Boxer Vikas Krishan
-
బెస్ట్ బాక్సర్ వికాస్
న్యూఢిల్లీ: భారత స్టార్ బాక్సర్ వికాస్ క్రిషన్కు అరుదైన గౌరవం లభించింది. ఈ ఏడాది ‘ఉత్తమ ప్రొఫెషనల్ బాక్సర్’గా అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ-ఐబా) వికాస్‌ను ఎంపిక చేసింది. వచ్చే నెల 20న జరిగే ‘ఐబా’ సమావేశంలో ఈ అవార్డును వికాస్‌కు అందజేస్తారు. భారత్ నుంచి ఓ బాక్సర్‌కు ఈ పురస్కారం దక్కడం ఇదే ప్రథమం. హరియాణాకు చెందిన 24 ఏళ్ల వికాస్ రియో ఒలింపిక్స్‌లో 75 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. ‘నాకిది గొప్ప గౌరవం. అరుుతే నేనంతగా ఆనందంగా లేను. ఎందుకంటే రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించాలని ఆశించిన నాకు నిరాశే మిగిలింది’ అని ప్రస్తుతం అమెరికాలోని న్యూజెర్సీలో శిక్షణ తీసుకుంటున్న వికాస్ వ్యాఖ్యానించాడు. -
క్వార్టర్ ఫైనల్లో వికాస్
రియో డి జనీరో: ఇంకొక్క విజయం సాధిస్తే భారత బాక్సర్ వికాస్ క్రిషన్ యాదవ్ రియో ఒలింపిక్స్‌లో పతకాన్ని ఖాయం చేసుకుంటాడు. శనివారం జరిగిన పురుషుల మిడిల్ వెయిట్ (75 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్లో వికాస్ 3-0తో (30-27, 29-28, 29-28) సిపాల్ ఒండెర్ (టర్కీ)పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బాక్సింగ్‌లో సెమీఫైనల్‌కు చేరిన వారికి కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి. మూడు రౌండ్లపాటు జరిగిన ప్రిక్వార్టర్స్ బౌట్లో 24 ఏళ్ల వికాస్ ఆధిపత్యం కనబరిచాడు. దూకుడుగా ఆడుతూ తన ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించాడు. మూడో రౌండ్లో వికాస్ పంచ్‌లకు తట్టుకోలేక రక్తం కారుతున్న తన కంటికి చికిత్స చేయించుకునేందుకు సిపాల్ విరామం తీసుకోవడం గమనార్హం. సోమవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో 20 ఏళ్ల బెక్తెమిర్ మెలికుజియెవ్ (ఉజ్బెకిస్తాన్)తో వికాస్ తలపడతాడు. బెక్తెమిర్ 2015 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం, ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, 2014 యూత్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాడు. ‘నా గ్రూప్‌లో బెక్తెమిర్ క్లిష్టమైన ప్రత్యర్థి. క్వార్టర్స్‌లో అతణ్ని ఓడిస్తే నేను స్వర్ణంతోనే తిరిగి వస్తాను. గత ఆసియా చాంపియన్‌షిప్ ఫైనల్లో నేను సరైన ఫామ్‌లో లేనందున బెక్తెమిర్ చేతిలో ఓడిపోయాను. ఈసారి అతణ్ని ఓడిస్తాననే నమ్మకం ఉంది’ అని వికాస్ వ్యాఖ్యానించాడు. -
వికాస్‌కు రజతం
బ్యాంకాక్ : ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ వికాస్ క్రిషన్ రజతంతో సరిపెట్టుకున్నాడు. శనివారం జరిగిన 75 కేజీల ఫైనల్ బౌట్లో వికాస్ 0-2తో యూత్ ఒలింపిక్ చాంపియన్ బెక్టెమిర్ మిల్కుజియెవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడాడు. హోరాహోరీగా సాగిన ఈ బౌట్ లో ఇద్దరు బాక్సర్లు... ముఖాలపై పంచ్‌లు విసురుకున్నారు. తొలిరౌండ్లో ఉజ్బెక్ బాక్సర్ రైట్ హుక్స్, జబ్స్ పంచ్‌లతో వేగంగా పాయింట్లు సాధిం చాడు. రెండోరౌండ్లో అటాకింగ్‌కు దిగిన వికాస్.. ప్రత్యర్థి పంచ్‌లను నేర్పుగా తప్పించుకుంటూ స్కోరింగ్ చేశాడు. ఇక చివరి రౌండ్లో ఇరువురు పంచ్‌ల వర్షం కురిపించారు. అయితే మిల్కుజియెవ్ రెండు మూడు అద్భుతమైన అప్ప ర్ కట్స్‌తో వికాస్‌పై ఆధిపత్యం చెలాయించాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్... ఒక రజతం, మూడు కాంస్యాలను సొంతం చేసుకుంది. -
ఆసియా బాక్సింగ్ ఫైనల్లో వికాస్
మరో ముగ్గురికి కాంస్యాలు బ్యాంకాక్ : ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ వికాస్ క్రిషన్ ఫైనల్లోకి ప్రవేశించగా.. మరో ముగ్గురు కాంస్యాలతో సంతృప్తిపడ్డారు. శుక్రవారం జరిగిన 75 కేజీల సెమీస్ బౌట్లో వికాస్ 3-0తో వహీద్ అబ్దుల్రిదా (ఇరాక్)పై నెగ్గి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. మామూలుగా డిఫెన్సివ్కు ప్రాధాన్యమిచ్చే వికాస్... ఈ బౌట్లో మాత్రం అటాకింగ్‌తో చెలరేగాడు. పంచ్‌ల్లో వైవిధ్యాన్ని చూపెడుతూ ఇరాక్ బాక్సర్‌ను కట్టిపడేశాడు. +91 కేజీల సెమీస్ బౌట్లో సతీష్ కుమార్ 0-3తో వాంగ్ జిబావో (చైనా) చేతిలో; 49 కేజీల బౌట్లో దేవేంద్రో 1-2తో హసన్‌బాయ్ దుస్మతోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో; 56 కేజీల బౌట్లో డిఫెండింగ్ చాంపియన్ శివ తాపా 1-2తో ముర్జోన్ అక్హమదలివ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడారు.