వికాస్‌కు రజతం
బ్యాంకాక్ : ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ వికాస్ క్రిషన్ రజతంతో సరిపెట్టుకున్నాడు. శనివారం జరిగిన 75 కేజీల ఫైనల్ బౌట్‌లో వికాస్ 0-2తో యూత్ ఒలింపిక్ చాంపియన్ బెక్టెమిర్ మిల్‌కుజియెవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడాడు. హోరాహోరీగా సాగిన ఈ బౌట్ లో ఇద్దరు బాక్సర్లు... ముఖాలపై పంచ్‌లు విసురుకున్నారు. తొలిరౌండ్‌లో ఉజ్బెక్ బాక్సర్ రైట్ హుక్స్, జబ్స్ పంచ్‌లతో వేగంగా పాయింట్లు సాధిం చాడు. రెండోరౌండ్‌లో అటాకింగ్‌కు దిగిన వికాస్.. ప్రత్యర్థి పంచ్‌లను నేర్పుగా తప్పించుకుంటూ స్కోరింగ్ చేశాడు.
ఇక చివరి రౌండ్‌లో ఇరువురు పంచ్‌ల వర్షం కురిపించారు. అయితే మిల్‌కుజియెవ్ రెండు మూడు అద్భుతమైన అప్ప ర్ కట్స్‌తో వికాస్‌పై ఆధిపత్యం చెలాయించాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్... ఒక రజతం, మూడు కాంస్యాలను సొంతం చేసుకుంది.