Asia Boxing Championship
-
స్టార్ బాక్సర్‌కు కరోనా.. టోర్నీ నుంచి ఔట్!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నుంచి ఇంకా కోలుకోకపోవడంతో భారత మహిళా స్టార్ బాక్సర్ సిమ్రన్‌జిత్ (60 కేజీలు) ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు దూరమైంది. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన సిమ్రన్ ఈనెల 21 నుంచి జూన్ 1 వరకు దుబాయ్‌లో జరిగే ఆసియా చాంపియన్‌షిప్‌కు పంపించడంలేదని భారత బాక్సింగ్ సమాఖ్య తెలిపింది. పురుషుల విభాగంలో కరోనా నుంచి కోలుకుంటున్న ఆశిష్ (75 కేజీలు) కూడా ఆసియా చాంపియన్‌షిప్‌లో పాల్గొనేది అనుమానంగా ఉంది. చదవండి: ZIM Vs PAK: రెచ్చిపోయిన హసన్ అలీ, పాక్ ఘనవిజయం -
పసిడి కోసం వికాస్, సిమ్రన్ పోరు
అమ్మాన్ (జోర్డాన్): టోక్యో ఒలింపిక్స్ ఆసియా క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నమెంట్లో ఇద్దరు భారత బాక్సర్లు ఫైనల్ చేరగా... మరో ఆరుగురు సెమీస్‌లో ఓడి కాంస్య పతకాలతో ముగించారు. పురుషుల 69 కేజీల విభాగంలో వికాస్ కృషన్... మహిళల 60 కేజీల విభాగంలో సిమ్రన్‌జిత్ కౌర్ ఫైనల్లోకి ప్రవేశించారు. సెమీస్‌లో వికాస్ 3–2 తేడాతో ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత అబ్లైఖన్ జుసుపొవ్ (కజకిస్తాన్)పై విజయం సాధించాడు. బౌట్లో ఎడమ కంటి దిగువభాగంలో గాయమైనా... పట్టుదల ప్రదర్శించిన వికాస్ తుది పోరుకు అర్హత సాధించాడు. ఫైనల్లో అతను ఈషా హుస్సేన్ (జోర్డాన్)తో తలపడతాడు. ఒకవేళ వికాస్ కంటి గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే అతనికి ఫైనల్లో పోటీపడే అవకాశం ఇవ్వరు. సిమ్రన్‌జిత్‌కు సెమీస్‌లో విజయం సులువుగానే దక్కింది. సిమ్రన్‌జిత్ 4–1తో ఆసియా చాంపియన్‌షిప్ రజత పతక విజేత షి యి వు (చైనీస్ తైపీ)ని ఓడించింది. ఫైనల్లో సిమ్రన్ రెండుసార్లు ఆసియా విజేతగా నిలిచిన ఓ యెన్ జీ (దక్షిణ కొరియా)ను ఎదుర్కొంటుంది. పురుషుల విభాగంలో అమిత్ పంఘాల్ (52 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు)... మహిళల విభాగంలో మేరీకోమ్ (51 కేజీలు), లవ్లీనా బొర్గొహైన్ (69 కేజీలు), పూజా రాణి (75 కేజీలు) సెమీస్‌లో ఓటమి పాలయ్యారు. అమిత్ 2–3తో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత జియాంగ్వాన్ హు (చైనా) చేతిలో, ఆశిష్ 1–4తో మార్సియల్ ఇముర్ (ఫిలిప్పీన్) చేతిలో... సతీశ్ 0–5తో బఖోదిర్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో... మేరీకోమ్ 2–3తో యువాన్ చాంగ్ (చైనా) చేతిలో, లవ్లీనా 0–5తో హోంగ్ గు (చైనా) చేతిలో, పూజ రాణి 0–5తో ఖియాన్ లి (చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు. ఈ టోర్నీ ద్వారా ఇప్పటికే ఎమిమిది మంది భారత బాక్సర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. పురుషుల 81 కేజీల విభాగంలో భారత బాక్సర్ సచిన్ కుమార్ ఫైనల్ బాక్స్ ఆఫ్ బౌట్‌కు అర్హత సాధించాడు. నేడు జరిగే ఫైనల్ బాక్స్ ఆఫ్ బౌట్లో షబ్బోస్ నెగ్మతులోయెవ్ (తజికిస్తాన్)పై సచిన్ గెలిస్తే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందుతాడు. -
భారత్ ‘పంచ్’ పవర్
అమ్మాన్ (జోర్డాన్): క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమిస్తూ భారత బాక్సర్లు వికాస్ కృషన్ (69 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు), సతీశ్ కుమార్ యాదవ్ (ప్లస్ 91 కేజీలు), పూజా రాణి (75 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్ (69 కేజీలు) టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ఇక్కడ జరుగుతున్న ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీలో పురుషుల విభాగంలో వికాస్, ఆశిష్, సతీశ్... మహిళల విభాగంలో పూజా రాణి, లవ్లీనా సెమీఫైనల్ చేరుకొని ‘టోక్యో’ బెర్త్‌లను ఖాయం చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్స్‌లో వికాస్ 3–2తో సెవోన్‌రెట్స్ ఒకజవా (జపాన్)ను ఓడించగా... ఆశిష్ 5–0తో ముస్కితా (ఇండోనేసియా)పై... సతీశ్ 5–0తో దైవీ ఒట్కోన్‌బాయెర్ (మంగోలియా)పై గెలిచారు. పూజా రాణి 5–0తో పోర్నిపా చుటీ (థాయ్‌లాండ్)పై, లవ్లీనా 5–0తో మెలియెవా (ఉజ్బెకిస్తాన్)పై నెగ్గారు. పురుషుల 81 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో సచిన్ కుమార్ చైనా బాక్సర్ డాక్సియాంగ్ చెన్ చేతిలో ఓడిపోయాడు. విజేందర్ తర్వాత భారత్ తరఫున మూడోసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన రెండో బాక్సర్‌గా వికాస్ కృషన్ గుర్తింపు పొందగా... ఆశిష్, సతీశ్, పూజా రాణి, లవ్లీనా తొలిసారి ఒలింపిక్స్ బరిలో నిలువనున్నారు. -
క్వార్టర్స్‌లో మేరీకోమ్
అమ్మాన్ (జోర్డాన్): టోక్యో ఒలింపిక్స్ ఆసియా బాక్సింగ్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి బాక్సర్లు మేరీకోమ్ (51 కేజీలు), అమిత్ పంఘాల్ (52 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్స్‌లో మేరీకోమ్ 5–0తో టాస్మీన్ బెన్నీ (న్యూజిలాండ్)ను చిత్తుగా ఓడించగా... అమిత్ 3–2తో ఎన్క్మనాదక్ ఖర్కు (మంగోలియా)పై కష్టపడి గెలిచాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్లో భారత బాక్సర్ గౌరవ్ సోలంకి (57 కేజీలు) 1–4తో టాప్ సీడ్ మిరాజిజ్‌బెక్ మిర్జాఖలీలోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. -
క్వార్టర్ ఫైనల్లో మనీశ్, ఆశిష్, సచిన్
అమ్మాన్ (జోర్డాన్): టోక్యో ఒలింపిక్స్ ఆసియా క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నమెంట్లో గురువారం బరిలోకి దిగిన ముగ్గురు భారత బాక్సర్లు అదరగొట్టారు. మనీశ్ కౌశిక్ (63 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు), సచిన్ కుమార్ (81 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు విజయం దూరంలో నిలిచారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మనీశ్ 5–0తో చు ఎన్ లాయ్ (చైనీస్ తైపీ)పై, ఆశిష్ 5–0తో ఒమర్బెక్ బెక్జిగిట్ యులు (కిర్గిస్తాన్)పై నెగ్గగా... డీ ఇవోపో (సమోవా)ను సచిన్ ఓడించాడు. -
గౌరవ్, ఆశిష్ శుభారంభం
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా ఒలింపిక్ బాక్సింగ్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్లు గౌరవ్ సోలంకి, ఆశిష్ కుమార్ శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన పురుషుల 57 కేజీల తొలి రౌండ్ బౌట్లో గౌరవ్ 5–0తో అకైల్బెక్ ఎసెన్బెక్ ఊలు (కిర్గిస్తాన్)పై, 75 కేజీల విభాగంలో ఆసియా చాంపియన్‌షిప్ రజత పతక విజేత ఆశిష్ 5–0తో కాన్ చియా వీ (చైనీస్ తైపీ)పై గెలుపొంది ప్రిక్వార్టర్స్ చేరారు. ప్రిక్వార్టర్స్‌లో టాప్ సీడ్ మిరాజిజ్‌బెక్ (ఉజ్బెకిస్తాన్)తో గౌరవ్; ఒముర్బెక్ బెక్జిగిత్ ఊలు (కిర్గిస్తాన్)తో ఆశిష్ తలపడతారు. మహిళల విభాగంలో లవ్లీనా (69 కేజీలు), పూజా రాణి (75 కేజీలు)... పురుషుల విభాగంలో సతీశ్ కుమార్ (+91 కేజీలు) ఒలింపిక్ బెర్త్‌లకు విజయం దూరంలోనే ఉన్నారు. ఈ విభాగాల్లో ఎంట్రీల సంఖ్య తక్కువగా ఉండటం... నాలుగేసి బెర్త్‌లు ఉండటంతో భారత బాక్సర్లు ఓ విజయం సాధిస్తే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. -
ఆసియా బాక్సింగ్ ‘రాణి’ మేరీకోమ్
హో చి మిన్ సిటీ (వియత్నాం): ఆసియా సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ ఫైనల్లో విజయం సాధించి భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. గతంలో ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన 34 ఏళ్ల మేరీకోమ్ బుధవారం ఇక్కడ జరిగిన ఫైనల్లో కిమ్ హ్యాంగ్ మి (ఉత్తర కొరియా)పై 5-0తో ఏక్షపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా, 48 కేజీల విభాగంలో మేరీకోమ్‌కి ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. ఈ చాంపియన్‌షిప్‌లో ఓవరాల్‌గా ఆరుసార్లు ఫైనల్స్‌కు చేరుకున్న మేరీకోమ్ ఐదు స్వర్ణాలు సాధించగా, ఓ సారి రజతంతో సరిపెట్టుకుంది. ఒలింపిక్స్ కోసమని గతంలో 51 కేజీల విభాగానికి మారిన మేరీకోమ్ ఇటీవలే తన పాత వెయిట్ కేటగిరీ 48 కేజీలకు మారిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో 5-0తో సుబాసా కొమురా (జపాన్)పై ఏకపక్ష విజయాన్ని సాధించిన మేరీకోమ్.. నేటి ఫైనల్లోనూ అదేజోరు ప్రదర్శించింది. ఫలితంగా బుధవారం ప్రత్యర్థి కిమ్ హ్యాంగ్ మిని తన పంచులతో ఓ ఆటాడుకున్న మేరీకోమ్ సగర్వంగా ఈ చాంపియన్‌షిప్‌లో ఐదోసారి స్వర్ణాన్ని ముద్దాడింది. -
మహిళల బాక్సింగ్ కోచ్ రాజీనామా
పదవి నుంచి వైదొలిగిన స్టెఫాన్ కాటలోర్డా న్యూఢిల్లీ: ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌కు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. భారత మహిళల జట్టుకు తొలి విదేశీ కోచ్‌గా నియమితులైన స్టెఫాన్ కాటలోర్డా నెల తిరిగేలోపే రాజీనామా చేశారు. భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ)కు ప్రొఫెషనలిజం లేదని తీవ్రంగా ఆరోపిస్తూ పదవి నుంచి వైదొలిగారు. బీఎఫ్ఐ తనకు సరిగా వేతనం చెల్లించలేదని, తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని ఫ్రాన్స్‌కు చెందిన 41 ఏళ్ల స్టెఫాన్ ఆవేదన వెళ్లగక్కారు. రాజీనామా లేఖలో ఆయన బీఎఫ్ఐను ఘాటుగా విమర్శించారు. ‘చాలా ఓపికగా ఎదురు చూశాను. నా విజ్ఞప్తులను తెలుపుతూ నేను చేసిన మెయిల్స్‌కు ఇంకా జవాబు రాలేదు. ఆగస్టుకు సంబంధించిన పూర్తి వేతనాన్ని కూడా అందుకోలేదు. బీఎఫ్ఐ నాకిచ్చిన మాటకు కట్టుబడలేదు. జవాబుదారీతనం, ప్రొఫెషనలిజం లేని వారితో పనిచేయలేను. తిరిగి మళ్లీ ఇండియాకు రాను. ఇక్కడి విధానంపై నాకు నమ్మకం లేదు’ అని స్టెఫాన్ ఆగ్రహం వెలిబుచ్చారు. మరోవైపు సమాఖ్యకు సంబంధించిన అధికారి మాట్లాడుతూ స్టెఫాన్కు మళ్లీ తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. పాన్ కార్డ్ పొందడంలో ఆలస్యం కారణంగా వేతనం ఆలస్యమైందని చెప్పారు. అయినప్పటికీ 70 శాతం వేతనాన్ని చెల్లించామని, మిగతా డిమాండ్లపై కూడా సానుకూలంగానే స్పందించామని అన్నారు. మరో వైపు స్టెఫాన్ నిర్ణయంతో షాక్‌కు గురయ్యానని ఐదుసార్లు ప్రపంచ చాంపియన్, భారత అగ్రశ్రేణి బాక్సర్ మేరీకోమ్ అన్నారు. అతనితో మాట్లాడి తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాల్సిందిగా కోరతానని ఆమె పేర్కొన్నారు. ‘ఇది చాలా నిరాశ కలిగించే అంశం. భారత బాక్సింగ్‌కు అతని అవసరం ఎంతో ఉంది. అతని అవసరాలు చూసుకోవడం మన బాధ్యత. నేను వ్యక్తిగతంగా అతనితో మాట్లాడతా. తిరిగి కోచ్‌గా పనిచేసేలా ఒప్పించేందుకు ప్రయత్నిస్తా’ అని ఆమె అన్నారు. -
ఫైనల్లో శివ, సుమీత్
వికాస్‌కు కాంస్యం ∙ ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్ తాష్కెంట్: ఉజ్బెకిస్తాన్‌లో జరుగుతున్న ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత ప్లేయర్లు శివ థాపా, సుమీత్ సాంగ్వాన్‌లు ఫైనల్లోకి ప్రవేశించారు. 60 కేజీల విభాగంలో పోటీపడుతున్న శివ.. శుక్రవారం జరిగిన సెమీస్‌లో ఒలింపిక్ కాంస్యపతక విజేత, టాప్ సీడ్ దొర్యమ్బుగ్ ఒట్గొందలాయ్ (మంగోలియా)పై సంచలన విజయం సాధించాడు. మరోవైపు 91 కేజీల విభాగంలో పోటీపడుతోన్న సుమీత్.. రెండోసీడ్ తాజిక్ జఖోన్ కుర్బొనోవ్ (తజకిస్తాన్)పై గెలుపొందాడు. ఫైనల్లో స్థానికప్లేయర్ ఎల్నూర్ అబ్దురైమోవ్తో శివ తలపడనున్నాడు. మరోవైపు 75 కేజీల విభాగంలో పోటీపడుతున్న వికాస్ కృషన్ మ్యాచ్‌కు హాజరు కాకపోవడంతో అతని ప్రత్యర్థి నాలుగోసీడ్, లీ డొంగ్యూన్ (దక్షిణ కొరియా)ను విజేతగా ప్రకటించారు. -
మన పంచ్ అదిరింది!
►సెమీస్‌లో శివ, వికాస్, సుమీత్, అమిత్ ►నాలుగు పతకాలు ఖాయం ►ప్రపంచ చాంపియన్‌షిప్‌కూ అర్హత తాష్కెంట్ (ఉజ్బెకిస్తాన్): ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు తమ పంచ్ పవర్‌ను చాటుకున్నారు. వికాస్ కృషన్ (75 కేజీలు), శివ థాపా (60 కేజీలు), అమిత్ ఫంగల్ (49 కేజీలు), సుమీత్ సాంగ్వాన్ (91 కేజీలు) సెమీఫైనల్‌కు చేరుకున్నారు. ఈ ప్రదర్శనతో నలుగురు భారత బాక్సర్లకు కనీసం కాంస్య పతకాలు ఖాయమయ్యాయి. అంతేకాకుండా ఈ ఏడాది ఆగస్టు–సెప్టెంబరులో జర్మనీలో జరిగే ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌కు కూడా అర్హత సాధించారు. మరో నలుగురు భారత బాక్సర్లు గౌరవ్ బిధురి (56 కేజీలు), మనోజ్ కుమార్ (69 కేజీలు), కవీందర్ సింగ్ బిష్త్ (52 కేజీలు), మనీష్ పన్వర్ (81 కేజీలు) క్వార్టర్ ఫైనల్‌ను దాటలేకపోయారు. జాంగ్ (చైనా) చేతిలో గౌరవ్, లతిపోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో కవీందర్, బ్యామ్బా (మంగోలియా) చేతిలో మనోజ్, నుర్యదైవ్ (తుర్క్మెనిస్తాన్) చేతిలో మనీష్ ఓడిపోయారు. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో అమిత్ 5–0తో కార్నెలిస్ (ఇండోనేసియా)పై... శివ థాపా 5–0తో లాయ్ చు ఎన్ (చైనీస్ తైపీ)పై... వికాస్ 5–0తో బ్రమహేంద్ర (ఇండోనేసియా)పై... సుమీత్ 4–1తో యు ఫెంగ్కాయ్ (చైనా)పై గెలిచారు. శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో దుస్మతోవ్ (ఉజ్బెకిస్తాన్)తో అమిత్; బతార్సుక్ (మంగోలియా)తో శివ థాపా; డాంగ్యున్ లీ (కొరియా)తో వికాస్; జఖోన్ (తజికిస్తాన్)తో సుమీత్ తలపడతారు. -
క్వార్టర్స్‌లో శివ, సుమీత్
ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్ తాష్కెంట్: ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత ప్లేయర్లు శివ థాపా, సుమీత్ సంగ్వాన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. 60 కేజీల విభాగంలో మంగళవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన శివ..ఒముర్బెక్ మలబెకోవ్ (కజకిస్తాన్)పై గెలుపొందాడు. క్వార్టర్స్‌లో చు ఎన్ లాయ్ (చైనీస్‌తైపీ)తో శివ తలపడనున్నాడు. మరోవైపు 91 కేజీల విభాగంలో జరిగిన ప్రిక్వార్టర్స్‌లో సుమీత్.. ఎర్దెన్బెయర్ సందగ్సురేన్ (మంగోలియా)ను ఓడించాడు. క్వార్టర్స్‌లో మూడోసీడ్ ఫెంగ్కాయ్ యు (చైనా)తో సుమీత్ తలపడనున్నాడు. మరోవైపు మనీశ్ పాన్వర్ (81 కేజీలు), కవీందర్ సింగ్ బిస్త్ (49 కేజీలు) కూడా క్వార్టర్స్‌కు చేరుకున్నారు. ప్రిక్వార్టర్స్‌లో జీ ఆర్ గుణరత్నపై మనీశ్ గెలుపొందగా.. అల్దోమ్స్ సుగురో (ఇండోనేసియా)పై కవీందర్ విజయం సాధించాడు. క్వార్టర్స్‌లో జాసుర్బెక్ లాతిపోవ్ (ఉజ్బెకిస్తాన్)తో కవీందర్ తలపడుతాడు. వీరితోపాటు వికాస్ కృషన్ (75 కేజీలు), గౌరవ్ బిధురి (56 కేజీలు), అమిత్ ఫంగల్ (49 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు) ఇప్పటికే క్వార్టర్స్‌కు చేరిన సంగతి తెలిసిందే. -
క్వార్టర్స్‌లో వికాస్, గౌరవ్
తాష్కెంట్: ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ముగ్గురు భారత బాక్సర్లు వికాస్ కృషన్ (75 కేజీలు), గౌరవ్ బిధూరి (56 కేజీలు), అమిత్ ఫంగల్ (49 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పతోమసక్ కుటియా (థాయ్‌లాండ్)తో జరిగిన బౌట్లో వికాస్ రెండు నిమిషాల్లోపే విజయం సాధించాడు. గౌరవ్ బిధూరి పాయింట్ల ప్రాతిపదికన యుటపాంగ్ తాంగ్డీ (థాయ్‌లాండ్)పై గెలుపొందగా, అమిత్ ఫంగల్ సునాయాసంగా రమీష్ రహమాని (అఫ్ఘానిస్తాన్)ను చిత్తు చేశాడు. అయితే మరో భారత ఆటగాడు ఆశిష్ కుమార్ 64 కేజీల విభాగంలో ఇక్బొల్‌జొన్ ఖొల్‌దరొవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. -
వికాస్‌కు రజతం
బ్యాంకాక్ : ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ వికాస్ క్రిషన్ రజతంతో సరిపెట్టుకున్నాడు. శనివారం జరిగిన 75 కేజీల ఫైనల్ బౌట్లో వికాస్ 0-2తో యూత్ ఒలింపిక్ చాంపియన్ బెక్టెమిర్ మిల్కుజియెవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడాడు. హోరాహోరీగా సాగిన ఈ బౌట్ లో ఇద్దరు బాక్సర్లు... ముఖాలపై పంచ్‌లు విసురుకున్నారు. తొలిరౌండ్లో ఉజ్బెక్ బాక్సర్ రైట్ హుక్స్, జబ్స్ పంచ్‌లతో వేగంగా పాయింట్లు సాధిం చాడు. రెండోరౌండ్లో అటాకింగ్‌కు దిగిన వికాస్.. ప్రత్యర్థి పంచ్‌లను నేర్పుగా తప్పించుకుంటూ స్కోరింగ్ చేశాడు. ఇక చివరి రౌండ్లో ఇరువురు పంచ్‌ల వర్షం కురిపించారు. అయితే మిల్కుజియెవ్ రెండు మూడు అద్భుతమైన అప్ప ర్ కట్స్‌తో వికాస్‌పై ఆధిపత్యం చెలాయించాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్... ఒక రజతం, మూడు కాంస్యాలను సొంతం చేసుకుంది.