్రీల సంఖ్య తక్కువగా ఉండటం... నాలుగేసి బెర్త్‌లు ఉండటంతో భారత బాక్సర్లు ఓ విజయం సాధిస్తే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment