న్యూఢిల్లీ: కరోనా వైరస్ నుంచి ఇంకా కోలుకోకపోవడంతో భారత మహిళా స్టార్ బాక్సర్ సిమ్రన్‌జిత్ (60 కేజీలు) ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు దూరమైంది. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన సిమ్రన్ ఈనెల 21 నుంచి జూన్ 1 వరకు దుబాయ్‌లో జరిగే ఆసియా చాంపియన్‌షిప్‌కు పంపించడంలేదని భారత బాక్సింగ్ సమాఖ్య తెలిపింది. పురుషుల విభాగంలో కరోనా నుంచి కోలుకుంటున్న ఆశిష్ (75 కేజీలు) కూడా ఆసియా చాంపియన్‌షిప్‌లో పాల్గొనేది అనుమానంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment