ఆసియా బాక్సింగ్ ఫైనల్లో వికాస్ | Vikas in Asian Boxing Final | Sakshi
Sakshi News home page

ఆసియా బాక్సింగ్ ఫైనల్లో వికాస్

Published Sat, Sep 5 2015 2:15 AM | Last Updated on Sun, Sep 3 2017 8:44 AM

ఆసియా బాక్సింగ్ ఫైనల్లో వికాస్

ఆసియా బాక్సింగ్ ఫైనల్లో వికాస్

మరో ముగ్గురికి కాంస్యాలు
 
 బ్యాంకాక్ : ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ వికాస్ క్రిషన్ ఫైనల్లోకి ప్రవేశించగా.. మరో ముగ్గురు కాంస్యాలతో సంతృప్తిపడ్డారు. శుక్రవారం జరిగిన 75 కేజీల సెమీస్ బౌట్‌లో వికాస్ 3-0తో వహీద్ అబ్దుల్‌రిదా (ఇరాక్)పై నెగ్గి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. మామూలుగా డిఫెన్సివ్‌కు ప్రాధాన్యమిచ్చే వికాస్... ఈ బౌట్‌లో మాత్రం అటాకింగ్‌తో చెలరేగాడు. పంచ్‌ల్లో వైవిధ్యాన్ని చూపెడుతూ ఇరాక్ బాక్సర్‌ను కట్టిపడేశాడు. +91 కేజీల సెమీస్ బౌట్‌లో సతీష్ కుమార్ 0-3తో వాంగ్ జిబావో (చైనా) చేతిలో; 49 కేజీల బౌట్‌లో దేవేంద్రో 1-2తో హసన్‌బాయ్ దుస్మతోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో; 56 కేజీల బౌట్‌లో డిఫెండింగ్ చాంపియన్ శివ తాపా 1-2తో ముర్జోన్ అక్హమదలివ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement